484 రోజులు, 16 నెలలు … చంచల్ గూడ జైల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం బెయిల్ మీద విడుదల కాబోతున్నారు. వైఎస్ జగన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు. జగన్ బెయిల్ పిటిషన్ పై వచ్చే తీర్పు కోసం వై.ఎస్. భారతి, వై.ఎస్.వివేకానంద రెడ్డి నాంపల్లి కోర్టులో ఉన్నారు. జగన్ బెయిల్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. జగన్ ఆస్తుల కేసులో విచారణ పూర్తయిందని సిబిఐ కోర్టుకు తెలిపింది . హైకోర్టు ఆదేశించిన అన్ని అంశాలపై దర్యాప్తు పూర్తి చేశామని నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన మెమోలో వివరించింది. అయితే సాయంత్రం 4.50 నిమిషాలకు వైఎస్ భారతి కళ్లు ఆనందంతో నిండిపోయాయి. కోర్టునుండి తీర్పు వెలువడిన వెంటనే వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున కోర్టు వద్ద నినాదాలు చేశారు.
ఉదయం విడుదల
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్ సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి చంచల్ గూడ జైలు నుంచి రేపు ఉదయం విడుదలవుతారని ఆయన తరపు న్యాయవాది అశోక్ రెడ్డి చెప్పారు. నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు జగన్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ రోజు సమయం మించిపోయినందున జగన్ రేపు విడదల అవుతారని చెప్పారు. జగన్ హైదరాబాద్ వదిలి వెళ్లరాదని కోర్టు షరతు విధించింది. అలాగే రెండు లక్షల రూపాయల విలువైన రెండు పూచీకత్తులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. జగన్ తరపు న్యాయవాదులు పూచీకత్తులను రేపు సమర్పిస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more