ఈ రోజు శ్రావణ పౌర్ణమి .ఈ రోజు అన్నా,చెల్లుళ్ళు ఎంతో ఆనందం గా రాఖీ పండుగను జరుపుకుంటారు !
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పండుగను నేటితరం ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటోంది. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి... కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నదీ అని ఓ చెల్లెలు తన అన్నయ్య అనురాగం గురించి పాడడంలో ఎంతో అర్థముంది... తనను ప్రాణంకన్నా మిన్నగా ప్రేమించే అన్నయ్యలంటే ఈ ప్రపంచంలో ప్రతి చెల్లెలికీ అభిమానం, అనురాగం, ఆప్యాయత. ఇంతటి ఆత్మీయతను పంచే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక ‘రక్షాబంధన్' పండుగ. దుర్బలులను దుర్మార్గులనుంచి కాపాడాలన్న సంస్కృతికి నాగరకతకు ప్రతీక రాఖీ. ప్రతి యేటా శ్రావణమాసంలో వచ్చేపౌర్ణమినే శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి అంటారు. ఉత్తర భారతంలో ఈ పండుగను కజ్రీ పూర్ణిమ అని కూడా అంటారు. అక్కడ ఈ సమయంలోనే రైతులు గోధుమ, బార్లీ నాట్లు వేయటం విశేషం. ఒక కుటుంబంలోనే కాక యావత్ సమాజంలో సోదర ప్రేమకు, సుహృద్భావానికి రాఖీ ప్రతీక నిలుస్తుంది.
సమాజంలో సామరస్యానికి పునాది వేస్తుంది. శాంతియుత సహజీవనానికి రాజమార్గం రాఖీ. గురుదేవులు విశ్వకవి రవీంద్రుడు రాఖీ ఉత్సవాలను భారీ ఎత్తున జరిపించేవారు. ఒక పురుషుడు సాటియువతిపై హద్దుమీరిన మమకారం పెంచుకున్న సందర్భంలో ఆ సదరు యువతికి అతనిపై ఇష్టం లేనట్లయితే... ఆ మక్కువను స్నేహానికే పరిమితమని అది సోదర ప్రేమగా మాత్రమే ఉంటే బాగుంటుందని సున్నితంగా సూక్షంగా రాఖీ ద్వారా తెలియజేస్తుంది. అలాంటి పవిత్ర సోదర ప్రేమకు ప్రతీక అయిన రాఖీ పండుగ మూలాలు ఇప్పటివి కావు. చరిత్రలో ఎందరో ప్రముఖులు రాఖీ ద్వారా తమ సోదరప్రేమను చాటుకున్నారు. శ్రావణ పౌర్ణమి రోజున వచ్చే రక్షాబంధన్ రంగు రంగుల దారాలతో ముడిపడి ఉంది. రాఖీలో ఉండే దారాలు అన్నా, చెల్లెళ్లు, అక్కాతముళ్ల అనుబంధానికి గుర్తులాంటివి.
అందుకే ఈ రాఖీలను పవిత్రంగా భావిస్తారు. సోదరి పంపిన రాఖీ మరచిపోలేని జ్ఞాపికగా మిగిలిపోవడమేగాక సోదరుడికి అండగా ఉంటుంది. ఉత్తరం భారతదేశంలో సంప్రదాయమైన ఇప్పుడు రక్షాబంధన్ పండుగ దేశమంతట ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. చెల్లెలు రాఖీ కట్టిందటే సర్వకాలం సర్వావస్థలలోనూ రక్షగా ఉండమని అన్నయ్యను కోరడమని అర్థం. అలాగే అన్నకు అన్నివేళలా రక్షించే శక్తిని ఇవ్వాలని ప్రార్థించడం.రాఖీ కట్టిన సోదరికి కానుకలివ్వడం మన సంప్రదాయంలో భాగం. అది మిఠాయి కావచ్చు, నగదు కావచ్చు. చెల్లెళ్లకోసం సర్వస్వం త్యాగం చేసినవారు చరిత్రలో ఉన్నారు. దానవుల నుంచి రక్షణకోసం శచీదేవి ఇంద్రుడికి, యుద్ధంలో విజయంకోసం కుంతీదేవి అభిమన్యుడికి, విజయంకలగాలని ఖడ్గానికి శివాజీ కట్టారు. కాలంతోపాటే పండుగ తీరూ మారుతోంది.
అన్నలున్న చెల్లాయిలకు, తమ్ముళ్ళు న్న అక్కయ్యలకు ......... తెలుగువిశేష్... "రాఖీ శుభాకాంక్షలు "
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more