తన ఉపన్యాసాలతో, కీర్తనలతో, నృత్యాలతో భక్తులను పరవశింపజేసే రాజస్థాన్ కి చెందిన ఆసారామ్ బాపూని జోధ్ పూర్ ఆశ్రమానికి తరలించారు. ఈరోజు కోర్టులో ప్రవేశపెడతారు. 72 సంవత్సరాల ఆసారామ్ బాపూ 16 సంవత్సరాల బాలికను లైంగికంగా వేధించిన కేసులో ఆరోపణను ఎదుర్కుంటున్నారు. నిన్న ఈ రోజు ఉదయం నుంచి నిజం రాబట్టటటంకోసం పోలీసులు ఆసారామ్ ని ప్రశ్నిస్తునేవున్నారు.
ఆయన పూర్తిగా సహకరించి సమాధానాలు చెప్తున్నారుని కూడా సమాచారం అందింది. ఆసారామ్ బాపూ ఈ ఆరోపణను ఖండిస్తూ తాను నిర్దోషననే అంటున్నారు. ఆయన కుమారుడు ఈ ఘటనలో తప్పంతా బాలికదేనని, ఆ అమ్మాయి మానసికంగా అనారోగ్య పరిస్థితుల్లో ఉందని అంటున్నారు.
ఆసారామ్ ని నిన్న ఆశ్రమానికి తీసుకెళ్ళటానికి కారణం, జరిగిన సంఘటనలో ఆయన ఏం చేసారన్నది అదే స్థలంలో ఆయనను చేసి చూపించమని చెప్పటానికే. ఆసారామ్ మీద వైద్య పరీక్షలు నిర్వహించగా ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టుగా రిపోర్ట్ వచ్చింది.
లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పిన బాలిక మధ్యప్రదేశ్ లోని ఆసారామ్ ఆశ్రమంలో చదువుకుని అక్కడే హాస్టల్ లో ఉంటోంది. ఆమెను ఆవహించిన ఆత్మనుంచి విముక్తి కలిగిస్తాననే నెపంతో లైంగికంగా వేధించారని ఆ అమ్మాయి కేసు పెట్టటంతో ఆసారామ్ బాపూని మధ్య ప్రదేశ్ లోని ఇందోర్ ఆశ్రమంలో శనివారం అర్థరాత్రి అరెస్ట్ చేసారు. బాధితురాలు బాలిక అవటం వలన ఆయన ఎన్నో కేసులను ఎదుర్కుంటున్నారు.
రాజస్థాన్ మౌంట్ అబులో 70 రోజులు ధ్యానంలో కూర్చుని వచ్చారని చెప్పుకుంటున్న ఆసారామ్ 1960లో మొదలుపెట్టి దేశంలో ఇప్పటికి 200 ఆశ్రమాలను స్థాపించారు. ఆయన కుమారుడు నారాయణ్ ప్రేమ్ సాయి కూడా ఆధ్యాత్మిక గురువుగానే ఉన్నారు. 2008 లో ఆయన కజిన్స్ చనిపోయిన దగ్గర్నుంచి ఏదో ఒక విషయంలో వివాదంలో చిక్కుకుంటునే ఉన్నారు. ఆశ్రమాల విషయంలో కబ్జాలు చెయ్యటం, ఢిల్లీ వైద్య విద్యార్థిని మీద అత్యాచారం జరిగిన విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యానాలు ఇలా ఏదో ఒక విధంగా ఆసారామ్ ఆరోపణలను ఎదుర్కుంటూ వార్తలలోకి ఎక్కుతూనేవున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more