ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ సమావేశాలు ముగిసేలోపే విభజన విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ రాష్ట్రంలో పర్యటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సీమాంధ్రలో ఉద్యమాలు ఉవ్వెత్తున్న ఎగసిపడుతుండడంతో కేంద్ర మంత్రి ఆంటోని నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ వీలైనంత త్వరగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఆయా ప్రాంతాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలు, ఉద్యమకారులు, ఎన్‌జీవోలు, జెఎసి నేతలతో చర్చించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈనెల 30 వరకు కొనసాగనున్నాయి. ఈలోపే రెండు మూడు రోజులపాటు రాష్ట్రంలో మకాం వేసి పరిస్థితిని చక్కదిద్దాలని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశం ఇచ్చినట్టు సమాచారం. పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్‌సింగ్‌తోపాటు మొయిలీ, అహ్మద్ పటేల్ , ఆంటోనీ కలిసి ఈ కమిటీలో ఉంటారని సోనియాగాంధీ చెప్పారు. అయితే ఈ కమిటి రాష్ట్రానికి వచ్చే అవకాశాలున్నాయి.
రాష్ట్ర విభజనకు సంబంధించి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి సీమాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. సీమాంధ్ర ఉద్యమం వల్ల గత వారం రోజులుగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అభివృద్ధి ఆగిపోయిందని, పాఠశాలలు, కళాశాలలు పనిచేయడంలేదని, వాణిజ్య సంస్థలు మూతపడుతున్నాయనీ ప్రభుత్వ కార్యాలయాలకు అధికారులు, ఉద్యోగులు రావడమే మానేశారని దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని పార్టీ పెద్దలకు నివేదిక అందింది. రాష్ట్రంలో ఈ నలుగురు పంచాయతీ ఎటువైపు దారితీస్తుందో ఎవరికి అర్థం కావటలేదు. కానీ రాష్ట్ర విభజనపై రాష్ట్రంలో మూడు ప్రాంతాల మధ్య ఒకరకమైన రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తానని దిగ్విజయ్‌సింగ్ ఇచ్చిన హామీ వెనుక పరమార్థం ఏమైవుంటుందని ఇరుప్రాంతాలకు చెందిన నేతల్లో సస్పెన్స్ నెలకొనివుంది. ఏ ఉద్దేశంతో దిగ్విజయ్ ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారనే అంశంపై నేతలు ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని చూసి ఆయన ఈ ప్రాంత నేతలను సంతృప్తి పరచేందుకు ఈ తరహా ప్రకటన చేశారా అన్న అంశంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
రాష్ట్రానికి వస్తున్న ఆంటోని కమిటి పంచాయతీలో ఉన్నత స్థాయి కమిటీ తమ ప్రాంత నేతలను బుజ్జగించే ప్రయత్నం చేస్తుందని, అయితే గతంలో చేసిన తమ డిమాండ్లను తిరిగి ఈ కమిటీ ముందుంచుతామే తప్ప కొత్తగా ఎటువంటి షరతులు విధించమని ఆ నేత పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని శాశ్వతంగా ఉమ్మడి రాజధానిగా చేయాలన్న డిమాండ్‌ను మరోమారు అధిష్టానం ముందు పెడతామన్నారు. ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తే కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్‌ను చేయాలని కోరనున్నట్లు చెప్పారు. లేనిపక్షంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్‌ను చేయాలన్న ప్రతిపాదనను ఈ కమిటీ ముందుంచుతామని తెలిపారు. ప్యాకేజీలకు ఇతరత్రా ఊరడింపులకు తాము అంగీకరించమని ఆ నేత తేల్చి చెప్పారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలను పార్టీ అధినాయకత్వం కూడా తీవ్రంగానే తీసుకుంటుందనీ, అయితే ఆంటోని కమిటీ రాష్ట్రానికి వచ్చి తిరిగి వెళ్ళాక విభజన విషయంలో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయని ఆ నేత అభిప్రాయపడ్డారు.
అయితే ఈ నలుగురు పంచాయతీ హడావుడి పార్లమెంటు ముగిసేవరకే అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. సీమాంద్రుల నుంచి వచ్చే ఒత్తిడి ఎలాగోలా ఎదుర్కోవాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఉన్నత స్థాయి కమిటీ పేరిట కొత్త అధ్యాయానికి తెరదీసినట్లు వినికిడి. ప్రస్తుతం కమిటీ సభ్యులుగా చెబుతున్న ఆంటోనీ, దిగ్విజయ్ సింగ్, మొయిలీ, అహ్మద్ పటేల్ లకు విషయం కొత్తకాదని, సీడబ్ల్యూసీలో గానీ, కోర్ కమిటీలోగానీ వీరంతా పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాతే రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం వెలువరించారని చెబుతున్నారు. అందువల్ల ఇప్పుడు కొత్తగా ఈ నలుగురు పంచాయతీ వల్ల పెద్దగా ప్రయోజనమేమీ ఉండదన్న విమర్శ ఉంది. సీమాంద్రలో జరుగుతున్న ఉద్యమాలను శాంతపరచడం , ఢిల్లీలో ఏదో జరగబోతోందన్న అభిప్రాయం కల్పించడమే తప్ప కమిటీ వల్ల పెద్ద ఉపయోగం ఉండదని పార్టీ ఎంపీలే చెబుతున్నారు. ఆంటోనీ అధిష్టానం మనోభావాలకు వ్యతిరేకంగా వెళ్లబోరని, చివరకు ఆయన సోనియా ఏది చెబితే అది చేస్తారని పేర్కొంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more