మావో తనను కుమారుడిగా భావించేవారని బౌద్ధుల ఆధ్యాతిక గురువు దలైలామా తెలిపారు. బ్రిటన్‌లో పర్యటిస్తున్న దలైలామా.. ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ... ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అప్పట్లో తాను చైనాలో ఉం డేవాణ్నని, మావోతో తనకు మంచి సంబంధాలుండేవన్న దలైలామా.. మావో తనను కుమారుడిగా, తాను ఆయనను తండ్రిలా భావించేవారమని తెలిపారు. "మావో ఎన్నోసార్లు నన్ను అధికారిక విందుల్లో తన పక్కన కూర్చోబెట్టుకునేవారు. చైనా సంప్రదాయం ప్రకారం తానే స్వయంగా వడ్డించేవారు.
ఐతే ఆయన చుట్టతోనే నాకు సమస్య వచ్చేది. ఆయన దగ్గినపుడల్లా నా ప్లేట్లో ఏవైనా క్రిములు పడతాయేమోనని భయపడేవాణ్ని'' అని దలైలామా సరదాగా వ్యాఖ్యానించారు. 1959 నుంచి టిబెట్‌కు దూరంగా ఉంటూ భారత్‌లో ఆశ్రయం పొందుతున్న దలైలామా.. ఇటీవల టిబెట్ స్వాతంత్య్రం కోసం పలువురు ఆత్మహత్య చేసుకోవ డంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల బ్రిటన్‌తో పాటు ఇతర దేశాలలోని ఆర్థిక సంక్షోభాన్ని తనదైన శైలిలో విశ్లేషించిన దలైలామా.. మానవుడు తాత్కాలిక లాభాల కోసం దీర్ఘకాలిక ప్రయోజనాలను బలిపెడుతున్నాడని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more