హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ పవన్ కి షాక్ ఇచ్చింది. గత కొన్ని రోజుల నుండి ఈమె పై రకరకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.. ఈమె త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్లో వస్తున్న ‘అత్తారింటికి దారేది ’ సినిమాలో ఓ కీలక పాత్ర తో పాటు ఐటెం సాంగులో నటించబోతుందని ఫుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ వార్తల పై ఓ ఛానల్ తో మాట్లాడిన అనసూయ పవన్ కి షాక్ ఇవ్వడమే కాకుండా గాలి వార్తల్ని కూడా ఖండిచింది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఐటం సాంగు చేయమని నన్ను అప్రోచ్ అయిన మాట నిజమే. కానీ ఆ సాంగులో నేను నటించడం లేదు. ఎందుకంటే వెండితెర పై ఐటెం సాంగులో నటించడానికి నేను సూటవ్వనని అనిపించింది. అది కాకుండా ఐటెం సాంగుతోనే నా వెండితెర జీవితాన్ని ఆరంభించడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. ప్రస్తుతం నటనలో శిక్షణ పొందుతున్నాను. అది పూర్తియిన తరువాత ఎలాంటి పాత్రల్లో కనిపించాలో అప్పుడు ఆలోచిస్తాను అని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తాను టీవీ షోలతో బిజీగా గడుపుతున్నాను. దర్శకుడు గుణశేఖర్ కూడా ‘రుద్రమదేవి' చిత్రంలో కీలకమైన పాత్ర చేయమని అడిగారు. కానీ 10 కేజీల వెయిట్ తగ్గమని చెప్పారు. దీనికి కూడా నేను ఒప్పుకోలేదు. ఈ అవకాశాలు మిస్సయినందుకు తనకు ఎలాంటి విచారం లేదని చెప్పింది. ఇన్ని చెప్పిన అనసూయ తనకు పేరు తెచ్చిన జబర్థస్త్ ప్రోగ్రాం నుండి ఎందుకుతప్పుకోవాల్సి వచ్చిందో చెప్పలేదు. లేటుగా యాంకరింగ్ లోకి వచ్చిన ఈ అమ్మడుకు అనతి కాలంలోనే బాగా పాపులారిటీ వచ్చింది. అయితే ఈమె ఆ అవకాశాన్ని వదులుకోవడం ఓ వంతుకు మంచిదే అని గుత్తా జ్వాలా లాగా తొందరపడితే ఉన్న పాపులారిటీ పోకుండా జాగ్రత్త పడిందని కొందరు అంటుంటే, పవర్ స్టార్ లాంటి హీరో ప్రక్కన నటించే ఛాన్స్ మిస్ చేసుకుందని మరి కొందరి వాదన. ఏదేమైనా అనసూయ అందాలు మాత్రం మిస్సయ్యాం...
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more