సీమాంధ్రంతా రాష్ట్ర విభజన ప్రకటనతో అట్టుడికిపోతోంది. సిడబ్లుసి తన ప్రకటనను ఉపసంహరించుకోవాలని, అంతవరకూ పోరాటం ఆగదని ఉద్యమకారులు వెల్లడి చేస్తున్నారు.
నిన్నటి నుంచి ఆంధ్ర ఎన్జీవో ఉద్యోగ సంఘం చేస్తున్న సమ్మెలో భాగంగా ఈ రోజు హైద్రాబాద్ సచివాలయంలో ఉద్యమకారులంతా కలిసి సహపంక్తి భోజనాలు చేసారు. సీమాంధ్రలో బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోవటం, రాష్ట్రానికి ఆదాయం తీసుకువచ్చే శాఖలలోని ఉద్యోగుల సమ్మె, వెరసి రాష్ట్రానికి, ఆర్ టి సి కి, ఎంతో నష్టాన్ని కలుగుజేస్తున్నాయి.
వీటన్నిటితోపాటుగా చాలా కాలంగా లేని తెలంగాణా ఉద్యమం కూడా తలెత్తిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇక ఎడా పెడా మద్దెల దరువే.
అదే జరుగుతోంది. ఈ రోజు తెలంగాణా ఉద్యోగ సంఘ నేతలు జలసౌధ లో ధర్నా చేసారు. తెలంగాణా బిల్లును పార్లమెంటులో ఇంకా ఎక్కువ కాలాతీతం చెయ్యకుండా ప్రవేశపెట్టిమని వారి డిమాండ్.
విద్యుత్ సౌధలో ఒకపక్క తెలంగాణా మరోపక్క ఆంధ్ర ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఆంధ్ర ఉద్యోగులకు మద్దతునిస్తున్న తులసిరెడ్డిని తెలంగాణా ఉద్యమకారులు అడ్డుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా తయారైంది.
అయితే, ఈ సమస్యను తీర్చటం ఎవరికి తరమా అని రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. కరవమంటే కప్పకు కోపం, వద్దంటే పాముకు కోపమన్నట్లు, తెలంగాణా రాష్ట్రం కావాలని ఆ ప్రాంతం, రాష్ట్ర మంతా సమైక్యంగా ఉండాలని మిగతా ప్రాంతమంతా కోరుతుంటే, ఇరు ప్రాంతాలకూ న్యాయం చేస్తూ పరిష్కారం చెయ్యటం ఎవరికీ సాధ్యం కాదు.
ఇప్పటి వరకూ ఏదో ఒక ప్రాంతంలో ఉన్న ఉద్రిక్తతలతో ఎలాగో నెట్టుకొస్తున్న ప్రభుత్వానికి ఇక ఇరు ప్రాంతాలలోనూ ఒకేసారి ఉద్యమం మొదలౌతే ఏ నిర్ణయం తీసుకోలేక విషయానికి పీటముడి పడేట్టుంది. లాగినకొద్దీ బిగుసుకుంటుందే కానీ పీటముడి వదులవదు.
ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తాను చెయ్యగలిగిందంతా చేస్తోంది. అందులో ఒకటి తాత్సారం చెయ్యటానికి మార్గాలు వెదుక్కోవటం, రెండవది జరుగుతున్న సంక్షోభానికంతా కారణం తెలుగు దేశం పార్టీ మీద కానీ లేదా దివంగత నేత వైయస్ ఆర్ మీద కానీ, వీలయితే ఇరువురి మీదా వెయ్యటం కానీ చేస్తుంది. అయినా ఈ సంక్షోభంలో కాంగ్రెస్ పార్టీ కాబట్టి తట్టుకుంటోంది. ఇతర పార్టీలెవరైనా ఈ స్థితిలో ఉంటే కాంగ్రెస్ ఒత్తిడికి తట్టుకోలేక పోయేవారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more