New political party srs samaikyandhra rashtra samithi

new political party (SRS) Samaikyandhra Rashtra Samithi, Samaikhyandhra party, Samaikya Rastra Samiti, . Dr Vishwanatham, S Viswanadham SRS party, political party Samaikyandhra Rashtra Samithi

new political party (SRS) Samaikyandhra Rashtra Samithi

ఎస్ఆర్ఎస్ పార్టీ ఎవరి కోసం ?

Posted: 09/11/2013 02:26 PM IST
New political party srs samaikyandhra rashtra samithi

రాష్ట్రంలో రాజకీయ నాయకుల కంటే.. రాజకీయ పార్టీల సంఖ్య పెరిగిపోతుంది. రోజుకోక రాజకీయ పార్టీ తెరపైకి వస్తున్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పార్టీలు .. నీటి మీద బుడగలా.. కనిపించి వెంటనే మాయం అవుతున్నాయి. పిల్ల పార్టీలు పుడుతునే ఉన్నాయి. తల్లి పార్టీ మాత్రం పిల్ల పార్టీలను కలిపేసుకుంటుంది. అయితే ఈ పార్టీల ఎందుకు పుట్టుకొస్తున్నాయో, ఎవరి కోసం పుట్టుకొస్తున్నాయో? ఈ పార్టీ వల్ల ఎవరికి లాభం ఉంటుందో? మాత్రం ఎవ్వరికి తెలియదు. తెల్లవారితే.. ఒక కొత్త పార్టీ పుడుతున్న రోజులివి. ఇలా పుట్టే పార్టీ వెనుక ఏ రాజకీయ నాయకుడు హస్తం ఉందో తెలియదు గానీ, ఇలాంటి పార్టీల వల్ల ప్రజలకు ఉపయోగం లేదనే విషయం అర్థమవుతుంది. ఇప్పటికే ఉన్న పార్టీలు, నాయకులతో ప్రజలు నలిగిపోతున్న సమయంలో .. మరో కొత్త పార్టీ అంటే దాని పై అనేక అనుమానాలు రేకేత్తున్నాయి. సీమాంధ్రలో మరో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో రాజకీయ సమీకరణలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ శక్తుల పునరేకీకరణకు అన్ని పార్టీల్లోని నేతలు భారీగా కసరత్తు ప్రారంభించారు. అయితే విజయవాడకు చెందిన డాక్టర్‌ విశ్వనాథం అనే వ్యక్తి సమైక్యాంధ్ర రాష్ట్ర సమితి (ఎస్‌ఆర్‌ఎస్) పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. దీనికి ఎన్నికల సంఘం నుండి కూడా అనుమతి కూడా లభించినట్లు సమాచారం కూడా వస్తుంది. అయితే పార్టీ స్థాపించిన విశ్వనాథం కేవలం ఒక డాక్టర్ మాత్రమే. ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసమే ఈ పార్టీ అని ఇది సీమాంధ్ర ప్రజల పార్టీ అని ప్రకటించారు. అయితే అది నిజంగానే ప్రజల పార్టీయేనా? రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్‌ అధినాయకత్వం నిర్ణయం ప్రకటించాక సీమాంధ్ర ప్రాంతంలో కొత్త పార్టీ ఆవిర్భవిస్తుందన్న ప్రచారం ఉవ్వెత్తున సాగింది. కాంగ్రెస్‌ పార్టీలోని కొందరు కేంద్ర మంత్రులు, లోక్‌సభ సభ్యులు, రాష్ట్ర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు కలిసి ఈ కొత్త పార్టీ ఆవిర్భావానికి మంతనాలు జరుపుతున్నట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ఆర్ఎస్ఎస్ పార్టీ వెనుక విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ కీలకపాత్ర పోషించినట్టు అత్యంత విశ్వసనీయం సమాచారం. కోస్తా జిల్లాకు చెందిన ముగ్గురు కేంద్ర మంత్రులు కూడా అండగా ఉన్నట్లుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ఎస్ఆర్ఎస్ పార్టీని సీమాంద్ర ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more