పార్లమంటు లో విగ్రహం పెట్టడానికి కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు క్రిష్ణం రాజు ముందుకు వచ్చారు. అందుకు లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ ఒక లేఖ రాసినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ లో విగ్రహం పెట్టడానికి , విగ్రహం ఇవ్వటానికి ఆయన ముందడుగు వేశారు. విగ్రహం అంటే ఎన్టీఆర్ విగ్రహం కాదులేండి? గిరిజన స్వాతంత్ర సమరయోదుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఇచ్చేందుకు తనకు అనుమతివ్వాలని సినీ నటుడు క్రిష్ణం రాజు కోరారు. అయితే ఒక విగ్రహం గొడవ రాష్ట్రం మూడు కుటుంబాల మధ్య వివాదం రేపిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సందర్భంలో సినీ నటుడు అల్లూరి విగ్రహం ఇవ్వటానికి రావటం పై సినీ ప్రజలు అనేక రకాలుగా చెప్పుకుంటున్నారు. ఇప్పుటికే కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి తన తండ్రి విగ్రహం ఇవ్వటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ విగ్రహం పై వారి కుటుంబాల మద్య వివాదం రగులుతున్న సమయంలో సినీ నటుడు అల్లూరి విగ్రహం ఇస్తాననటం పై సినీ పెద్దలు అనేక రకాలుగా అనుకుంటున్నారు. పార్లమెంటు లో ప్రతిష్ఠించేందుకు అల్లూరి సితారామరాజు విగ్రహాన్ని తాను ఇస్తానని లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ కు విజ్నప్తి చేశారు. అయితే మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తో పాటు పార్లమెంటు కు వచ్చిన ఆయన స్పీకరు కలిసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ విగ్రహంతో పాటు అల్లూరి విగ్రహం ఏర్పాటుకు 2000 సంవత్సంలోన స్పీకర్ గా ఉన్న బాలయోగి అనుమతించారని సినీ నటుడు క్రిష్ణం రాజు గుర్తుచేశారు. అయితే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విగ్రహాలు ఇవ్వాల్సి ఉండగా, అల్లూరి విగ్రహన్ని ఇస్తానంటూ 2006లో ముందుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదని సినీ నటుడు క్రిష్ణం రాజు తెలిపారు. అల్లూరి విగ్రహం పై యర్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రస్తావించగా రూ. 25 లక్షల వ్యయమయ్యే ఈ విగ్రహాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చానని క్రిష్ణం రాజు చెప్పారు. ఈ విషయం పై టాలీవుడ్ లో హాట్ న్యూస్ గా మారింది. టాలీవుడ్ నటుడు అల్లూరి విగ్రహం ఏర్పాటు కు ముందుకు వస్తే మరీ ఎన్టీఆర్ విగ్రహం పై ఆయన కుటుంబ సభ్యులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని టాలీవుడ్ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురందేశ్వరి విగ్రహం ఇవ్వటానికి ముందుకు వచ్చినప్పటికి విగ్రహ ప్రతిష్టలో జాప్యం ఎందుకు జరుగుతుందని ఎన్టీఆర్ అభిమానులు అనుకుంటున్నారు. మళ్లీ ప్రభుత్వం మారకముందే.. పార్లమెంటులో ఇద్దరు తెలుగు ప్రముఖ వ్యక్తుల విగ్రహాలు పెట్టడం చాలా మంచిదని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more