Tollywood news actor ramcharan in street brawl controversy

actor ramcharan in street brawl controversy, , ramcharan pressmeet on street brawl, ramcharan says am not guilty, ramcharan street brawl photos morphed, union minister chiranjeevi son in news,

actor ramcharan in street brawl controversy

రామ్ చరణ్ వాదనలో సత్యమెంత?

Posted: 05/10/2013 02:11 PM IST
Tollywood news actor ramcharan in street brawl controversy

మీడియాలో కొందరు కాసులకోసం కక్కుర్తిపడుతూ బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడటం సమాజం చేసుకున్న దురదృష్టమనే అనుకోవాలి.  అదే పనిగా పెట్టుకున్న కొందరు చిన్న ఘటనను పెద్దగా చూపిస్తూ తమ రచనా చాతుర్యాన్ని, పత్రికా స్వేచ్ఛను యధేచ్ఛగా వాడుకుంటూ, దానిమీద పాఠకులలో ఆసక్తిని కలుగజేసి తద్వార డబ్బు హోదా ఉన్నవారిని బెదిరించే ప్రయత్నం చేస్తుంటారు. 

ఆదివారం రామ్ చరణ్ తేజ విషయంలో అలాగే జరిగింది.  వాళ్ళు రామ్ చరణ్ ని ఈ విధంగా చిత్రించారు-  బడాబాబుగా తన తండ్రి రాజకీయ పరపతిని, డబ్బుని వాడుకుంటూ బయట గొడవలు పెట్టుకుంటున్నాడు.  అలా చేసిన చిత్రీకరణనకు అణుగుణంగా వాళ్ళకి దొరికిన ఫొటోలలో మార్ఫింగ్ చేసి ఒక్కొక్కటే బయటపెడుతూ ఒత్తిడిని పెంచి ఎక్కువ సొమ్ము లాగే ప్రయత్నం చేసారు. 

కారు సైకిల్ ని గుద్దినా, సైకిల్ కారుని గుద్దినా కారు నడిపే వాళ్ళనే అంటారన్న మాట నిజమే అయింది.  రామ్ చరణ్ కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నది నిజమే.  వ్యతిరేక ప్రచారాలకు అవకాశం ఇవ్వగూడదు మరి.  బయట చెయి చేసుకోవటం లాంటిపనులను సమర్థించరెవరూ.  కానీ జరిగిన దానిలోని నిజానిజాలను తెలుసుకోవటానికే ఈ ప్రయాస.

బెదిరించి డబ్బు లాగుదామనుకునే ఆ మీడియా ఫొటోగ్రాఫర్ల సంభాషణ తన దగ్గర రికార్డ్ చేసివుందంటున్నాడు రామ్ చరణ్.  మొదటి రోజు విడుదల చేసిన ఫొటోలో లేని తనను రెండవరోజు అదే ఫొటోలో తను ఉన్నట్టుగా చేసిన మార్ఫింగ్ చాలా స్పష్టంగా కనిపిస్తుందంటున్నారాయన. 

ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగులే తనతో అసభ్యంగా ప్రవర్తించారని, నిజానికి ఫిర్యాదు చెయ్యవలసింది తనే కానీ వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆ పని చెయ్యలేదని చరణ్ అన్నారు.  అందుకు తన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలను కూడా చూపించారు.

జరిగిన ఘటనల లోతుల్లోకి వెళ్తే, కొన్ని ప్రశ్నలకు జవాబులు కోరినట్లయితే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు చేసిన తప్పేమిటో అర్థమౌతుంది, అసలు సత్యమేమిటో అవగతమౌతుంది.

1.    అసలు ముందుగా దెబ్బలాటను మొదలుపెట్టిందెవరు.  అక్కడి నుండి వెళ్ళిపోకుండా వచ్చిన బాడీ గార్డ్స్ తో తగవులాడిందెవరన్నది కింది ఫొటో చూస్తే తెలుస్తుంది.

charan guards

2.    రామ్ చరణ్ చెప్తున్నట్టుగా వాళ్ళు ఆయన భార్య ఉన్నవైపు వచ్చి కారు అద్దం మీద చేతుల్లో కొడుతూ అసభ్యంగా ప్రవర్తించారన్నది కాసేపు పక్కకు పెట్టినా, దెబ్బలాటకు దిగటానికి కాకపోతే వాళ్ళకి కారులోంచి దిగవలసిన పనేమిటసలు?

3.    చెప్పులు కారులో వదిలేసి దిగి కయ్యానికి దిగేంత అవసరం ఏమొచ్చింది వాళ్ళకి?

4.    ఎల్ బోర్డ్ పెట్టుకోవటమంట్ కారు నడపటం సరిగ్గా రాకపోయినా ట్రాఫిక్ లో అవాంతరం కలిగిస్తూ తమ తప్పులకో ఎదుటివారితో దెబ్బలాటకు దిగటానికి అనుమతి దొరికినట్లా?

5.    వాళ్ళనసలు మద్యం మత్తులో ఉన్నారేమో పరీక్షలు జరిపారా?

6.    సర్ది పోతున్న సెక్యూరిటీ వాళ్ళని లాగి మరీ వాదనకు దిగటం ఎందుకు జరిగింది.  ఏమిటి అక్కడ జరిగిన వాదన?


charan
7.    రామ్ చరణ్ రాజకీయ పరపతి గురించి అంత భయపడేవాళ్ళే అయితే దెబ్బలాటకు దిగుతారా అసలు.  ముందు కాలు దువ్వటమెందుకు, తరువాత భయపడుతున్నామనటమెందుకు?

