అప్పుడు కుటుంబికులే.. నేడు విడదీయ్యటానికి సిద్దమవుతున్నారు. ఆ రోజు రెండు ఉద్యమాన్ని తొక్కిపారేసి, కలిపారు. ఇప్పుడు మీరే విడదీస్తారా..? అసలు అప్పుడే కలపకుండా ఉంటే.. ఈరోజు ఈ పరిస్థితి వచ్చికాదు. ఆ రోజు రెండు ప్రాంతాలు వారు మమ్మల్ని కలపకండి బాబు అంటూ.. నెత్తినోరు బాదుకున్నారు. ప్రజలు మాటలు వినకుండా, రెండు ప్రాంతాలు కలిసి ఉండాలనే ఉద్దేశంతో కలిపేసారు. తెలుగు ప్రజలకు ఆదినుంచి అన్యాయమే జరుగుతోంది.బీటిష్ కాలంలో తెలుగువారిని మద్రాసీయులుగా పరిగణించారు. స్వాతంత్య్రానంతరం భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా చెన్నైతో కూడిన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం తెలుగుప్రజలు ఉద్యమించారు.
కేంద్రంలోని తంబీల వ్యూహానికి అప్పటి ప్రధాని నెహ్రూ తలొగ్గారు. చెన్నై లేకుండానే ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. తెలుగుమాట్లాడే వీరిని మూడు భాగాలుగా కేంద్రం విభజించింది. తెలంగాణా ప్రాంతాన్ని ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేసింది. మరో రెండు ప్రాంతాల్ని కర్ణాటక, మహరాష్ట్రల్లో కలిపేసింది. తెలంగాణా ప్రాంత ప్రజలకు ఆదినుంచి సీమాంధ్రుల్తో కలవడం ఇష్టంలేదు. తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ కోరినప్పటికీ వారి ఆకాంక్షను కేంద్రం పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌ను విడదీయాలని రెండు ప్రాంతాల ప్రజలూ ఉద్యమాలు చేశారు. తెలంగాణా పోరాటానికి నాయకత్వం వహించిన చెన్నారెడ్డి తదితరుల్ని కాంగ్రెస్ తనలో విలీనం చేసుకుంది.
పోరాటాన్ని నీరుగార్చేసింది. తెలంగాణావాదుల ఆకాంక్షల్ని నిర్వీర్యం చేసేసింది. తెలంగాణాతో కలిసుండలేం.. ఆంధ్రాను విడదీసేయండంటూ జై ఆంధ్రా ఉద్యమం సాగింది. కాకాని వెంకటరత్నం, బివి సుబ్బారెడ్డి తదితరులు ఈ ఉద్యమాన్ని నడిపారు. దీన్ని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఉక్కుపాదంతో అణిచేసింది. తిరిగిప్పుడు తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. సీమాంధ్రాలో సమైఖ్యాంధ్రా సెగ రగుల్కొంది. ఇప్పుడు తిరిగి కేంద్రం రాష్ట్ర విభజనపై దృష్టిపెట్టింది. ఆదినుంచి కేంద్రంలోని కాంగ్రెస్ తన రాజకీయ లబ్ది తప్ప తెలుగు ప్రజల ప్రయోజనాలకేమాత్రం విలువివ్వలేదు. వారు కలిసుండేదిలేదన్నప్పుడు బలవంతంగా కలిపేసింది. ఇద్దరి మధ్య వివాదాలు జరుగుతున్నప్పుడు ఎటూ తేల్చకుండా చోద్యం చూస్తోంది.
కేవలం తన రాజకీయ ప్రయోజనాలకనుగుణంగానే విభజనపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం సంసిద్దమౌతోంది. జై ఆంధ్రా ఉద్యమం సాగిన సమయంలోనే రాష్ట్రాన్ని విడదీసుంటే ఇప్పుడీ పరిస్థితి తలెత్తేదికాదు. అప్పట్లో పెద్దరాష్ట్రాల్తోనే అభివృద్ధి, దేశ సమగ్రత సాధ్యపడుతుందంటూ కేంద్రం నమ్మబలికింది. శాశ్వతంగా రాష్ట్రం కలిసుండాల్సిందేనని తేల్చిచెప్పేసింది. దీంతో సీమాంధ్రులు తమ రాజధాని హైదరాబాద్‌లో లక్షలకోట్లు పెట్టుబడులు పెట్టారు. ఆ నగరాన్ని అనూహ్య రీతిలో అభివృద్ధి చేశారు. ఢిల్లీ తర్వాత అంతటి స్థాయిగల నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దారు. ప్రపంచంలోనే పేరెన్నికగన్న సంస్థలన్నీ ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా వ్యాపార, పారిశ్రామిక సంస్థల్ని స్థాపించాయి. హైదరాబాద్ దక్షిణభారతానికే ఐటి హబ్‌గా మారింది.
