రాజకీయ నాయకులు సినిమా ట్రెండ్ ను బాగా ఫాలో అయ్యిపోతున్నారు. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు చూసిన సినిమా డైలాగులు, లేదా సినిమా నటనతో నటించి, ప్రజల మెప్పుపొందుతున్నారు. ఇటీవల సంక్రాంతికి విడుదలైన ‘‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’’ సినిమా రాజకీయ నాయకులకు బాగా ఉపయోగపడుతుంది. ఈ సినిమా టైటిల్ ను రాజకీయ నాయకులకు ఉతపదంగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చూశాడో లేదో గానీ, ప్రజల మద్య మాత్రం ఆ సినిమా టైటిల్ తో కొన్ని పదాలను ఉపయోగిస్తున్నారు. ముప్పై ఏళ్లు పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రి పదవులు పొందిన వారు సైతం డబ్బు సంచుల కోసం వైకాపాలోకి దూకుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఘాటుగా విమర్శలు చేశారు. "విజయలక్ష్మి వాకిట్లో అవినీతి చెట్టు పుట్టింది. అది పెరిగి పెద్ద ప్యాలెస్ అయింద''ని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కోటీ సంతకాల సేకరరణ పేరుతో విజయమ్మ న్యాయస్థానాలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. విజయమ్మ వాకిట్లో అవినీతి చెట్టు .. ఆ చెట్టు కూడా బ్రహ్మండంగా ఎదిగిందని ఎద్దేవా చేశారు. తన సభలకు జనమే రావడం లేదని అవినీతి డబ్బుతో పెట్టిన జగన్ పత్రిక, మీడియా ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. "మంచి పని చేయాలంటే ఎవరైనా గుడికో, చర్చికో, మసీదుకో వెళతారు. అదే వైసీపీలో చేరాలంటే చంచల్‌గూడ జైలుకు వెళ్లాలి. అక్కడే దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించాలి. పక్కకు వెళ్లి సంచులు తెచ్చుకోవాలి'' అని వైసీపీ తీరును ఎండగట్టారు.
అవినీతిపై పోరాటం చేయడం ద్వారానే మహానేత ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అర్పించగలమని పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని నల్లగొండ జిల్లా కోదాడ మండలంలో ఏర్పాటుచేసిన విగ్రహాలను ఆవిష్కరిస్తూ చంద్రబాబు పాదయాత్ర కొనసాగింది. జాతీయంగానూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ఏకపక్ష పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, చూడలేక తెలుగుదేశం పార్టీని స్థాపించి దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని నివాళి అర్పించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతులకు అండగా ఉంటామని ఆయన అన్నారు. సంతకాలు పెట్టగానే జగన్ అవినీతి నీతిగా మారుతుందా? అని ప్రశ్నించారు. 'ఆయన దగ్గర పనిచేసిన శాఖ అధిపతులు, పెట్టుబడి పెట్టిన వ్యాపారులు జైలుకు వెళ్లారు. అప్పుడు దోపిడీ చేసిన మంత్రులు ఇప్పుడు దొరల్లా తిరుగుతున్నారు'' అని వైఎస్ పాలననుద్దేశించి చంద్రబాబు విరుచుకుపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more