Taliban gun down girl who spoke up for rights

Taliban Gun, Girl,Malala Yousafzai,Pakistani Taliban,schoolgirl,target 14-year-old girl,Islamists

Taliban Gun Down Girl Who Spoke Up for Rights

Taliban.gif

Posted: 10/10/2012 01:08 PM IST
Taliban gun down girl who spoke up for rights

Taliban Gun Down Girl Who Spoke Up for Rights

పాకిస్థాన్‌లోతాలిబాన్లు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. తమకు వ్యతిరేకంగా గళం విన్పించిందనే ఆగ్రహంతో ఓ బాలిక కార్యకర్తపై కిరాతంగా కాల్పులు జరిపారు. తమ దుశ్చర్యలను దనుమాడిందనే దుగ్దతో 14 ఏళ్ల చిన్నారిపై హత్యాయత్నం చేశారు. బాలికా విద్యపై ఇస్లాం తీవ్రవాదుల వైఖరిని వ్యతిరేకించి చిన్నవయసులోనే అత్యంత ధీశాలిగా పాకిస్థాన్‌లో ఖ్యాతికెక్కిన మాలాల యూసఫ్‌జాయ్(14)ను అంతం చేసేందుకు ప్రయత్నించారు. బడి నుంచి పాఠశాల బస్సులో ఇంటికి వెళుతున్న మాలాలపై కర్కశ దుండగుడొకడు తుపాకీతో రెండుసార్లు కాల్చాడు. స్వాత్ వ్యాలీలోని మింగోర ప్రాంతంలో ఈ దురాగతానికి ఒడిగట్టాడు. దుండగుడి కాల్పుల్లో తలకు, మెడకు గాయాలయిన ఆమెకు అత్యవసర చికిత్స చేసిన తర్వాత సైనిక హెలికాప్టర్‌లో పెషావర్‌కు తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మాలాలపై దాడి చేసింది తామేనని తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్థాన్(టీపీపీ) ప్రకటించుకుంది. పాశ్చాత్య అనుకూల వైఖరి, తాలిబాన్లను వ్యతిరేకించడంతో పాటు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను తన ఆదర్శ నేతగా ప్రకటించుకున్నందునే ఆమెను అంతమొందించేందుకు యత్నించామని టీపీపీ ప్రతినిధి ఇషానుల్లా ఇషాన్ వెల్లడించాడు.

Taliban Gun Down Girl Who Spoke Up for Rights

పాశ్చాత్య సంస్కృతిని ఆమె ప్రచారం చేస్తోందని నిందించాడు. స్వాత్ వ్యాలీలో సెక్యులర్ సర్కారు కొలువుతీరాలన్న ఆకాంక్షను బయటపెట్టడంతో గతంలోనే ఆమెను తాలిబాన్లు ‘హిట్ లిస్ట్’లో పెట్టారు. చివరకు అదునుచూసి బలితీసుకోవాలనుకున్నారు.అందమైన పర్వతశ్రేణులతో పర్యాటక ప్రాంతంగా విలసిల్లిన స్వాత్ లోయ తాలిబాన్ల స్వాధీనంలోకి వెళ్లాక అరాచకాలతో అట్టుడుకుతోంది. బాలికా పాఠశాలలను మూయించడం, మగాళ్లను గడ్డాలు పెంచాలని ఒత్తిడి చేయడం, తమకు ఎదురు తిరిగిన వారి తలలు నరకడం వంటి దుశ్చర్యలకు తాలిబాన్లు తెగబడుతున్నారు. 2009లో పాక్ సైన్యం స్వాత్ లోయలో తాలిబాన్లను అణచివేసిన సందర్భంలో మాలాల వెలుగులోకి వచ్చింది. తాలిబాన్ల దురాగతాలకు వ్యతిరేకంగా మాలాల గొంతెత్తింది. బీబీసీ ఉర్దూ వెబ్‌సైట్ కోసం రాసిన బ్లాగ్‌తో ఆమె తాలిబాన్ల ఆగ్రహాన్ని చవిచూసింది. అయినా ఆ చిన్నారి భయపడలేదు. భద్రత పేరుతో చదువుకు అడ్డంకులు ఎదురైనా విచారించలేదు.గతేడాది ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతికి నామినేటయిన మాలాల పురస్కారానికి ఎంపిక కాలేదు. దీంతో అప్పటి పాక్ ప్రధాని యుసఫ్ రజా గిలానీ తమ దేశ మొట్టమొదటి జాతీయ శాంతి బహుమతిని ఆమెకు ప్రదానం చేసి, ప్రశంసించారు.

Taliban Gun Down Girl Who Spoke Up for Rights

భవిష్యత్‌లో సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని, పేద బాలికల కోసం వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ పెడతానని తన మనసులోని కోరికను మాలాల ఇటీవల బయటపెట్టింది. ఇంతలోనే ముష్కరుల తూటాల బారినపడింది.రాజకీయ అనిశ్చితికి, తీవ్రవాద దాడులకు ఆలవాలమైన పాకిస్థాన్‌లో బాలికల రక్షణ గాల్లో దీపంగా మారింది. సంకుచిత ఛాందసవాదుల అరాచకాలకు మహిళలు, బాలికలు బలైపోతున్నారు. స్త్రీ స్వేచ్ఛ, మహిళా విద్యను వ్యతిరేకించే తాలిబాన్లు తమ కట్టుబాట్లను కాదన్న ఇంతులపై కిరాతక దాడులకు తెగబడుతున్నారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరితో వారు మరింత రెచ్చిపోతున్నారు. ఛాందసవాదుల చేతిలో కీలుబొమ్మలుగా మారిన పాలకులు మహిళలపై జరుగుతున్న అకృత్యాలను, దాడులను నిరోధించడంలో విఫలమవుతున్నారు. ఇలాంటి నాయకులున్నంతకాలం తాలిబాన్ల చేతిలో మహిళలు దాడులకు గురవుతూనే ఉంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan in trouble as ed targets vanpic
Chiranjeevi position in congress after 2014  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more