Where is the new locations for telugu movies

new locations for telugu movies, cinema of andhra pradesh, ndhra pradesh film chamber of commerce, telugu film industry, film industry unlikely to shift to vizag, telangana state, ap state bifurcation, impact on telugu cinema, telugu film industry, bifurcation affects film industry, aicc announcement on state, separate telangana, state division affects box office , breaking news, film news, movie reviews, telugu movies

Where is the New locations for Telugu Movies

సినిమా లొకేషన్‌ ఎక్కడ?

Posted: 07/31/2013 08:16 AM IST
Where is the new locations for telugu movies

దశాబ్దాలుగా మద్రాసులో పాతుకుపోయిన తెలుగు చిత్రపరిశ్రమను, ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటయ్యాక, సొంత రాష్టంలో చిత్ర పరిశ్రమ ఉండాలనే తెలుగు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా, అప్పటి ప్రభుత్వాలు అనేక ప్రోత్సహకాలు ఇవ్వడంతో క్రమక్రమంగా తెలుగు సినీపరిశ్రమ హైదరాబాద్‌లో స్థిరపడింది. కళాకారుల కోసం ప్రత్యేకంగా ఫిల్మ్‌నగర్‌ ఏర్పాటుచేసి ఇంటిస్థలాలు ఇచ్చారు. సినిమా స్టూడియోల కోసం రాయితీలతో భూములిచ్చారు. కార్మికుల కోసం చిత్రపురి కాలనీని ఏర్పాటుచేశారు. అలాగే రాష్ట్రంలో తీసే చిత్రాలకు వినోదపు పన్ను రాయితీలు కల్పించారు. ఇన్ని ప్రొత్సహాల నడుమ చిత్రపరిశ్రమ హైదరాబాద్‌లో స్థిరపడింది.

 

అంతేకాదు ఇతర భాషలకు చెందిన సినిమాలు సైతం నిర్మాణం జరుపుకునే కేంద్రంగా అభివృద్ది చెందింది. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర నిర్మాణ ప్రముఖుల మనసులో ఏముంది? తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఏర్పాటు కానుండడంతో చిత్రపరిశ్రమకు వ్యాపారపరంగా అదనపు సౌకర్యమే తప్ప ఇబ్బంది లేదని కొందరు నిర్మాతలు భావిస్తుంటే, సినిమారంగంలో ఆంధ్ర ప్రాంతానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారనేది మరో వాస్తవం. హైదరాబాద్‌లోనే స్టూడియోలు, రికార్డింగ్‌ థియేటర్లు, ఆర్టిస్టుల స్థిరనివాసాలు వంటివి ఉండడం, హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉంటుందని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ నుండి తరలిపోయే ప్రశ్న ఉత్పన్నంకాదని పలువురు నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తమ భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేకుంటే, హైదరాబాద్‌ కేంద్రంగా సినిమా నిర్మాణ రంగాన్ని కొనసాగించడంలో తమకు అభ్యంతరం ఉండదని సినీ వర్గాల అభిప్రాయం.

 

గతంలోనే తెలంగాణ ఫిలింఛాంబర్‌ ఏర్పాటైన విషయాన్ని మరికొందరు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఈ ప్రాంతంలో తెలంగాణ చాంబరే సిని నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషిస్తుందనే మరో వాదన కూడా ఉంది. చిత్ర పరిశ్రమని తమ రాష్ట్రంలో అభివృద్ది చెందేలా చేయడానికి ఆయా ప్రభుత్వాలు రాయితీలు ప్రకటించే అవకాశం ఉంది. తెలుగు సినిమాను కూడా రెండుగా చీల్చడానికి ఏర్పడబోయే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేసే అవకాశమూ ఉంది. పదేళ్లపాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉండడం వల్ల ప్రస్తుతానికి ఎలాంటి సమస్యలు తలెత్తవని భావిస్తున్నవారే ఎక్కువగా ఉన్నారు

 

వందశాతం స్థిరపడిన చిత్రపరిశ్రమ మరొక చోటుకు తరలించడం అంతసులువుకాదని సినీ పరిశీలకులు అంటున్నారు. కార్మికుల కోసం 64 ఎకరాల్లో నిర్మిస్తున్న చిత్రపురి సిద్ధం అవుతోంది. పరిశ్రమ అభివృద్దిలో భాగంగా రామానాయుడు, అక్కినేని, రామోజీరావు వంటి ప్రముఖులు సిని శిక్షణ సంస్థలను నెలకొల్పారు. మద్రాసు నుండి విడిపోయి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినపుడు దశాబ్దాలుగా చిత్రపరిశ్రమ అక్కడే ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే వైజాగ్‌లో ఇటీవల కాలంలో చిత్ర నిర్మాణం ఎక్కువగా జరగడం, రామానాయుడు లాంటి అగ్ర నిర్మాత సాగర నగరంలో స్టూడియో నిర్మాణానికి తలపెట్టడం. కాకతాళీయం కాదనే వాదమూ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more