రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై కాంగ్రెస్ పార్టీ నాయకుల మద్య కోల్డ్ వార్ నడుస్తుంది. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం కరెంట్ ఛార్జీలు పెంచాలి అని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయం పై కొంత కాంగ్రెస్ నాయకులు అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ నుంచే నిరసనలు ఎదురవుతున్నా కిరణ్ సర్కార్ చార్జీలు పెంచడానికే సిద్ధమవుతోంది. జీతాలు పెరుగుతున్నాయి. చార్జీలు పెంచితే తప్పేమిటని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి చిరంజీవి మాత్రం చార్జీలు పెరిగితే పార్టీకి నష్టమేనని అంటున్నారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ మరోమారు స్వరం మార్చారు. ప్రజలకు షాకిస్తే తప్పేంటని అడుగుతున్నారు. జీతాలు జీవన ప్రమాణాలు పెరగడం లేదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలకు కాంగ్రెస్ పార్టీ పచ్చా జెండా ఊపింది. సొంత పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడంలేదు. పైగా కాంగ్రెస్ పార్టీ సామాన్యుల పక్షానే ఆలోచించే నిర్ణయం తీసుకుంటుందని సమర్ధించుకుంటోంది. కొన్ని రోజులుగా విపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలు చేస్తోన్న విమర్శల నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు బొత్స విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై నోరు విప్పారు.. విపక్షాల ఆందోళనపై విమర్శలు చేస్తూనే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. రాద్దాంతం చేస్తోన్న విపక్షాలు చార్జీలు పెంచకుండా ప్రత్యామ్నాయ సూచనలు ఉంటే ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీలను పెంచబోమని2009 ఎన్నికల ప్రణాళికలో తాము ఎటువంటి హామివ్వలేదన్నారు. ఇప్పుడు తప్పని పరిస్థితుల్లోనే ప్రభుత్వం చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుందని అయినా సామాన్యులపై భారం ఉండదన్నారు.. జీవన ప్రమాణాలు పెరిగాయని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచబోతున్నామని...అలాగే విద్యుత్ చార్జీలు కూడా పెంచుతామనే అర్థమోచ్చేలా బొత్స మాట్లాడారు. మరో వైపు విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై సొంత పార్టీలో విమర్శల జోరు కొనసాగుతునే ఉంది. కేంద్రమంత్రి చిరంజీవి ఛార్జీల పెంపుపై అసంతృప్తి వ్యక్తం చేసారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని లేకపోతే పార్టీకే నష్టమని హెచ్చరించారు. సొంత పార్టీలో వస్తోన్న నిరసనల నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు బోత్స అంతృప్తి వ్యక్తం చేస్తోన్న నేతలతో మాట్లాడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే విద్యుత్ చార్జీలను ప్రభుత్వం పెంచుతుందని వివరిస్తున్నట్టు సమాచారం. విపక్షాలతో పాటు స్వపక్షాల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శల్లో అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more