దూసుకుపోతున్న సాంకేతిక నైపుణ్యం, వెనక్కి తగ్గుతున్న చురుకుదనం
సాంకేతికంగా పరికరాలు ఎంత అభివృద్ధి చెందితే వాటిని ఉపయోగించేవారు కూడా తమ వినియోగ సామర్థాన్ని కూడా అంతగానే పెంచుకోవలసి వస్తుంది. దాని వలన మెదడులో చురుకుతనం పెరుగుతుందని కొందరంటుంటే, కాదు తగ్గిపోతుందని మరి కొందరి వాదన. ఎక్కువ ఫీచర్లున్న వస్తువులను వాడుకునేటప్పుడు వాటిని సక్రమంగా వాడాలంటే మనిషి మస్తిష్కం కూడా దానితో పోటీ పడుతూ వినియోగించుకోవలసి ఉంటుంది. కాబట్టి మనిషిలో ఆలోచనా పటిమ పెరుగుతుందని కొందరు విశ్లేషకులు అంటారు. కానీ దానికి వ్యతిరేకంగా, కాదు, మనిషి పరికరాలమీద ఆధారపడటం మొదలు పెట్టిన దగ్గర్నుంచీ తన మెదడుని ఉపయోగించే దానిలో మార్పు వచ్చింది, చిన్న చిన్న విషయాలకు కూడా అంతకు ముందు లేని విధంగా పూర్తిగా ఆధారపడుతున్నాడని మరికొందరు విశ్లేషకులంటున్నారు. ఉదాహరణగా, చిన్న చిన్న లెక్కలకోసం కూడా కాల్క్యులేటర్ లను వాడటం మొదలైంది. ఫోన్ నంబర్లు గుర్తు పెట్టుకోవటం పోయి ఫోన్ బుక్ మీద ఆధారపడటంతో ఫోన్ పోయిన సందర్భంలో చాలా అవస్తలు పడుతున్నారు. అయితే దానికి విరుగుడుగా మీ ఫోన్ ని మా కంపెనీతో రిజిస్టర్ చేసుకుంటే మీ ఫోన్ బుక్ తో సహా సేవ్ చేస్తాం అని కొన్ని కంపెనీలు అంటున్నాయి. కానీ సమస్య అది ఒక్కటే కాదు కదా, మనిషిలో చురుకుతనాన్ని తగ్గించి దాని మీద ఆధారపడేట్టుగా తయారు చేస్తున్నారు. దానితో మనిషి రోబాట్ గా మారిపోతున్నాడని కొందరు మానవతా వాదులు వాపోతున్నారు.
దూసుకు వస్తున్న గెలాక్సీ-
ఎస్ 4సెల్ ఫోన్ లలో సై అంటే సై అంటూ మార్కెట్ పోరుకి దిగిన యాపిల్, సామ్ సంగ్ ల మధ్య సాంకేతిక పోటీ కూడా బాగా పెరిగి, యాపిల్ ఐఫోన్లకు దీటుగా కాదు దాన్ని మించిన ఫీచర్లతో సాంసంగ్ గెలాక్సీ ఎస్ 4 ని మార్కెట్ లోకి దించుతోంది. యాపిల్ కంపెనీ ఐ ఫోన్ మీద ఇది చాలా పెద్ద సవాల్ అంటూ వ్యాపారవేత్తలు అంటున్నారు. ఇంతకుముందు వచ్చిన గెలాక్సీ ఎస్ 3 కూడా మార్కెట్లో ఘనవిజయం సాధించింది.
ఏప్రెల్ లో 55 దేశాలలో మార్కెట్లో కదం తొక్కబోతున్న కొత్త గెలాక్సీ ఎస్ 4 లో ఫీచర్లు-
5 అంగుళాల హెచ్ డి స్క్రీన్, అందులో అంగుళానికి 441 పిక్సెల్స్. 13 మెగా పిక్సెల్స్ కేమెరా, 2 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కేమెరా. రెండిటినీ ఒకేసమయంలో వాడుకునే ఏర్పాటు. ఎస్ ట్రాన్స్ లేటర్ తో మాట్లాడినదాన్నీ రాసిన టెక్స్ట్ ని కూడా తర్జుమా చేసుకోవచ్చు. కంటి కదలికలతోనే వీడియో ని ఆపరేట్ చెయ్యటం, పాజ్ చెయ్యటం చెయ్యవచ్చు. చేతి సంఙలతోనే స్క్రీన్ మీది ఐకాన్లను యాక్టివేట్ చెయ్యటం, కాల్స్ ని అందుకోవటం చెయ్యవచ్చు. డ్రైవింగ్ లో ఉన్నప్పుడు వాయిస్ కంట్రోల్ ద్వారా ఫోన్ ని వాడుకోవచ్చు. ఈ ఫోన్ లో 16, 32, 64 జిబిల ఇంటర్నెల్ మెమోరీ ఎంచుకునే అవకాశం ఉంది. 2 జిబి ర్యామ్ తో 64 జిబి కార్డ్ మెమొరీకి వెసులుబాటు కలిగివుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more