టీమ్ ఇండియాలో కొన్ని రోజుల నుండి సైలెంట్ వార్ నడుస్తుంది. టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ధోరణి రోజు రోజుకు మారుతుంది. తన తోటి క్రీడారుల పై అధిపత్యం సాగిస్తున్నట్లు డ్రాసింగ్ రూమ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ ఆటగాడు రిటైర్ మెంట్ కారణం పరోక్షంగా ధోనీ అనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే రీసెంట్ ధోనీ , వీరేంద్ర సెహ్వాగ్ ల మధ్య కోల్డ్ వారు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే మరీ తీవ్రరూపం దాల్చినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇద్దరూ మాటల యుద్దానికి దిగారా? టోర్నీలో భారత వైఫల్యానికి వీరి విభేదాలు కూడా కారణమా? అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. వ్యవహారం బోర్డు పెద్దలు జోక్యం చేసుకునే వరకూ వెళ్లిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో కొన్ని కీలక మ్యాచ్ ల్లో తనను పక్కన బెట్టడం పై ధోని పై గుర్రుగా ఉన్న వీరూ.. ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాతో వీరూను ఆడించకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు బీసీసీఐ అధికారులు చెబుతున్నారు.
అదే విషయాన్ని వీరూ ధోనిని ప్రశ్నించగా .. దానికి సమాధనం నీ పద్దతి బాగాలేదని, జట్టు విషయంలో నిబద్దతతో లేవనే కారణంతో పక్కన పెట్టినానని ధోని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఐపీఎల్ లో చక్కగా ఆడిన వీరూ టీమ్ ఇండియాకు వచ్చేసరికి కావాలనే విఫలమవుతున్నాడని .. తన కెప్టెన్సీకి మచ్చ తెచ్చేందుకు అలా చేస్తున్నాడని ధోని చెబుతున్నాడు. ఆటగాళ్ల మధ్య వీరూ విభజన తెస్తున్నాడని కూడా ధోని ఆరోపిస్తున్నాడు. ఈ ఇద్దరి వ్యవహరం బాగా ముదరటంతో బోర్డు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దిందని అనే వార్తలు వినిపిస్తున్నాయి. పైకి ఇప్పుడు చల్లబడిన .. లోపల రగులుతూనే ఉంటుందనే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి విభేధాలు వలన ఇండియా పరువు పోతుందని ఆ ఇద్దరి ఆటగాళ్లు తెలుసుకోవాలి. ఇద్దరు దేశం ప్రతిష్ట కోసం .. పేరు తెచ్చే యువరాజులు అని గుర్తుపెట్టుకోవాలి. మీ విభేదాలు .. మీ ఇంటివి కాదు? మీ ఇద్దరి మీద దేశ ప్రజలకు మంచి అభిప్రాయం ఉంది. దేశం కోసం పోరాడే వీరులారా... ప్రజలల్లో ఉన్న మంచి అభిప్రాయాన్ని చెడుగా మార్చకండి? మీరు ఇద్దరి కాదు.. ఈ ఇద్దరి వెనుక కొన్ని కోట్ల మంది అభిమానం ఉందని మారవకండి? ఆటగాళ్లు జట్టుగా కలిసి ఉంటేనే విజయం సాదిస్తాం. అనే మాటలు నిజం చేసిన మహవీరులు మీరు. మీరు కలిసి ఆడకపోతే .. ప్రపంచకప్ వచ్చేదా? మీరు ఎన్నో విజయాలను అందించారు. మీరు కనిపించే క్రికెట్ దేవుళ్లు . ప్రజలు మిమ్మల్ని దేవుళ్లతో పోల్చుకుంటున్నారు. అలాంటి దేవుళ్లు తప్పులు చేస్తారా.. ఆలోచించండి.. ధోని, సెహ్వాగ్ ? మీరు మంచి స్నేహితులుగా ఉండి ముందు వారికి ఆదర్శంగా నిలవండి ..ప్లీజ్ .. విభేదాలు వద్దు.. విజయం మన హద్దు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more