Princess niloufer prepares for legal battle to meet father

niloufer, the daughter of mukarram jah,princess niloufer, niloufer, nizams daughter, ancestal property, 2 thousand crores, legal battle, with mother manolya onur, legal wranpale, mukarramjah, hyderabad, falaknuma palace,

Princess Niloufer prepares for legal battle to meet father

Niloufer.gif

Posted: 11/21/2012 11:05 AM IST
Princess niloufer prepares for legal battle to meet father

Princess Niloufer prepares for legal battle to meet father

హైదరాబాద్‌తో విడదీయరాని అనుబంధం.. హైదరాబాద్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. నా మొ దటి పుట్టిన రోజు వేడుకలు నగరంలోని చిరాన్ ప్యాలెస్‌లో జరిగాయి. నాకు మూడు నాలుగు సంవత్సరాలు వచ్చే వరకూ ఎక్కువగా ఆ ప్యాలెస్‌లోనే గడిపాం. ఆ తరువాత కూడా నగరానికి వచ్చిపోతూనే ఉన్నాం. ఇక్కడా స్నేహితులున్నారు.. హైదరాబాద్‌లోని చిరాన్ ప్యాలెస్‌లో నేను పెరిగినప్పటికీ అప్పుడు మూడు నాలుగేళ్ల వయసు మాత్రమే ఉండటంతో ఆ సంఘటనలేవీ పెద్దగా గుర్తు లేదు. ఆ తరువాత కాలంలో చాలాసార్లు ఇక్కడికొచ్చాను. చాలామంది స్నేహితులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ గడిపే కొద్ది రోజుల్లోనే వారిని కలిసి వెళ్లాలనుకుంటున్నాను. నా తండ్రి పుట్టి పెరిగిన, మా పూర్వికులు అధికారం చలాయించిన ప్రాంత ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. అందుకోసమే చదువు పూర్తయిన తరువాత ఫిబ్రవరిలో హైదరాబాద్ వచ్చేయాలని అకుంటున్నాను. ఇక్కడే స్థిరపడి హైదరాబాదీల రుణం తీర్చుకుంటాను అని అంటున్నారు ఎనిమిదో నిజాం ప్రిన్స్ ముఖరంజా కుమార్తె ప్రిన్సెస్ నిలోఫర్. 21 సంవత్సరాలు నిండి మేజర్ అయిన సందర్భాన్ని పురస్కరించుకుని కుటుంబ స్నేహితురాలు షేర్రీ జవేరీ ఏర్పాటు చేసిన ప్రత్యేక పార్టీ కోసం ఇస్తాంబుల్ నుంచి నగరానికి వచ్చిన నిలోఫర్ ప్రత్యేకంగా ముచ్చటించారు

Princess Niloufer prepares for legal battle to meet father

మనిషిని ప్రేమించటం నేర్చుకున్నా..! నాన్న నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే మనిషిని ప్రేమించటం. ప్రపంచంలో అత్యంత ధనవంతుడు నిజాం నవాబు అని అందరూ అంటారు . ఈ సంపదకు వారసుడిగా ఎనిమిదో నిజాంగా నా తండ్రి ప్రిన్స్ ముఖరంజా సైతం సంపద అనుభవించారు. కాని ఆయనలో గర్వం లేదు. .. ఎదుటి వారిని అమితంగా ప్రేమిస్తారు. తనకు అంత డబ్బున్నప్పటికీ ఎప్పుడూ ఆ దర్పం ప్రదర్శించలేదు. అదే నాకూ వచ్చింది. నిజాం కుమార్తెగా ఎప్పుడూ దర్పం ఒలకబోయాలని కోరుకోలేదు. ప్రజలకు సేవ చేయటమే నేర్చుకున్నా. పేదలకు సేవ చేయటంలోనే ఆనందం.. పేదలకు సేవ చేయటంలోనే ఎక్కువ ఆనందం ఉందని నేను నమ్ముతాను. ఇస్తాంబుల్‌లో నాకు చేతనైంత వరకు పేదలకు, అనాథలకు సహాయపడుతుంటాను. అదే విధమైన సేవను నాన్న పుట్టి, పెరిగిన హైదరాబాద్ ప్రజలకు చేయాలని కోరుకుంటున్నాను. 21 ఏళ్ల కూతురిగా తండ్రి కోసం పడుతున్న ఆరాటం నాది. అంతకుముందు తరచుగా మా నాన్నను కలిసేదాన్ని. ఇప్పుడు కనీసం మాట్లాడనీయటం లేదంటే ఎంత బాధ ఉంటుందో చెప్పండి..! హక్కు కోసమే పోరాటం ..! నా పోరాటం ఆస్తి కోసం కాదు నిజాం వారసురాలిగా నా హక్కు కోసం. కుటుంబ గౌరవం కోసం. ఆస్తి కోసమే అయితే నేను ఇంకో మార్గంలో ప్రయత్నించవచ్చు. ఇక్కడ మీకో విషయం చెబుతా... ఓ సారి మా నాన్న గిఫ్ట్‌గా ఉంచుకోమని డాలర్ల కట్టలు నా ముందు ఉంచారు. చాలా పెద్ద మొత్తం అది. ఆయన నన్ను కావాల్సినంత తీసుకోమన్నారు. నేను 10 డాలర్ల నోట్ తీసుకుని నాకు చాలు డాడ్ అన్నాను. ఐ డోంట్ వాంట్ మనీ..! నాకు కావాల్సింది ఆయన ప్రేమ. అంతే తప్ప మరోటి కాదు. నాకు తెలుసు మా నాన్న నన్ను ఎంతగానో అభిమానిస్తారని. నేను పోరాడేది హక్కు కోసం. అంతే..!!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Left rebuffs mamata banerjees support to no trust vote
Lambasingi village has lowest temperatures  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more