Revanth reddy comments on ys bharathi jewellery

revanth reddy comments on ys bharathi Jewellery, TDP MLA, Revanth Reddy, ys jagan wife ys bharathi, ys bharathi jewelries, chandrababu assets, bramani vs ys bharathi, tdp vs ysrcp, ys jagan vs chandrababu,

revanth reddy comments on ys bharathi Jewellery

జగన్ భార్య భారతి ఆభరణాల పై రెడ్డిగారు కన్ను?

Posted: 09/20/2013 12:09 PM IST
Revanth reddy comments on ys bharathi jewellery

రాజకీయ నాయకుల వ్యవహారం రోజు రోజుకి శ్రుతిమించిపోతున్నాయి. రాజకీయాలను పక్కన పెట్టి కుటుంబ విషయాలపై మక్కువ చూపుతున్నారు. ఆయ రాజకీయ కుటుంబల వ్యక్తుల పై కూడా రాజకీయ మరకలు పడుతున్నారు. రాజకీయ నాయకులకు ఎన్ని మరకలు పడితే.. అంత మంచిదని భావించే నాయకులు ఉన్నారు. కానీ వారి కుటుంబంలోని వ్యక్తుల పై కూడా రాజకీయ మరకలు పడితే మంచిది కాదని ..రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రీసెంట్ టిడిపి అధినేత కొత్త రాజకీయానికి తెరలేపిన విషయం తెలిసిందే. తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ప్రజలకు తెలియజేయటం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. రాష్ట్రం రావణా కష్టంలా రగుతున్న సమయంలో, రాష్ట్ర ప్రజల సమస్యలను పక్కన పెట్టి, తన కుటుంబలోని ఆస్తుల వివరాలను బయట పెట్టి, తన నిజాయితిని నిరూపించుకున్నట్లుగా పసుపు, కుంకుమ బొట్లు ఆయనకు ఆయనే పెట్టేసుకున్నారు. తొమ్మిది సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నాయుకుడిగా చంద్రబాబుకు అపారమైన అనుభవం ఉందని ఆపార్టీ నాయకులే గంటపదంగా మీడియా ముందు భజన చేస్తుంటారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడిగా ఆయనకు అంతే అనుభవం వచ్చింది. కానీ ప్రజల సమస్యల గురించి ఏరోజు పాదయాత్రలు, ఆత్మగౌరవ యాత్రలు చేయలేదు.

 

చంద్రబాబు అధికారం కోసం, ఆయన కుటుంబ నిజాయితీ కోసమే ఆస్తుల చిట్టాను బయటపెట్టిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు. అయితే చంద్రబాబు ప్రకటించిన కుటుంబ ఆస్తుల పై అనేక విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆ విమర్శలకు చంద్రబాబు సమాధానం చెబితే బాగుంటుంది. కానీ టిడిపి , ఇప్పటి వరకు ఎలాంటి మరకలు పడని యంగ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీడియా ముందు కొత్త విషయాన్ని బయటకు తీశారు. వైఎస్ జగన్ భార్య భారతి ఆభరణాలపై రేవంత్ రెడ్డి కన్నుపడింది. ఇటీవల బాలయ్య రెండో కూతురు పెళ్లిలో, చంద్రబాబు కోడలు , లోకేష్ బాబు భార్య బ్రహ్మణి ధరించిన వజ్రాభరణాల గురించి కొంచెం విపులంగా సాక్షి పత్రిక రాయటం జరిగింది. అంటే చంద్రబాబు ప్రకటించిన ఆస్తుల విషయం పై ప్రస్తవిస్తూ వజ్రాభరణాల రాయటం జరిగింది. ఈరోజలు బంగారం రేటు, వజ్రాల రేటు ఎంత ఉందో ప్రతి సామాన్యుడికి తెలిసిన విషయమే. వాటి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవరసం లేదు. కానీ చంద్రబాబు చెప్పిన ఆస్తి వివరాలకు, వారి విలాసంవంతమైన జీవనంపై పొంతనకుదరటం లేదని రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇప్పడు రేవంత్ రెడ్డి వైఎస్ జగన్ భార్య భారతి ఆభరణాల వివరాలు కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. జైల్లో ఉన్న జగన్ ని పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు వైఎస్ భారతి చెవులకున్న వజ్రాభరణాలు ఎన్ని రూ. కోట్ల విలువైనవో ముందు చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేయటం జరిగింది. ఎన్టీఆర్ , చంద్రబాబుల కుటుంబాలకు , వై.ఎస్ కుటుంబానికి పోలికే లేదని రేవంత్ రెడ్డి అన్నారు. వైఎస్ కుటుంబీకులకు చిత్తశుద్ది ఉంటే వారి ఆస్తుల వివరాలు, వారికున్న కంపెనీలు, పెట్టుబడులు గురించి చెప్పాలని రేవంత్ రెడ్డి అన్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more