Emotional Video: Man meets his nanny after 45 years 45 ఏండ్ల త‌ర్వాత నాన‌మ్మ‌ చెంతకు మనవడు.. భావోద్వేగ భరితం..

Spanish man travels to bolivia to meet his nanny after 45 years leaves netizens in tears

viral video, man travels to Bolivia, man meets nanny, nanny union, Spain Man, Nanny, Ana, Emotional Video, GoodNews Correspondent, Viral video

A video has gone viral on social media for a very special reason. A man travelled all the way from Spain to Bolivia to unite with his former nanny after 45 years. He recorded his entire journey and shared it as a video montage on social media. Of course, it was a wholesome moment and chances are you might get emotional after watching this.

ITEMVIDEOS: 45 ఏండ్ల త‌ర్వాత నాన‌మ్మ‌ చెంతకు మనవడు.. భావోద్వేగ భరితం..

Posted: 09/29/2022 05:47 PM IST
Spanish man travels to bolivia to meet his nanny after 45 years leaves netizens in tears

అనుబంధం, ఆఫ్యాయత అంతా ఓక బూటకం.. ఆత్మతృప్తికై మనుషులు అడుకునే నాటకం అంటూ తెలుగు కవి ఎప్పుడో చెప్పారు. అయితే నిజానికి బంధాలు, అనుబంధాలు అనేవి మన దేశంలో చాలా అధికం. అందులోనూ దక్షిణాధిలో పెనువేసుకుపోయేవారు చాలా ఎక్కువ. మారుతున్న కాలంతో పాటు మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఉద్యోగాలు, కుటుంబాలతో ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా మారిన ఈ రోజుల్లో.. నాటి బంధాన్ని గుర్తు చేసుకుని నానమ్మ కోసం బయలుదేరిన ఓ బహుదూరపు బాటసారి ప్రయాణమే ఇది. ఔరా పాశ్చాత్య దేశాల్లోనూ ఈ బందాలు ఉన్నాయా.. ఎప్పుడో నిరాధరణకు కూడా గురుయ్యాయని అంటుంటారు.. మరి అందులో నిజమెంతా.?

అంటే ఎక్కడైనా రక్త సంబంధంతో ముడిపడిన బంధం అంత త్వరగా తెగదు. తన నానమ్మను అన్వేషిస్తూ వెళ్లిన ఓ మనవడి బంధం.. నెటిజనులను భావోద్వేగానికి గురిచేసింది. చిన్న‌ప్పుడు త‌న‌ను పెంచిన నాన‌మ్మ‌ను చూసేందుకు ఓ వ్య‌క్తి 45 ఏండ్ల త‌ర్వాత స్పెయిన్ నుంచి బొలీవియా వెళుతూ త‌న ప్ర‌యాణం, నాన‌మ్మ‌ను క‌లుసుకోవ‌డం అంత‌టినీ రికార్డు చేశాడు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను గుడ్‌న్యూస్ మూవ్‌మెంట్ త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేసింది.

తాను ప‌సికందుగా ఉన్న‌ప్పుడు త‌న‌ను పెంచిన నాన‌మ్మ అనా గురించి తెలుసుకున్న వ్య‌క్తి ఆమెను 45 ఏండ్ల త‌ర్వాత సుదీర్ఘ ప్ర‌యాణం అనంత‌రం క‌లుసుకున్న తీరును, ఇద్ద‌రు క‌లుసుకున్న‌ప్పుడు వారి భావోద్వేగాల‌ను ఈ వీడియో కండ్ల‌కు క‌ట్టింది. త‌న సొంత కొడుకులానే మ‌న‌వ‌డిని పెంచిన ఇన్‌క్రెడిబుల్ విమెన్ అని ఈ వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ వీడియోను వీక్షించిన ప‌లువురు యూజ‌ర్లు కామెంట్స్ బాక్స్‌లో త‌మ రియాక్ష‌న్స్‌ను వెల్ల‌డించారు. ట్విట్ట‌ర్‌లో ఇలాంటి మంచి విష‌యాలు చూడటం సంతోష‌క‌ర‌మ‌ని ఓ యూజ‌ర్ వ్యాఖ్యానించ‌గా, మా నాన‌మ్మ‌ను క‌నుగొనేందుకు మేం చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదని మ‌రో యూజ‌ర్ కామెంట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles