Baddam trying for state bjp chief post

Kishan Reddy, BJP state unit president, Baddam Bal Reddy, senior leader laxman, janga reddy,

With BJP state unit president G Kishan Reddy not willing to hold the post for a second term, senior leader and former MLA Baddam Bal Reddy has begun lobbying.

Baddam trying for State BJP chief post.png

Posted: 02/10/2013 03:00 PM IST
Baddam trying for state bjp chief post

bjp-party

బీజేపీకి గత కొంత కాలంగా కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఒక ప్రక్క కర్ణాటక ప్రభుత్వలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న బీజేపీ అధినాయకత్వానికి ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఓ సమస్య వచ్చి పడింది. అదే రాష్ట్ర అధ్యక్ష పదవి సమస్య. ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న అంబర్ పేట ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఈసారి తనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించాలని స్వచ్చందంగా కోరడంతో పార్టీ అధిష్టానం ఎప్పుడు ఎవర్ని ఎంపిక చేయాలా అని మల్లగుల్లాడు పడుతుంది. కొత్త అధ్యక్షుడి కోసం పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకునేందుకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం, జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి సతీష్‌జీ రాష్ట్ర నేతలతో సమావేశమై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతలు ఎవరికివారే భిన్నాభిప్రాయలు వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర నేతల్లో ఏకాభిప్రాయం కొరవడటం, ప్రస్తుత అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తనకు పదవి వద్దని చెప్పడంతో జాతీయ నేతలు ఈ విషయంలో నిర్దిష్ట అభిప్రాయానికి రాలేకపోతున్నారు. రాష్ట్ర నేతలు తనకు సహకరించడం లేదని కిషన్ రెడ్డి పెద్దల దగ్గర వాపోయినట్లు విశ్వసనీయ సమాచారం. 

మాజీ ఎంపీ జంగారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి వంటి నేతలు తెలంగాణకు, సీమాంధ్రకు వేర్వేరుగా కమిటీలను ఏర్పాటు చేసి, ఇద్దరు అధ్యక్షులను ఎంపిక చేయాలని కోరినట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి, బద్దం బాల్‌రెడ్డి, రామచంద్రారావు తమకు ఈసారి రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం కల్పించాలని కోరారు. పార్టీ జాతీయ కార్యదర్శి కె.లక్ష్మణ్ మాత్రం ఏ పదవి ఇచ్చినా ఇబ్బంది లేదని చెప్పినట్లు సమాచారం. ఇక విద్యాసాగర్‌రావు, దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి వంటి సీనియర్ నేతలు అధిష్ఠాన నిర్ణయానికే తమ ఓటని చెప్పినట్లు తెలిసింది. అన్ని అభిప్రాయాలను నివేదిక రూపంలో పార్టీ జాతీయ నాయకత్వానికి పరిశీలన కమిటీ అందజేసిన తరువాత , దాన్ని బట్టే తుది నిర్ణయం ఉంటుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి అధిష్టానం కిషన్ రెడ్డినే ఒప్పిస్తుందా ? లేక కొత్త వారిని నియమిస్తుందా చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rahul gandhi it is high time you get married
Damage in space shuttle hide by nasa from kalpana team  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more