Adb directives to its representatives in noida summit

adb representatives dress code, adb reps warned, adb noida summit, adb reps to avoid rapes, asia development bank, greater noida

adb directives to its representatives in noida summit

ఏడిబి ప్రతినిదులకు మర్మగర్భ సూచనలు

Posted: 05/03/2013 12:16 PM IST
Adb directives to its representatives in noida summit

ఢిల్లీ ఉత్తర ప్రదేశ్ సరిహద్దులో యుపి లోని గ్రేటర్ నోయిడా (న్యూ ఓఖ్లా ఇండస్ట్రియల్ ఏరియా) లో నిన్నటినుంచి నాలుగు రోజులపాటు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడిబి) వార్షిక సమావేశాలను నిర్వహిస్తోంది.  అందులో 60 దేశాల నుంచి 4400 మంది హాజరుకానున్నారు.  అందులో పాల్గనే ముఖ్యంగా మహిళా ప్రతినిధులకు ఎడిబి కొన్ని సూచనలు చేసింది.  ఢిల్లీ ఈ మధ్య ఎక్కువౌతున్న అత్యాచారాల కేసుల నేపథ్యంలో ఒక విధంగా వాళ్ళు తీసుకోవలసిన జాగ్రత్తలను చాలా మర్మగర్భంగా తెలియజేసింది. 

భారతీయులు సాంప్రదాయాలకు గౌరవమిస్తారు కాబట్టి కురచ దుస్తులు వేసుకోవద్దని, సాదాసీదా వస్త్ర ధారణ చేస్తే వారు ఇష్టపడతారని చెప్పింది.  అందులో అర్థం, భారతీయులు త్వరగా ఆకర్షించబడతారు కాబట్టి దుస్తుల ద్వారా వారిని ఆకర్షించే ప్రయత్నం చెయ్యకండని.  భారతీయ సినిమాలు చూసి అలాంటి వస్త్రాలను వేసుకోవచ్చనుకుంటే పొరపాటే. 

దుస్తులతో పాటు వాళ్ళు వ్యవహరించే తీరుని కూడా ఎడిబి వారికి సూచించింది.  చుంబన ఆలింగాది ప్రేమ ప్రదర్శనలు చెయ్యకుండా ఉండటమే కాకుండా జంటలు చేతులు పట్టుకుని కూడా తిరగవద్దని వారిని హెచ్చరించింది. 

స్త్రీల కాళ్ళు, భుజాలు కనిపించే వస్త్ర ధారణను భారతీయులు హర్షించరు, హుందాగా ఉంటేనే భారతీయులు గౌరవిస్తారని  అని చెప్పిన ఏడిబి, అందాలను ప్రదర్శించకండని మర్మగర్భంగా తెలియజేసింది.  అలాగే ఎంగిలి విషయంలో పట్టింపులు ఎక్కువ కాబట్టి ఒకరు నోట్లో పెట్టుకున్న కూల్ డ్రింక్స్ ని మరొకరు గభాల్న నోట్లో పెట్టుకుని తాగకండని కూడా ఎడిబి సూచించింది.  ఒకరి చేతుల్లోంచి మరొకరు తీసుకుని తాగటం కూడా శృంగార భావనను పెంపొందిస్తుంది.  కాకమీదున్న భారతీయ యువతను రెచ్చగొట్టకండి, పీకలమీదకు తెచ్చుకుని సంస్థకు ఇబ్బందులు కలిగించకండన్న విషయాన్ని పై విధంగా ఏడిబి సున్నితంగా ప్రతినిధులకు హెచ్చరించింది. 

శశికపూర్ తీసిన ఇంగ్లీష్ సినిమా హీట్ అండ్ డస్ట్ లో ఆయన భార్య జెన్నిఫర్ నటించింది.  ఆమె సినిమాలో తన తోటి మహిళకు కొన్ని జాగ్రత్తలు చెప్తూ, లోదుస్తులను బయట ఆరవేయవద్దని కూడా చెప్తుంది.  ఎందుకు అని అమాయకంగా అడిగిన ఆ మహిళకు, మొన్న అలాగే వాటిని చూసి మోహం పెంచుకుని ఒకావిడను రేప్ చేసాడంటుందామె. 

భారత దేశస్తుల పట్ల ఎప్పటి నుంచో ఈ విధమైన తేలిక భావం ఉంది.  అది ఈ మధ్య కాలంలో ఎక్కువైన అత్యాచారాల వలన మరీ ఎక్కువైంది.  కానీ మన దేశవాసులను హేళన చెయ్యకుండా, ప్రతినిధులను భయభ్రాంతులను చెయ్యకుండా ఎడిబి హుందాగా సూచనలను జారీ చేసింది.

అయితే, మనను మెత్తని చెప్పుతో కూడా కొట్టిందని సంస్కారవంతుడైన ప్రతి భారతీయుడూ భావిస్తాడు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more