గత జన్మలో హత్యలు, అత్యాచారాలు చేసిన వారు ఈ జన్మలో పోలీసులవుతారా? గత జన్మలుంటాయని పోలీసులు నమ్ముతారా? పోలీసులను తీర్చిదిద్దే రాష్ట్ర పోలీసు అకాడమీ(అప్పా)లో ఇలాంటి ఆసక్తికర చర్చ జరిగింది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ బీ లోకూర్ సమక్షంలోనే ఈ చర్చ జరగడం పోలీసు ఉన్నతాధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. చిన్న చిన్న కేసుల్లో కోర్టు వెలుపల ‘ముందస్తు రాజీ’ అంశంపై పోలీసుశాఖలో అవగాహన కల్పించేందుకు అప్పాలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఆ సదస్సుకు జస్టిస్ మదన్ బీ లోకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సదస్సు అనంతరం జస్టిస్ లోకూర్, డీజీపీ వి.దినేష్‌రెడ్డిలతోపాటు అదనపు డీజీలు, ఐజీలు, ఎస్పీలు, శిక్షణలో ఉన్న ఐపీఎస్‌లు ఒకేసారి భోజనానికి కూర్చున్నారు. జస్టిస్ లోకూర్ ఎదురు వరుసలో కూర్చున్న అదనపు డీజీ తేజ్‌దీప్ కౌర్ మీనన్ ఈ ఆసక్తికరమైన చర్చకు నాంది పలికారు. ‘సార్ మీరు వచ్చే జన్మలో కూడా న్యాయమూర్తిగానే ఉండాలని నేను కోరుకుంటున్నాను’ అని జస్టిస్ లోకూర్‌ను ఉద్దేశించి ఆమె అన్నారు. ‘ఈ వృత్తి లో నాకు చాలా సంతృప్తి ఉంది. కచ్చితంగా వచ్చే జన్మలోనూ న్యాయవ్యవస్థలోనే ఉండాలని నేనూ కోరుకుంటున్నాను’ అని జస్టిస్ లోకూర్ తడుముకోకుండా సమాధానమిచ్చారు. అంతటితో చర్చ ఆగిపోతే బాగుండేది. కానీ, తేజ్‌దీప్ కౌర్ మీనన్ మళ్లీ జోక్యం చేసుకుని ‘‘ గత జన్మలో హత్యలు, అత్యాచారాలు చేసివుంటాం. అందుకనే ఈ జన్మలో మేము పోలీసు ఉద్యోగాల్లోకి వచ్చాం’’ అని అన్నారు.
దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ‘ఆ వ్యాఖ్యలను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను’ అంటూ సీఐడీ అదనపు డీజీ రమణమూర్తి ఆమె వ్యాఖ్యలకు అడ్డు తగిలారు. ‘గత జన్మలో అకృత్యాలు చేయడం వల్ల పోలీసు ఉద్యోగాల్లోకి వచ్చామని నేను భావించడంలేదు. పోలీసుశాఖలోకి రావడం చాలా ఉన్నతమైనదిగా నేను విశ్వసిస్తున్నాను’ అని అన్నారు. దీంతో శిక్షణలో ఉన్న ఐపీఎస్‌లు కూడా ఆయనకు మద్దతు పలికారు. ‘ఐబీఎంలో ఉద్యోగాన్ని వదులుకుని మరీ ప్రజలకు సర్వీసు చేసేందుకు నేను ఐపీఎస్‌కు వచ్చాను’ అని శిక్షణలో ఉన్న ఒక ప్రొబేషనరీ స్పష్టంచేశారు. ‘పోలీసుశాఖలో ఉంటూ వృత్తి గురించి ఇంత తక్కువగా మాట్లాడటమేమిటి..? పోలీసు అధికారులుగా ఉండి గత జన్మలపై నమ్మకమేమిటి..?’’ అంటూ మరికొందరు ప్రొబేషనరీలు ప్రశ్నలు సంధిం చారు. చివరికి డీజీపీ దినేష్‌రెడ్డి జోక్యం చేసుకున్నప్పటికీ ఆ చర్చకు తెరపడలేదు. ఆఖరికి జస్టిస్ లోకూర్ జోక్యం చేసుకుని.. ‘ఎలా పడితే అలా మాట్లాడుకోవడానికి మనం చిన్న పిల్లలం కాదు’ అంటూ సున్నితంగా చురకలంటించడంతో అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more