ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చివరకు డిఎల్ రవీంద్రారెడ్డికి ఉద్వాసన చెప్పటంలో కృతకృత్యులయ్యారు. ఏ పనైనా ఏ మాటలైనా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళకుండా చెయ్యని కిరణ్ కుమార్ ఈ పనిని కూడా ఢిల్లీ పెద్దల అనుమతితోనే చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఢిల్లీ నుంచి రావటంతోనే ప్రభుత్వం కార్యకలాపాలకు సంబంధించి చేసిన మొదటి పని ఇదే. డిఎల్ మీద మోపిన అభియోగం ఆయన పార్టీలో సీనియర్ నాయకుడయ్యుండీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ముఖ్యంగా అమ్మహస్తం లాంటి ప్రతిష్టాత్మక పథకాన్ని విమర్శించటం.
డిఎల్ ని మంత్రివర్గంలోంచి తప్పించటం కోసం ముఖ్యమంత్రి చేసిన సిఫారసుని స్వీకరించిన గవర్నర్ ఆ చర్య మీద ఆమోదముద్ర వేసారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో చర్చించిన విషయాల్లో ఇదొకటన్నది ఢిల్లీ నుంచి రాగానే కాలాతీతం లేకుండా చేసిన డిఎల్ కి ఉద్వాసనను బట్టి తెలుస్తోంది.
విచిత్రమేమిటంటే దాదాపు సంవత్సరంన్నర క్రితం మంత్రి శంకరరావుని కూడా ఇలాగే తప్పించటం జరిగింది. నిజానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వైయస్ జగన్ మీద హైకోర్ట్ కి లేఖాస్త్రాన్ని సంధించి జగన్ మీద కేసు ముందుకు నడిచి ఆయన్ని జైలులో పెట్టించటానికి దోహదం చేసింది ఆ శంకరరావే. అలాగే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద రాజకీయ శక్తిగా ఎదుగుతున్న వైయస్ జగన్ కి పోటీగ ఓడిపోయే అవకాశాలున్నా పార్టీకోసం కడప ఎన్నికల్లో పోటీ చేసినవారు డిఎల్ రవీంద్రారెడ్డి. అలాంటి వీళ్ళిద్దరిమీదా కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చెయ్యటానికి కారణం ఇద్దరూ పార్టీకి వ్యతిరేకంగా కాకపోయినా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రకటనలు చెయ్యటమే.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ తీసుకున్న ఈ చర్య వలన ఎన్నికల ముందు ఆయన తన బలాన్ని తనకు మద్దతునిచ్చేవారితో పెంచుకుని తన క్యాబినెట్ ని విస్తరింపజేసుకుని తద్వారా ఎన్నికలకు శక్తివంతంగా తయారీలు చేసుకునే దిశగా పావులు బాగానే కదిపినట్లుగా గోచరిస్తోంది.
డిఎల్ ని మంత్రివర్గం నుంచి తప్పించే ప్రక్రియ రాత్రి 9.00 గంటలకు పూర్తయింది. ఈ విషయం గెజిట్ లో ప్రకటించటం జరిగింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more