8.    అక్కడి నుంచి వెళ్ళిపోకుండా అక్కడే ఉండి సెక్యూరిటీవాళ్ళతో వాదనకు ఎందుక దిగినట్లు?

9.    గ్రీన్ లైట్ వచ్చినా పోకుండా రామ్ చరణ్ కి అడ్డుగా ఉన్నది వాళ్ళు కాదా?

10.    ఆ తర్వాత రామ్ చరణ్ పక్కనుంచి కారుని తీసుకెళ్తుంటే హారన్ కొట్టి గేలి చేస్తూ చరణ్ ని చిరాకు పరచే ప్రయత్నం చెయ్యలేదా?

11.    అసభ్యంగా మాట్లాడుతూ, రామ్ చరణ్ భార్య పక్కనే ఉండగా కిటికీ అద్దాలు దించమనటాన్ని సభ్య సమాజం ఒప్పుకుంటుందా?

12.    వాళ్ళు కోపాన్ని పట్టలేకపోయామని అన్నారు.  ఎందుకొచ్చిందంత ఆగ్రహం వాళ్ళకి.  అసభ్యంగా మాట్లాడేంత తప్పు రామ్ చరణ్ ఏం చేసాడట?

13.    రామ్ చరణ్ ఎడమవైపు కారు దిగినట్లుగా ఫొటోలలో మార్పు చేసారు.  కుడి వైపు కూర్చుని కారు నడుపుతున్న రామ్ చరణ్ ఎడమ వైపు ఎలా దిగుతాడు?

ramcharan
14.    కారులోంచి కాళ్ళకి చెప్పులు లేకుండా దిగటమెందుకు జరిగింది.  రామ్ చరణ్ తప్పా అతనలా ఎండలో కాళ్ళకేమీ వేసుకోకుండా రోడ్డు మీదకు రావటం?

పై ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలను రాబడితే సత్యమేమిటో ఇట్టే అర్థమౌతుంది.  సాఫ్ట్ వేర్ ఉద్యోగులే కయ్యానికి కాలుదువ్వారన్న విషయం రామ్ చరణ్ దగ్గరున్న సాక్ష్యాలు ఆయన వాదన వలన స్పష్టమౌతోంది. చిన్నగా మొదలై చిలికి చిలికి గాలి వాన చేసుకున్నది వాళ్ళే.  నియంత్రణ తప్పి ప్రవర్తించింది వాళ్ళే.  కానీ కొందరు మీడియాలోనివాళ్ళు వాళ్ళని రెచ్చగొట్టి రామ్ చరణ్ మీద ఆరోపణ చెయ్యటానికి ప్రోత్సహించినట్లు తెలుస్తోంది. 

నేనసలు కారులోంచి కిందికే దిగలేదని రామ్ చరణ్ చెప్తున్నారు.  సెక్యూరిటీ పర్సనల్ తో వాళ్ళు దెబ్బలాటకు దిగటం తన్నులు తినటం కూడా చరణ్ తప్పే అవుతుందా?

విషయం చిన్నదే, వాళ్ళు తమ తప్పు తాము తెలుసుకున్నారు కూడా.  కానీ అంత త్వరగా సమసిపోవటం ఇష్టంలేని వాళ్ళు హెచ్ ఆర్ సి వరకు పోవటం, కొందరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను రెచ్చగొట్టటం చేస్తున్నారు.   పురాణాల్లో నారద ముని గురించి వినే వాళ్ళం.  కలహభోజనుడిగా మనుషుల మధ్యలో కయ్యాలు పెట్టేవాడటాయన.  సాఫీగా సాగుతున్న కథలో ట్విస్ట్ వచ్చేదప్పుడు.  కానీ ఇప్పటి రోజుల్లో నారదుడు పైనుంచి దిగిరావలసిన పని లేదు.  సమాజంలో ఆధునిక మానవ రూపంలో ఎందరో నారదులున్నారు, వాళ్ళు ఒక చిన్న సంఘటనను పెద్దగా సాగదీసి చేంతాడు చేసి టి.వి.సీరియల్ వేలాది ఎపిసోడ్ లలోకి లాగగలరు. 

ప్రతిరోజూ నగరాల్లో ట్రాఫిక్ రద్దీలు సామాన్యమే, అందులో ఎదుటివారి డ్రైవ్ చేసే విధానం నచ్చక వాగ్యుద్ధాల నుంచి సిగపట్ల వరకూ జరగటం చూస్తుంటాం.  రోడ్డు మీద ట్రాఫిక్ కండిషన్లను బాగు పరచరెందుకని ప్రభుత్వంతో దెబ్బలాడకుండా మనలో మనం దెబ్బలాడుకోవటం జరుగుతుంటుంది.  కానీ ఇక్కడ ఒక సినిమా హీరో సీన్లో ఉండటంతో అది వార్తల్లో చోటుచేసుకుందంతే.  అయితే మరో పెద్ద వార్త దొరికేంత వరకూ దీన్ని సాగదియ్యటం కూడా కొందరు మీడియా వాళ్ళు అవసరమని భావిస్తుండటం కద్దు.

-శ్రీజ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more