ఏపీఎన్జీవో ఐకాస ఆధ్వర్యంలో విజయవాడలోని స్వరాజ్య మైదానంలో జరుగుతున్న సేవ్ ఎపి మహాసభకు భారీ సంఖ్యలో సమైక్య వాదులు తరలివచ్చారు. సభకు జెఎసి నేత సాగర్ అధ్యక్షత వహించారు. ఈ మహాసభలో పలువురు మాట్లాడారు.
ఉద్యోగులను అభినందించాలి - దేవినేని అవినాశ్
జీతం ముఖ్యంకాదు.. రాష్ట్ర ప్రజల జీవితం ముఖ్యమని చెప్పిన ఉద్యోగులను అభినందించాల్సిన అవసరం ఉందని విద్యార్థి ఐకాస నేత దేవినేని అవినాశ్ పేర్కొన్నారు. రాజకీయ నాయకులు, పార్టీలు పదివేల మందితో సమావేశం పెడితే గొప్పగా చెప్పుకునే వారని, ఈరోజు లక్ష మందితో ఈ సభ చేపట్టామని వివరించారు. ఎంతో మంది ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేస్తే.. కేవలం ఓట్లు, సీట్ల కోసం నేటి రాజకీయ నాయకులు పదవులు వదల్లేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే సీమాంధ్ర విద్యార్థులు స్థానికేతరులు అవుతారని పేర్కొన్నారు.
తెలుగు భాషకు ఘన చరిత్ర ఉంది - చలసాని
తెలుగు భాషకు ఘన చరిత్ర ఉందని, ఐదు దేశాల భాషలకు మన తెలుగే మూలమని ఆంధ్ర మేధావుల వేదిక అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. అవాస్తవ పునాదుల మీద తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ నగర నిర్మాణం చేపట్టినప్పుడు కోస్తా, రాయలసీమ ప్రాంతాలనుండి పైసా పైసా తరలించారనే విషయం అందరూ తెలుసుకోవాలన్నారు. ఈ చారిత్రక వాస్తవాన్ని ఖండించగలిగితే తెలంగాణ మేధావులను చర్చకు పంపాలని సవాలు విసిరారు. రాష్ట్రాన్ని విభజిస్తే విద్వేషం చెలరేగుతుందన్నారు.
ఆకలి చావులు తప్పవు - వెంకటేశ్
రాష్ట్రం విడిపోతే రెండు రాష్ట్రాల్లోనూ ఆకలి చావులు తప్పవని ఎమ్మార్పీఎస్ నేత వెంకటేశ్ పేర్కొన్నారు. ఇప్పటికే విడిపోయిన రాష్ట్రాలు దయనీయ స్థితిలో ఉంటే .. సుభిక్షంగా ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టాలనడం దుర్మార్గమని తెలిపారు. విభజన జరిగితే అణగారిన వర్గాలు రాజ్యాధికారం వైపు రావని, అడుగంటిపోతాయని పేర్కొన్నారు. సమైక్యాంధ్ర వల్లే అభివృద్ధి సాధ్యమన్నారు. అక్టోబర్ 10న హిందూపురంలో లక్షమంది మాదిగ, అణగారిన వర్గాల వారితో సభ పెడుతున్నామని ఆయన చెప్పారు.
తెలంగాణ పోరాటాన్ని నడిపింది ఆంధ్రమహాసభే - చక్రవర్తి
తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపించింది ఆంధ్ర మహాసభేనని విశాలాంధ్ర మహాసభ నేత నల్లమోతు చక్రవర్తి పేర్కొన్నారు. ఆంధ్ర మహాసభ నిజాం సంస్థానంలో నడిచిన గొప్ప సంస్థ అని ఆయన తెలిపారు. రావి నారాయణ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వారు ప్రాంతాలకు అతీతంగా కలిసి చేసిన పోరాటం మూలంగానే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్నారు. హైదరాబాద్ రాజధానిగా ఉండాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు సమైక్యత కోసం కర్నూలును త్యాగం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంకోసం బూర్గుల ముఖ్యమంత్రి పదవిని సైతం వదులుకున్నారని గుర్తు చేశారు. నిజాం పాలనలో తెలుగు ప్రజలంతా పన్నులు చెల్లించడం ద్వారానే హైదరాబాద్ నగరాన్ని నిర్మించారని తెలిపారు. ప్రస్తుతం ఒక్క ప్రాణం కూడా బలి కాకుండా సమైక్య రాష్ట్రాన్ని సాధించాలని పిలుపునిచ్చారు.
అంబేద్కర్ వాదానికి వక్రభాష్యం - కారెం శివాజీ
నేడు నేతలందరూ అంబేద్కర్ వాదానికే వక్రభాష్యం చెబుతున్నారని మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ ఆరోపించారు. అంబేద్కర్ ఏం మాట్లాడారో తెలియకుండా వారు మాట్లాడుతున్నారన్నారు. ఒక పార్టీ ఆకాంక్ష నెరవేర్చేందుకు, ఓట్లు సంపాదించుకునేందుకు రాష్ట్రాలను విభజించవద్దని అంబేద్కర్ రాశారన్నారు. రాష్ట్ర విభజన కోసం చేస్తున్న కుట్రలను బద్దలు చేయడానికి దళితులంతా ముందుకు వస్తున్నారని తెలిపారు. కేసీఆర్, కోదండరాంల ఆకాంక్షే తెలంగాణ ఉద్యమం తప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్ష కాదని ఆయన పేర్కొన్నారు. తప్పుడు నినాదాలతో దళితులను కొందరు సమైక్యవాదానికి దూరం చేస్తున్నారని, అనుమానాలను దూరం చేసేందుకే దళితులు సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నారని అన్నారు.
విభజన బిల్లు ఎలా వస్తుంది - జంధ్యాల రవిశంకర్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తే.. రాష్ట్ర విభజన బిల్లు ఎలా వస్తుందని న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను విడగొట్టే ధైర్యం ఢిల్లీ పెద్దలకు ఉందా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more