Indian cough syrup turn a kids' killer in the Gambia? చిన్నారుల మరణాలకు కారణమైన ఫార్మపై డబ్యూహెచ్ఓ విచారణ

Who has warned about 4 indian cough syrups after death of 66 kids in gambia

Promethazine Oral Solution, Kofexmalin Baby Cough Syrup, Makoff Baby Cough Syrup, Magrip N Cold Syrup, who, gambia, cough syrup, children death, maiden pharmaceuticals, who, gambia, cough syrup, children death, acute kidney injuries, diethylene glycol, ethylene glycol, maiden pharmaceuticals, Haryana

The World Health Organization (WHO) issued a warning alert against four cough and cold syrups, manufactured by an Indian company after 66 kids died in the Gambia over the last few months. The Haryana-based company – Maiden Pharmaceuticals – has been “potentially linked” to the deaths of the children who had developed acute kidney injuries, the WHO said. The cough syrups – Promethazine Oral Solution, Kofexmalin Baby Cough Syrup, Makoff Baby Cough Syrup, and Magrip N Cold Syrup – were found to have diethylene glycol and ethylene glycol, both of which are harmful to children and adults.

66 మంది చిన్నారుల మరణాలకు భారత ఫార్మ దగ్గుమందు కారణమా.?

Posted: 10/06/2022 12:49 PM IST
Who has warned about 4 indian cough syrups after death of 66 kids in gambia

భారత్​కు చెందిన ఓ ఔషధాల తయారీ సంస్థకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ జారీ చేసింది. ఆప్రికా దేశం గాంభియాలో 66 మంది చిన్నారుల మరణాలకు ఆ ఔషధాల తయారీ సంస్థ తయారు చేసిన దగ్గు మందు కారణమన్న అబియోగాలు రావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం అయ్యింది. భారత్ కు చెందిన ఆ సంస్థ భద్రతా ప్రమాణాలు పాటిస్తుందా లేదా అని తేల్చేందుకు దర్యాప్తు చేపట్టింది. హర్యానా కేంద్రంగా పనిచేసే మెయిడెన్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ సంస్థ తయారు చేసిన నాలుగు రకాలు దగ్గు సిరప్లపై భారత ప్రభుత్వం కూడా విచారణకు అదేశించింది.

ఈ నాలుగు రకాల 'కలుషిత' సిరప్​లు ఆఫ్రికన్​ దేశమైన గాంబియాలో 66 మంది చిన్నారుల మృతికి, మరికొందరు కిడ్నీ సంబంధిత సమస్యల బారిన పడేందుకు కారణం కావచ్చొన్న వార్తల నేపథ్యంలో ఈమేరకు చర్యలు చేపట్టింది డబ్ల్యూహెచ్​ఓ."ఈ నాలుగు ఔషధాలు.. భారత్​లోని మెయిడెన్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్​ ఉత్పత్తి చేసిన దగ్గు, జలుబు మందులు. ఆ కంపెనీతోపాటు భారత్​లోని నియంత్రణ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఈ వ్యవహారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు చేపడుతోంది." అని తెలిపారు ప్రపంచ అరోగ్య సంస్థ డైరక్టర్​ జనరల్​ టెడ్రోస్​ అధనోమ్. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబీకుల బాధ వర్ణనాతీతం అన్నారు.

ప్రొమెతజైన్​ ఓరల్ సొల్యూషన్​, కాఫెక్స్​మాలిన్ బేబీ కాఫ్​ సిరప్, మాకాఫ్​ బేబీ కాఫ్​ సిరప్, మేగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్​ విషయంలో మెయిడెన్ ఫార్మాకు అలర్ట్ జారీ చేసింది డబ్ల్యూహెచ్​ఓ. వీటి ఉత్పత్తిలో పూర్తిస్థాయిలో భద్రత, నాణ్యతా ప్రమాణాల్ని పాటించినట్టుగా ఇప్పటివరకు ఆ సంస్థ తమకు తగిన ఆధారాలు సమర్పించలేదని చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ 'కలుషిత' ఔషధాలు ప్రస్తుతానికి గాంబియాలోనే వెలుగు చూసినా.. ఇతర దేశాలకూ వాటిని సరఫరా చేసి ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఆ నాలుగు సిరప్​లు మార్కెట్​లో లేకుండా చేయాలని అన్ని దేశాలకు డబ్ల్యూహెచ్​ఓ సూచించింది.

గాంబియాలో చిన్నారుల మరణాల నేపథ్యంలో ఈ నాలుగు ఔషధాలపై సెప్టెంబర్​లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఫిర్యాదు అందింది. ఆయా సిరప్​లలో అధిక మోతాదుల్లో డైఎథిలీన్​ గ్లైకాల్​, ఎథిలీన్ గ్లైకాల్​ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఆ రెండూ చాలా ప్రమాదకరమని, మరణానికీ కారణం కావచ్చని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. "డైఎథిలీన్​ గ్లైకాల్​, ఎథిలీన్ గ్లైకాల్ కారణంగా కడుపు నొప్పి, వాంతులు, డయేరియా, మూత్ర విసర్జనలో ఇబ్బందులు, తల నొప్పి, మానసికంగా అనిశ్చితి, తీవ్రమైన కిడ్నీ సమస్యలు తలెత్తి.. చివరకు మరణానికి దారి తీయవచ్చు" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. సంబంధిత సంస్థలు ఆయా సిరప్​లను విశ్లేషించి, క్లియరెన్స్​లు ఇచ్చే వరకు వాటిని హానికరమైన ఔషధాలగానే పరిగణించాలని సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles