దళితులపై దాడులు జరుగుతుంటే.. కూడా చూసి ఏమీ చేయలని మంత్రులను తోలు తీయండి అని కేవిపిఎస్ సంఘం అంటుంది. లక్ష్మీంపేటలో దళితులను హత్య చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన దళిత సంఘాల నాయకుల తోలు తీస్తామని మంత్రి కొండ్రు మురళీ వ్యాఖ్యానించడాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కెవిపిఎస్) తీవ్రంగా ఖండించింది. మంత్రికి ఏమాత్రం చిత్త శుద్ధి ఉన్నా దళితులను హత మార్చిన హంతకుల తోలు తీయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లి ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పెత్తందార్లు ఐదుగురు దళితులను వెంటాడి హత్యచేస్తే, సొంత పార్టీ నాయకులు నిందితులను కాపాడుతుంటే దళితుడై ఉండి కూడా ఏమీ చేయలేని కొండ్రుకు మంత్రి పదవి ఎందుకు? రాజీనామా చేయాలంటూ కెవిపిఎస్, ఇతర దళిత సంఘాల నాయకులు చేసిన సూచనపై మంత్రి ఆగ్రహించడం శోచనీయమన్నారు. పెత్తందారులా మారి దళితులపై ఎదురు దాడి చేసే బదులు స్వేచ్ఛగా తిరుగుతున్న ప్రధాన నిందితులను అరెస్టు చేయించాలన్నారు. ఆ భూమిని దళితులే సాగు చేసుకునే అవకాశం కల్పించేందుకు కృషి చేయాలని జాన్‌వెస్లీ మంత్రికి హితవు పలికారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more