Ten lakh reward for information on hyderabad blasts

hyderabad twin blasts, cctv footage, blasts vital clues, dilsukhnagar blast site, indian mujahideen, nation news, kiran kumar govt, 10 lakhs reward for know about this bomb blast news, medical treatment for bomb blast victims, suspicious man in cc camera record,

rs.10 lakh reward for information on hyderabad blasts.Investigators today claimed to have got "vital clues" in the probe into the twin blasts in the city and were examining CCTV footage with the needle of suspicion zeroing in on banned militant outfit Indian Mujahideen.

ten-lakh-reward.gif

Posted: 02/24/2013 12:50 PM IST
Ten lakh reward for information on hyderabad blasts

kirankumarreddy

మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  నగరంలో పేలిన బాంబుల పేలుళ్లు పై  కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.  నిందితులను పట్టిస్తే .. పది లక్షలు  ఇస్తానని  ప్రకటన చేశారు. ఉగ్రవాదుల దాడిని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇంటెలిజెన్స్ వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్యం వంటి అంశాలపై విమర్శలు జోరు పెరుగుతున్న నేపథ్యంలో త్వరితగతిన దర్యాప్తును ముగించి, నిందితులను పట్టుకునేందుకు అన్ని అవకాశాలనూ శోధిస్తోంది. ఒకవైపు ప్రత్యేక దర్యాప్తు బృందాలను రంగంలోకి దించుతూనే, మరోవైపు నిందితుల ఆచూకీ తెలిస్తే చెప్పాలని ప్రజలను కోరుతోంది. సమాచారం అందించిన వాళ్లకు పది లక్షలు పారితోషకం ఇస్తామని ప్రకటించింది. ఆచూకీ చెప్పిన వారి పేర్లు అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది. ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్న తీరు, లభిస్తున్న ఆధారాల లభ్యత, ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి అందుతున్న సహాయం, ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలు వంటి పలు అంశాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విస్తృత స్థాయి సమావేశంలో సమీక్షించారు.

rs.10 lakh reward for information on hyderabad blasts

హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డిజిపి దినేష్‌రెడ్డి, ఇంటెలిజన్స్ అదనపు డిజి మహేంద్రరెడ్డి ఇతర పోలీసు అధికారులతో చర్చించి ప్రగతిని సమీక్షించారు. నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు, దర్యాప్తును వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా పదిహేను బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఉగ్రవాదదాడులు, ఇంటెలిజన్స్‌లో నైపుణ్యం కలిగిన అధికారులను బృందాల్లో నియమిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. నిందితులను గుర్తించేందుకు, వారిని అరెస్టు చేసేందుకు ఉన్న ఏ ఒక్క అంశాన్నీ విడిచిపెట్టకుండా దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించారు. ఇప్పటికే కేసుకు సంబంధించి పలు ఆధారాలు లభించినట్టు పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎవరు చేశారన్న కోణంలోనూ కొంత స్పష్టత వచ్చిందని, వారిని గుర్తించే పనిలో ఉన్నామని ముఖ్యమంత్రికి వివరించినట్టు సమాచారం. ఇదే సమయంలో ఇంకెక్కడా విధ్వంస ఘటనలు జరగకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. కీలక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ కూడా పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Two foreign nationals held near nepal border
Sabita indra reddys proposal to install 3500 cc cameras in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more