ప్రముఖ అందాల సినీనటి, ఉత్తరప్రదేశ్ రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు అయిన జయప్రద అక్కడ రాజకీయాలను వీడి మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావాలని గత కొంత కాలంగా భావిస్తున్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి నుండి పోటీ చేస్తానని ఇటీవల బహిరంగంగా ప్రకటించిన ఈమెను ఏ పార్టీలో చేరుతుందో కానీ, ఆయా పార్టీల నేతలు మాత్రం జయప్రదకు గాలం వేయాలని చూస్తున్నారు. ఈమె గతంలో వీడిన టీడీపీలోనే చేరుందని పలువురు అంటుంటే... కాదు కాదు కొత్తగా పెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందని ప్రచారం జరిగింది. ఆ రెండు పార్టీల మాట అటుంచితే జయప్రదను తన పార్టీలోకి లాక్కోవాలని కమలనాధులు గాలం వేస్తున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఆమెకు కూడా బీజేపీ పార్టీ ఓ ప్రత్యామ్నాయంగా ఉన్నట్లు కనిపిస్తుంది.
రాజమండ్రిలో బిజెపికి ఉన్న బలం దృష్ట్యా ఆమె ఆ అవకాశాన్ని వాడుకోవడానికి ముందుకు రావచ్చునని అంటున్నారు. 2004, 2009 ఎన్నికల్లో రెండు సార్లు కాంగ్రెసు తరఫున పోటీ చేసి ఉండవల్లి రాజమండ్రి సీటు నుంచి విజయం సాధించారు. అంతకు ముందు రెండు సార్లు బిజెపి ఈ సీటును గెలుచుకుంది. గిరజాలల వెంకటస్వామి నాయుడు, ఆ తర్వాత సిబిపిబికె సత్యనారాయణ రావు బిజెపి తరఫున పోటీ చేసి గెలిచారు. రాజమండ్రి సీటులో బిజెపికి గెలిచిన చరిత్ర ఉండడంతో జయప్రద ఆ పార్టీలో చేరే ఆలోచన కూడా చేయవచ్చునని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడం కన్నా జాతీయ పార్టీ అయిన బిజెపిలో చేరితే బాగుంటుందనే ఆలోచన కూడా ఆమె చేస్తున్నట్లు చెబుతున్నారు. తాను రాజమండ్రి నుంచి పోటీ చేస్తానని జయప్రద కచ్చితంగా చెప్పడంతో ఆమె ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే చర్చ సాగుతూ వచ్చింది. వైయస్సార్ కాంగ్రెసు తప్ప ప్రత్యామ్నాయం లేదని అందరూ భావించినప్పటికీ తాజాగా బిజెపి ప్రత్యామ్నాయం ఆమెకు కనిపిస్తోందని అంటున్నారు.
బిజెపి బలం, తన ఇమేజ్ రెండూ కలిసి తాను విజయం సాధించే అవకాశాలున్నాయని జయప్రద అనుకంటున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక దీనికి తోడు రాష్ట్ర బీజేపీ సీనియర్ నేతలు కూడా ఆమెను పార్టీలోకి రప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెకు ఉన్న సినీ గ్లామర్ తో కమలానికి మరింత అందం వస్తుందని భావించి ఆమెను పార్టీలో చేర్చుకోవడానికి వ్యూహ రచన చేస్తున్నారు. ఈమెతో పాటు 2014లోపు కొంతమంది టాలీవుడ్ నటులను చేర్చుకొని పార్టీ ప్రచారానికి వాడుకోవడాలని చూస్తున్నారు. మరి కమలనాధుల వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more