Rtc staff strike on august 12 to hit services

rtc staff strike on august 12 to hit services,seemandhra rtc staff strike, telangana rtc staff strike, august 12 midnight, all the services bandh, rtc staff strike on august 12, minister botsa satyanarayana, ak khan, breaking news, ap politics, political news, andhra news, seemandhra rtc unions called bandh, telangana rtc unions called bandh, seemandhra and telangana rtc unions strike from august 12

RTC staff strike on August 12 to hit services

ఇటు.. అటు.. సమ్మె..ఆందోళన చెందుతున్న ఆర్టీసీ ?

Posted: 08/08/2013 09:51 AM IST
Rtc staff strike on august 12 to hit services

ఇన్నాళ్లూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చవిచూసిన ఆర్టీసీ యాజమాన్యం.. ఏనిమిది రోజులుగా సమై క్యాంధ్ర ఆందోళనలతో నలిగిపోతోంది. ప్రత్యేక తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్ఠానం తన నిర్ణయాన్ని ప్రకటించినప్పటి నుంచీ సీమాంధ్ర జిల్లాల్లో ఆందోళనలను ఏకధాటిగా కొనసాగుతున్నాయి. బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీనికితోడు సమ్మె ముప్పునూ ఎదుర్కొంటోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్రలో గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయిస్‌ యూనియన్‌.. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లోనే ప్రత్యేక తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలంటూ తెలంగాణ మజ్దూర్‌ యూని యన్‌లు సమ్మె నోటీసు ఇచ్చాయి. సమైక్య ఉద్యమానికి నేతృత్వం వహిస్తోన్న ఏపీఎన్జీవోలకు మద్దతుగా ఈ నెల 12 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని సీమాంధ్రలో ఎంప్లాయిస్‌ యూనియన్‌ నేతలు ఆర్టీసీకి చెందిన స్థానిక ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లకు సమ్మె నోటీసు ఇచ్చారు. విజయనగరం, విజయవాడ, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లో ఈయూ నేతలు విడివిడిగా భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని విభజించడాన్ని నిరసిస్తూ ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొనసాగించడంలో భాగంగా.. ఏపీ ఎన్జీవోలకు తాము మద్దతు పలుకుతున్నామని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌పై తాము నిరవధిక సమ్మెను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ప్రకటనను వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

బిల్లు కోసం ఏ క్షణమైనా సమ్మెకు వెళ్తాం: టీఎంయూ

సీమాంధ్ర ఎంప్లాయిస్‌ యూనియన్‌లో నెలకొన్న పరిణామాలను గుర్తించిన తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ వెంటనే స్పందించింది. తెలంగాణ బిల్లు కోసం తామూ సమ్మెకు వెళ్తామని ప్రకటించింది. ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే ప్రత్యేక తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్న డిమాండ్‌పై ఏ క్షణంలోనైనా నిరవధిక సమ్మెకు దిగుతామని స్పష్టంచేసింది. ఈ మేరకు టీఎంయూ నేతలు అశ్వత్థామరెడ్డి తదితరులు బస్‌భవన్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (పరిపాలన) వెంకటేశ్వర్‌రెడ్డికి సమ్మె నోటీసును అందజేశారు. కాంగ్రెస్‌పార్టీ మరోసారి మోసం చేసే ప్రమాదం ఉందని టీఎంయూ నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. డిసెంబర్‌ 9 ప్రకటన నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పార్లమెంట్‌ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదం లభించేంత వరకూ సమ్మె కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.

సమ్మెకు వెళ్లొద్దు.. రవాణామంత్రి

ఆర్టీసీకి పొంచివున్న సమ్మె ముప్పు నేపథ్యంలో.. రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చొరవ చూపారు. ఎంప్లాయిస్‌ యూనియన్‌, తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్లతో తన నివాసంలో భేటీ అయ్యారు. సమ్మెకు వెళ్లొద్దని సూచించారు. ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు, ఆయా యూనియన్ల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. శ్రావణమాసంలో పెళ్లిళ్ల సీజన్‌ ఆరంభం అవుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో సమ్మెకు వెళితే ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురిఅవుతారని అన్నారు. ఆర్టీసీ పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు. ఇప్పటికే సంస్థ రూ.3 వేల కోట్ల నష్టాలు, మరో రూ.4 వేల కోట్ల రుణభారంతో ఉందని అన్నారు. ఇటీవలే ఈయూ, టీఎంయూల డిమాండ్లను అంగీకరించామని గుర్తుచేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన ఎలాంటి విషయాన్నయినా సంస్థ యాజమాన్యం దృష్టికి తీసుకుని రావాలని అన్నారు. అంతే తప్ప సమ్మెకు వెళ్లి, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించ వద్దని చెప్పారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more