సినీపరిశ్రమకు కేంద్ర బిందువైంది. ఇప్పుడు వేర్పాటుసెగ గట్టిగా తగలడంతో కేంద్రం విభజనపై సమాలోచనాలు జరుపుతోంది. చర్చలంటూ సమస్య పరిష్కారానికి మొగ్గుచూపుతోంది. ఒకప్పుడు నెహ్రూ కుటుంబీకులే తెలంగాణాను తెచ్చి ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేశారు. వారే జై ఆంధ్రా ఉద్యమాన్ని నీరుగార్చారు. తెలంగాణావాదాన్నీ నిర్వీర్యం చేశారు. ఇప్పుడదే నెహ్రూ కుటుంబీకులు రాష్ట్రాన్ని ముక్కలు చేసి పూర్వీకుల నిర్ణయాలన్నీ తప్పని తేలుస్తారా..? లేక నెహ్రూ, ఇందిరల ఆశయాలకనుగుణంగా వ్యవహరిస్తారో పరిశీంచాల్సిందేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే సీమాంధ్రను విభజిస్తే తగిన రాజధాని నిర్మాణం అతిపెద్ద సమస్యగా పరిణమించనుంది. సీమాంధ్రలో కొత్తగా ఒక నగర నిర్మాణానికి తగిన స్థలం ఎక్కడా అందుబాటులోలేదు. రాష్ట్ర రాజధాని కావాలంటే రోడ్డు, రైలు, వాయు మార్గాల్తో అనుసంధానం కాగల ప్రదేశమై ఉండాలి.
హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు. దక్షిణమధ్యరైల్వేకి హైదరాబాద్‌ను కేంద్రంగా చేశారు. విజయవాడ..ముంబయ్, కన్యాకుమారి..వారణాసి జాతీయరహదార్లు హైదరాబాద్ మీదుగా వేళ్తున్నాయి. ఈ నగరానికి చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మించారు. కొత్త రాజధానికి కూడా ఇన్ని హంగులు కావాలి. ఇందుకోసం వేలాది ఎకరాల భూములు అవసరం. ఇప్పటికే విజయవాడ రైల్వే కేంద్రంగా ఉంది. తూర్పు, ఉత్తర, పశ్చిమ దిశల నుంచి దక్షిణాదికెళ్ళే ప్రధాన రైల్వేలైన్లు విజయవాడ మీదుగానే వెళ్తున్నాయి. అలాగే చెన్నై..కోల్‌కత్తా జాతీయ రహదారి విజయవాడ మీదుగానే ఉంది. విజయవాడ నుంచే ముంబయ్ వరకు మరో జాతీయరహదారి కొనసాగుతోంది.
ఇప్పటికే అందుబాటులో ఉన్న గన్నవరం విమానాశ్రయాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి పెంచే వీలుంది. ఈ అవకాశాల దృష్ట్యా విజయవాడ కేంద్రంగా ఇటు ఏలూరు, అటు గుంటూరుల వరకు గల ప్రాంతాల్లో భూసేకరణ చేసి కొత్త రాజధానిని నిర్మించేందుకు అనువైన పరిస్థితులున్నాయి. ఇప్పటికిప్పుడు కొత్త రాజధాని నిర్మాణం చేసుకున్నా సీమాంధ్రులు సుమారు 50ఏళ్ళ అభివృద్ధిని కోల్పోతారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు ప్రజల ఆకాంక్షలకంటే తన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావించడమే ఇందుక్కారణమౌతోంది. అత్తా కొడలి పరిపాలనలో తెలుగువారికి అన్యయమే జరుగుతుంది. కేంద్రంలో తమిళ తంబీల ఆటలు అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగుతునే ఉన్నాయి. తెలుగువారికి వీలువలేదని మరోసారి కోడలు సోనియా గాందీ రుజువు చెయ్యటానికి సిద్దమవుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more