దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎక్కడ వీలుంటే అక్కడ భూములను కంపెనీలకు ధారాదత్తం చేసిన వైయస్ఆర్ చివరకి తన కడప జిల్లాని కూడా వదల్లేదు. కడప జిల్లా సీకే దిన్నె, వల్లూరు, పెండ్లిమర్రి మండలాల్లోని వివిధ గ్రామాల పరిధిలో 6,339 ఎకరాలను సాగు చేసుకుంటూ వచ్చిన వందల మంది రైతుల బతుకులు బజారున పడేస్తూ... మెగా ఇండస్ట్రియల్ పార్కు కోసమంటూ అక్కడి రైతుల భూముల్ని వైయస్ సర్కారు బలవంతంగా లాక్కొన్నారు. ఎప్పుడో పాతిక ముప్పై ఏళ్ళ క్రితమే రిజిస్ట్రేషన్ చేయించుకొని, పట్టాదారు పాసుపుస్తకాలను పొంది... బ్యాంకుల నుండి రుణాలు సైతం తీసుకుంటున్న భూముల్ని చట్ట విరుద్దంగా కొన్నారంటూ వైయస్ ప్రభుత్వం అకస్మాత్తుగా ప్రకటించింది.
ఇలా లాక్కోవడానికి 2006లో శాసనసభ ఆమోదం లేకుండానే గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా సవరించింది. ఎప్పుడో ఇందిరా గాంధీ ఇచ్చిన భూముల్ని తీసేసుకుంది. ఇన్ని దారుణాలు చేసి భూముల్ని లాక్కున్నా నాలుగేళ్ళయినా అక్కడికి ఒక్క కంపెనీ రాలేదు. ఇవే కాకుండా కడప జిల్లా అంతటా వేల ఎకరాలను ప్రభుత్వం చేజిక్కించుకుంది. దీంతో అక్కడి రైతులు రోడ్డున పడ్డారు. రానున్న రోజుల్లో వైయస్ భూ భాగోతాలు బయటపడతాయో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more