భారత క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోని మళ్లీ ఫెయిల్ అయ్యాడు. టీమిండియాకు ప్రపంచ కప్ అందించి ఆహా ఓహో అనిపించుకున్న ధోనీ ఒక్క విషయంలో ఫెయిల్ అవుతున్నారు. ఇటీవల టాలీవుడ్ హీరో నాగార్జనతో కలిసి బైక్ రేస్ టిమ్ ను కోనుగోలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ధోని ఫెర్యూపూమ్ వ్యాపారంలో కూడా అడుగు పెట్టి .. సొంతగా ఒక ఫేర్యూపుమ్ మార్కెట్ లోకి విడుదల చేయటం జరిగింది. క్రికెట్ లోను , ఇటు బిజినెస్ లోను సక్సెస్ అయ్యే ధోని ఒక్క విషయం లో వెనకబడిపోతున్నారు. ఆ విషయంలో ఫెయిల్ కావటానికి కారణం ఆయన బిజీ షెడ్యుల్ అని అంటున్నారు ఆయన అభిమానులు. అసలు ఇంతకీ ధోని ఎందులో ఫెయిల్ అయ్యాడు ? అంటే మీరో మరోలా ఆలోచించకండి? ఎందుకంటే కొత్త పెళ్లి చేసుకోన్న ధోని ఫెయిల్ అయ్యాడు అనే వార్త వినగానే చాలా మందిఅభిమానులు.. కొత్త అర్థాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ విషయంలో మాత్రం ధోని చాలా ఫర్ ఫెక్ట్ గా ఉన్నట్లు.. కొంత మంది అమ్మాయిలు చెబుతున్నారు. అయితే ఇంతకీ ధోని ఏ విషయంలో ఫెయిల్ అయ్యాడు. బిజీ షెడ్యూల్ తో ఢిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నారు.
తానూ ఓ పట్టాదారుణ్ణి అనిపించుకోవాలని ఇక్కడి సెయింట్ జేవియర్ కాలేజీలో 2008 లో బ్యాచిలర్స్ డిగ్రీ ( బిజినెస్ మేనేజ్ మెంట్ అండ్ సెక్రటేరియర్ ప్రాక్టీస్) కి ఫీజు కట్టాడు. అప్పటి నుంచి ఒక్క పరిక్ష కూడా రాయలేక ఆరు సెమిస్టర్లలోనూ తప్పాడు. తనతో పాటు డిగ్రీకి దరఖాస్తు చేసుకున్న వాళ్లందరూ పట్టాలు అందుకోవటానికి రెఢీ అవుతుంటే .. మన ధోని మాత్రం ఆస్ట్రేలియాను చిత్తు చేయడానికి సిద్దమవుతున్నాడు. కాగా ధోనీ రిజిస్ట్రేషన్ ఈ ఏడాది తో పూర్తి అయిపోతుంది. దీనిపై ఆ కాలేజీ ప్రిన్సిపాల్ .. ఈ కోర్సు చాలా సులవైంది. రాస్తే పాసైపోతాడు. దీనికి సంబంధించి పుస్తకాలు, స్టడీ మేటీరియల్ అంతా ధోనికి అందించాం. అతని బీజి షెడ్యూల్ కారణంగా కాలేజీకి హజారు నుంచి కూడా మినహాయింపు ఇచ్చాం. ధోనీ ఇష్టపడితే మ్యాచ్ లు ఆడే వేదికలు వద్దే, అతడి అనుకూలమైన తేదీల్లో పరీక్షలు నిర్వహించడానికి కూడా మేం సిద్దం అని ఆయన చెప్పారు. మన కెప్టెన్ ఎంఎస్ ధోని భారత్ టీమ్ కెప్టెన్ గా విజయం సాధించారు. అలాగే ధోని బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుకోవాలని మనమందరం కోరుకుందాం. బ్యాట్ పట్టిన చేత్తోనే కలం పట్టి పరీక్షలు రాసి బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుకోవాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more