ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత కమల్ హాసన్ ప్రతిష్ఠాత్మకంగా తెరెకెక్కించిన ‘విశ్వరూపం’ సినిమా ప్రదర్శనను తమిళనాడు ప్రభుత్వం నిషేదించింది. తమ మతాన్ని కించపరిచేలా .. ముస్లింలను తీవ్రవాదులుగా చూపించారంటూ ఇండియన్ నేషనల్ ముస్లింలీగ్ కు చెందిన పలువురు కార్యకర్తలు ఆళ్వారు పేటలోని కమల్ హసన్ ఇంటి వదద్ద ఆందోళనకు దిగారు. రేపు విడుదల కానున్న 'విశ్వరూపం' చలనచిత్రంపై తమిళనాడు ప్రభుత్వం రెండు వారాల పాటు నిషేధం విధించింది. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రాన్ని విడుదల చేయనున్న థియేటర్ల వద్ద సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు జారీ చేయాలని, సదరు థియేటర్లలో 'విశ్వరూపం' ప్రదర్శనను నిలివేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. విశ్వరూపం చిత్రాన్ని ప్రదర్శించరాదంటూ ఆయా థియేటర్ల యజమానులకు పోలీసు కమిషనర్ ఎస్ జార్జ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిషేధం రెండు వారాల పాటు కొనసాగుతుందని పోలీసు శాఖలో ఓ ఉన్నతాధికారి తెలిపారు. స్వీయ నిర్మాణంలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ కథనాయకుడుగా నటించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. అయితే శుక్రవారమే 'విశ్వరూపం' చిత్రాన్ని చూడాలన్న ఆసక్తితో చాలా థియేటర్లలో ప్రేక్షకులు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. కాగా తమ మతాన్ని కించపర్చేలా 'విశ్వరూపం' చిత్రం ఉందని పలు ముస్లిం సంస్థలు కూడా ఆరోపిస్తున్నాయి. వాస్తవానికి ఈ చిత్రం గత 11ననే విడుదల కావాల్సివుంది. అయితే థియేటర్ల కన్నా ముందు గానే ఈ చిత్రాన్ని డైరెక్ట్ టు హోం (డిటిహెచ్) ద్వారా టీవీల్లో ప్రసారం చేయాలని కమల్ హాసన్ నిర్ణయించడంపై వివాదం రేగడంతో 25కు వాయిదా పడింది.
దాదాపు 20 సంస్థల ప్రతినిధులు చిత్ర ప్రదర్శనను నిషేదించాలాంటూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి ఆర్ రాజగోపాల్ కు ఓ వినతి పత్రం ఇచ్చారు. ముస్లింలు, వారి నమ్మకాలను ఈ చిత్రం దెబ్బతీసేలా ఉందని, ఎమ్మెల్యే , తమిళనాడు ముస్లిం మున్నెట్ర కళగం అధ్యక్షుడు ఎంహెచ్ జవహరుల్లా ఆరోపించారు. కొన్ని సన్నివేశాలను తొలగించినా సరే తాము మాత్రం ఈ చిత్రాన్ని ఆమోదించేది లేదని ముస్లిం ఉద్యమాలు, రాజకీయ పార్టీల సమాఖ్య సమన్వయ కర్త మహ్మద్ హనీఫా తెలిపారు. దీంతో జయ సర్కారు విశ్వరూపం సినిమా ప్రదర్శపై నిషేదం విధించింది. మరో వైపు విశ్వరూపం సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లకు భద్రత కల్పించాలని కోరుతూ ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైనా కమల్ సోదరుడు చంద్రహాసన్ చెన్నై పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. గతంలో కమల్ తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ సాయిమీరా సంస్థ కోర్టును ఆశ్రయించింది. 2008 లో ‘మర్మయోగి’ చిత్రంకోసం చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారని , ఆయన తీసుకున్న రూ. 10.5 కోట్ల పారితోషికాన్ని తిరిగి చెల్లించేవరకు ‘విశ్వరూపం’ చిత్రాన్ని విడుదల చేయుకుండా స్టే విధించాలని కోరుతూ సాయిమీరా అధినేత రాజేంద్ర జైన్ మద్రాస్ హైకోర్టులో తాజాగా ఫిటిషన్ వేశారు. రేపు కమల్ విశ్వరూపం విడుదల నిలిపివేసినట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more