కోర్ కమిటీ భేటీ తరువాత నేడు జరగనున్న రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం రసవత్తరంగా మారనుంది. కోర్ కమిటీ భేటీలో రోడ్ మ్యాప్ లతో సహా తన సమైక్య వాదాన్ని వినిపించిన ముఖ్యమంత్రికి నేడు మంత్రి వర్గంలో తలనొప్పులు తప్పేలా లేవు. కోర్ కమిటీకి ముందు కిరణ్ ఎప్పుడు తెలంగాణ నిర్ణయం అధిష్టానం చేతుల్లో ఉంది. వారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చిన కిరణ్ కోర్ కమిటీలో మాత్రం ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తెలంగాణలో మళ్లీ నక్సలైట్లు బలోపేతం అవుతారని, జల వివాదాలు, విద్యుత్ సమస్యలు తలెత్తుతాయని, ఇందిరమ్మ మాట జవదాటి రాష్ట్రాన్ని విభజిస్తారా అంటూ తన సమైక్య వాదాన్ని వినిపించారనే వార్తలు ప్రచారం లో ఉన్న విషయం తెలిసిందే. కోర్ కమిటీ భేటీ లో సమైక్యాంద్రకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే సీమాంద్ర నాయకులు రాజీనామానాలు చేస్తామని, అందులో ముఖ్యమంత్రి కూడా ఉంటాడని హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో కిరణ్ సీమాంద్రకు అనుకూలంగా చెప్పడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ మంత్రులు మాత్రం కిరణ్ భేటిలో వినిపించిన సమైక్యవాదంలో కోపంతో ఊగిపోతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే కేబినెట్ సమావేశంలో తెలంగాణ మంత్రుల వైఖరి ఎలా ఉంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రుల్లో కొంతమంది పలు అంశాల్లో ముఖ్యమంత్రికి గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. తెలంగాణ విషయం వచ్చేసరికి ఆయన వైఖరిని సమర్థించడంలేదు. అలాగని, బహిరంగంగా వ్యతిరేకించడమూ లేదు. కానీ నేడు జరిగే సమావేశంలో మంత్రులు ముఖ్యమంత్రికి కడిగేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి ఈ భేటీని ముఖ్యమంత్రి ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more