Delhi completes 100 years as national capital

Indian capital, Delhi, national capital, new delhi completes 100 years, india capital, lutyens delhi, rashtrapati bhawan, india gate, 100 years of delhi

Delhi is now 100 years young since it became India's national capital on December 12, 1911.Designed by Edward Lutyens, New Delhi was made the Capital of India 100 years ago. The pride of India Rashtrapati Bhawan Dome was inspired by Sanchi Stupa.

Delhi completes 100 years.GIF

Posted: 12/12/2011 09:47 AM IST
Delhi completes 100 years as national capital

100-years-delhiదేశానికి రాజధానిగా ఉన్న ఢిల్లీకి నేటితో వందేళ్ళు నిండాయి. అదే ఢిల్లీలో ఉన్న పార్లమెంటు భవన దాడికి పదేళ్ళు నిండాయి.
ఢిల్లీలో కొత్త నగరానికి (న్యూఢిల్లీ) 1911 డిసెంబర్ 15న జార్జి చక్రవర్తి, ఆయన సతీమణి మేరీ కింగ్స్‌వే క్యాంప్ వద్దనున్న ఢిల్లీ దర్బార్ స్థలంలో పునాది రాయి వేశారు. కోల్‌కతా నుంచి పరిపాలనా భవనాలన్నింటినీ ఢిల్లీకి మార్చారు.

అప్పటి నుంచి కొత్తగా ఏర్పడ్డ రాజధాని ప్రాంతాన్ని 'న్యూఢిల్లీ’ అని పిలవసాగారు. నిజానికి.. గత 3వేల సంవత్సరాలుగా భారత దేశాన్ని పాలించిన పలు చక్రవర్తులు ఢిల్లీ కేంద్రంగానే పాలన సాగించారు. ఇలా.. ఒక్కో రాజ వంశం తమ హయాంలో ఢిల్లీలోని ఒక్కో ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని.. కోట రూపంలో పరిపాలనా భవనాలను నిర్మించినందున ఢిల్లీ చుట్టూ కనీసం ఎనిమిది నగరాలు ఏర్పడ్డాయి.
ఆధునిక భారత దేశానికి న్యూఢిల్లీని రాజధానిగా బ్రిటిష్ వాళ్లు ఏర్పాటు చేసి ఉండవచ్చు. కానీ.. భారత చరిత్రలో శతాబ్దాల తరబడి పరిపాలనా కేంద్రంగా ఢిల్లీ ఉంది. దేశ రాజకీయ పటంలో ఢిల్లీకి ఉన్న ప్రాధాన్యం మూడు వేల సంవత్సరాల క్రితం నాటిది మరి. పాండవుల కాలం నుంచే భారత దేశానికి ఢిల్లీ రాజధానిగా ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. పాండవులు యుమునా నది ఒడ్డున ఉన్న ఇంద్రప్రస్థను రాజధానిగా చేసుకొని పాలన సాగించారని మహాభారతం పేర్కొంటోంది.

అంటే.. ఇంద్రప్రస్థ అన్నది ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పాతకోట చుట్టూ ఉన్న ప్రాంతం అయి ఉంటుందని భావిస్తున్నారు. 13వ శతాబ్దంలో భారత్‌పై దండయాత్రకు వచ్చిన బానిస వంశం పాలకులు మొదలుకొని.. 14వ శతాబ్దంలో దేశాన్ని ఏలిన తుగ్లక్ వంశం పాలకులు, 15వ శతాబ్దంలో దేశాన్ని ఏలిన లోడీలు కూడా ఢిల్లీనే తమ రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఆ తరువాత.. మొగల్ చక్రవర్తి షాజహాన్ క్రీ.శ. 1639లో పాత ఢిల్లీని షాజహానాబాద్ పేరుతో తన సామ్రాజ్యానికి రాజధానిగా ప్రకటించారు.

ఢిల్లీ శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. జనవరి నుంచి ఏడాది పాటు ఉత్సవాలు జరిపాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.
భారత దేశ సార్వభౌమత్వానికి ప్రతీక అయిన అమూల్యమైన భవనాన్ని భవనాన్ని తీవ్రవాదుల నుండి ఆ జవాన్లు రక్షించగలిగారు. 2001 డిసెంబర్ 13న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలోని ముష్కరులు.... పార్లమెంటు భవనం దాడికి ప్రయత్నించారు. ఆ దాడిని సీఆర్పీఎప్ జవాన్లు తిప్పి సమర్థవంతంగా తిప్పి కొట్టారు. ఉగ్రవాదుల తూటాలకు 8 మంది జవాన్లు నేలకొరిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kids drugged to be street beggars in bangalore
Kk comments against congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Lalu prasad says he too wants to be pm

    Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more

  • Obama meets with aung san suu kyi

    Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని  కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more

  • Chandrababu meets balakrishna

    Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more

  • Samaikhyandhra activists plan chalo hyderabad

    Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more

  • Konda surekha fire on kcr

    Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more