వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పై రాజ్యసభ్య సభ్యుడు చిరంజీవి తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు, 'తల్లీ... ఈ రోజు నీ కొడుకును అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నావు, ఒక తల్లిగా నీ బాధలో అర్థం ఉంది. అయితే ఆ రోజు పచ్చటి పొలాలను గుంజుకుని సెజ్‌లకు ఇచ్చినప్పుడు ఎన్ని వేలమంది తల్లులు కడుపుకోతకు గురయ్యారు? ఆ వేదన నీకు వినిపించలేదా, ఆ కన్నీళ్లు నీకు కనిపించలేదా తల్లీ..' అని చిరంజీవి వైఎస్ విజయలక్ష్మిని ప్రశ్నించారు. అవినీతిని, ఉపఎన్నికలను ఒకటిగా చూడకూడదని, వేరువేరుగా చూడాలని కోరారు. వైఎస్ హ యాంలో అవసరాలకు మించి, చట్టాలను అతిక్రమించి, వెయ్యి ఎకరాలు అవసరం అనుకున్న చోట 10వేల ఎకరాలు, 10 వేలు అవసరం అనుకున్నచోట 20 వేల ఎకరాల పచ్చని పొలాలను లాక్కొని ఎంతోమంది బతుకులు బుగ్గిపాలు చేశారు.
మీ కొడుకు నిర్మించుకు న్న అవినీతి సామ్రాజ్యం వెనుక ఎంతమంది తల్లుల బతుకులు బుగ్గిపాలయ్యాయో కనిపించలేదా అమ్మా అని ప్రశ్నించారు. వాన్‌పిక్ పేరుతో పోలీసులను పెట్టి 80 గ్రామాలను రాత్రికి రాత్రి బలవంతంగా ఖాళీ చేసినప్పుడు ఆ తల్లుల ఆక్రోశం మీ చెవిన పడలేదా అని ప్రశ్నించారు. తన భూమిని లాకున్నప్పుడు శ్రీరాములు అనే రైతు ఆ పొలం వద్దే గుండె పగిలి చనిపోయినప్పుడు ఆ కుటుంబం పెట్టిన కన్నీళ్లు మిమ్మల్ని కరిగించలేకపోయాయా అని చిరంజీవి ప్రశ్నించారు. 'చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం తప్పుడు ఆరోపణలు చేయడం మీ స్థాయికి తగదని మనవి చేసుకుంటున్నా' అని విజయలక్ష్మిని ఉద్దేశించి చిరంజీవి అన్నారు. వైఎస్ మృతి కేవలం ప్రమాదమేనని సీఐడీ, కేంద్ర నిజనిర్ధారణ కమిటీ నిగ్గు తేల్చాయని చిరంజీవి గుర్తు చేశారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more