Sunrays touch Arasavalli deity for 5 minutes అరసవల్లిలో మూలవిరాట్‌ను తాకిన సూర్యకిరణాలు

Sun rays touch deity s feet for 5 minutes at arasavilli temple

Sunrays, Lord Sri Suryanarayana Swamy idol, Arasavalli temple, Temple chief priest, Ippili Sankara Sarma, temples architecture, presiding deity, Lord Surya Narayana Moorthy, October, Arasavalli, Srikakulam, Andhra Pradesh, Devotional

Sunrays touched the feet of Lord Sri Suryanarayana Swamy idol at Arasavalli temple of Srikakulam district in the early hours on Saturday. The sunrays touched the feet of the idol from 6.22 a.m. to 6.27 am and may repeat on Sunday. Hundreds of devotees thronged the temple from early hours to have ‘darshan’ on the auspicious occasion.

అరసవల్లిలో మూలవిరాట్‌ను తాకిన సూర్యకిరణాలు

Posted: 10/01/2022 12:43 PM IST
Sun rays touch deity s feet for 5 minutes at arasavilli temple

ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధి సూర్య భగవానుడి పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయం. ఈ ఆలయంలోని మూలవిరాటుడైన శ్రీ సూర్యనారాయణ స్వామిని ఇవాళ ఉదయం సూర్యకిరణాలు పాక్షికంగా తాకాయి. స్వామివారి పాదాలను సాక్ష్యాత్తు ప్రత్యక్ష దైవంగా కొలిచే సూర్యభగవానుడే తాకడం భక్తులకు నయనానందకరం. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో అరసవల్లికి చేరుకున్నారు. మూలవిరాట్‌ పాదాలను సూర్య కిరణాలు తాకిన దృశ్యాన్ని వీక్షించి భక్తులు పులకించిపోయారు. ఏడాదిలో రెండు సార్లు ఇలాంటి అద్భుతం ఆవిష్కృతమవుతుంది.

శ్రీకాకుళం జిల్లా ఆరసవల్లిలోని సూర్య నారాయణుడి ఆలయంలో మూలవిరాట్‌ పాదాలను సూర్య కిరణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో వచ్చారు. తొలిరోజు సూర్య కిరణాలు స్వామివారి పాదాలను తాకగానే భక్తులు పులకించిపోయారు. ఏటా రెండుసార్లు సూర్య కిరణాలు స్వామి వారి పాదాలను తాకుతాయి. దక్షిణాయణం అక్టోబర్ 1, 2 తేదీల్లో, ఉత్తరాయణం మార్చి 9, 10 తేదీల్లో స్వామివారికి కిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తున్నది.

దాదాపు ఐదు నిమిషాల పాటు సూర్యకిరణాలు స్వామివారిని పాదాల చెంత నిలిచాయి. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో భక్తులు వేచి ఉండి స్వామివారిని సూర్యకిరణాలు తాకడం చూసి పులకించిపోయారు. ఆదిత్యుని విగ్రహాంపై పడిన లేలేత కిరణాలు దర్శనమివ్వడంతో జన్మధన్యమైందంటూ భక్తులు సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. సూర్య కిరణాలు తాకే సమయానికి సూర్యనారాయణమూర్తిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఎప్పటినుంచో ఈ అద్భుతాన్ని చూడాలనుకున్నామని.. ఇప్పుడు ఆ భాగ్యం తమకు దక్కడం సంతోషంగా ఉన్నదని చెప్తున్నారు పలువురు భక్తులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles