World Heart Day 2022: Simple habits to keep your heart healthy గుప్పడెంత గుండె ఆరోగ్యానికి పంచమిత్రులివే..

World heart day 2022 five enemies to keep away for your heart healthy

world heart day, world heart day tips, cardiac issues and heart health, diet and cardiac care, World Heart Day 2022, holistic wellness tips, heart health, heart chakra, Anahata, physical exercise, stress busters, balanced diet, adequate sleep, Sidhharrth S Kumaar, NumroVani, Astro numerology

World Heart Day is an incredible platform to spread awareness about how people can prevent cardiac issues and reduce the burden caused by this condition. Since the heart is crucial to a person’s survival, it is important to keep it healthy with a well-balanced diet, adequate sleep, and stress busters like meditation and yoga coupled with daily physical exercise. Avoid smoking and alcohol.

గుప్పడెంత గుండె ఆరోగ్యానికి పంచమిత్రులివే..

Posted: 09/29/2022 12:51 PM IST
World heart day 2022 five enemies to keep away for your heart healthy

గుప్పెడంత గుండె అరోగ్యంగా ఉండాలని ఇవాళ ప్రపంచ గుండె దినోత్సవాన్ని చేసుకుంటాం. ఈ సందర్భంగా గుండె అరోగ్యంగా ఉండాలంటే పంచసూత్రాలను ఆచరించాలని చెబుతున్నారు కార్డియాలిజిస్టులు. ఎందుకంటే ఈ గుప్పెడంత గుండే శరీరం మొత్తానికి ఆయువు పట్టు. అలాంటి గుండెను ఎలా అరోగ్యంగా మలచుకోవాలన్న విషయాన్ని ఇవాళ మనం చూద్దాం. బాలహృద్రోగస్థులతో సంబంధం లేకుండా.. కేవలం పెద్దవారిలో మాత్రమే క‌నిపించే గుండె జ‌బ్బులు.. ప్రస్తుతం యుక్తవ‌య‌సు వారిలోనూ ద‌ర్శన‌మిస్తున్నాయి. అందుకు చెడు వ్యసనాలు కూడా కారణం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గుండెను ఎలా ఆరోగ్యంగా కాపాడుకోవాలో.. ఆ పంచసూత్రాలు ఏమిటో తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యంగా ఉంటేనే మిగతా అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉన్నట్లు. మన దేహంలోని అన్ని అవయవాలకు మూలం మాత్రం గుండె. అన్ని అవయవాలు సరిగా పనిచేస్తేనే.. గుండె ఆరోగ్యం ఉంటుంది. శరీరంలోని అవయవాలకు విరామ లేకుండా రక్తాన్ని పంపింగ్ చేయటమే గుండె పని. ఏండ్ల తరబడి నిరంతరాయంగా పనిచేయటం, జీవనశైలిలో మార్పులు, దురలవాట్ల కారణంగా వయసుతో బాటు గుండె పనితీరు తగ్గిపోతున్నది. ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించకపోతే గుండెపోటుకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

1) గుండె ఆరోగ్యానికి మూలాధారం జీవనశైలి

సూర్యోదయానికి ముందు లేచి.. సూర్యాస్తమయం అయిన తరువాత ఏదో కాస్తా తినేసి పడుకునే గ్రామీణ ప్రాంత రైతులు గుండెలను అరోగ్యంగా ఉంచుతారు. అయితే నగరాలు, పట్టణాల్లో కాలాతీతంలో బోజనాలు, రాత్రిళ్లు చిరుతిళ్లు.. ఉదరాగ్నిని చల్లబరుస్తున్నామని అనుకుంటున్నారే తప్ప.. అందుకు అనుగూణమైన ప్రమాణాలను మాత్రం పాటించడం లేదు. అధికంగా జంక్ ఫుడ్, ఫ్రై పుడ్, మాంసాహారపు అలవాట్ల కారణంగా గుండె సమస్యలు వస్తున్నాయి. మనలో చాలా మంది చిన్న వయసు నుంచి యధేచ్చగా చిరుతిండ్లకు, ఫాస్ట్‌ ఫుడ్స్‌కు అలవాటుపడిపోయింది.

దీంతో యుక్తవయసు వచ్చాక ముఖ్యంగా గుండె సంబంధ వ్యాధులను వారు ఎదుర్కోంటున్నారు. రోడ్డుపై దొరికే ఆహారాలను ఇష్టపడుతూ, వాటికి రుచిమరుగుతున్నారు. అయితే రుచి కోసం వాటి విక్రేతలు ఎన్నో కృతిమ మసాలాలు, రసాయనాలను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా డబ్బులిచ్చి గుండె సంబంధ సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. కమ్మనైన అమ్మ చేతి వంటను కడుపారా అరగిస్తే.. గుండెకు కాసింతైనా మేలు జరిగేను. ఇక దీనికి తోడు సూర్యోదయానికి ముందుగానే లేచి.. రాత్రి త్వరగానే నిద్రకు ఉపక్రమిస్తే మీ గుండె ఫథిలంగానే ఉన్నట్లు.

2) అరగంట నడకతో గుండెకు జోష్..

నడక ఎంత మంచిదంటే.. మానవ దేహంలోని అత్యంత సున్నితమైన కండరం అదేనండీ గుండెలో నూతన జోష్ అందిస్తుంది. కనీసం రోజుకో గంట లేదా అరగంట పాటు నడిచినా మీ గుండెకు నూతన జోస్ అందినట్లే. అయితే ఎప్పుడు నడవాలి.. ఉదయమా.? సాయంత్రమా.? అన్న సందేహాలు పక్కనబెట్టి.. ఏ సమయంలో మీకు వీలైతే.. ఆ సమయంలో ఖాళీ కడుపుతో ఎలాంటి ఘన, ధ్రవ ఆహారాలు తీసుకోకుండా నడవాలి. ఇది మీ గుండెకు చక్కని జోష్ అందిస్తుంది. ఎలాంటి వ్యాయామం చేయకుండా తిన్నమా.. పడుకున్నామా.. తెల్లారిందా అంటే మాత్రం గుండెకు ముప్పే. ఇక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, మెడిటేషన్ చేస్తే మరీ మంచిది.

3) కంటి నిండా నిద్ర.. గుండెకు చేయూత

మారుతున్న కాలంతో పాటు మన జీవన శైలి కూడా మారుతోంది. నైట్ జాబులు రావడం.. రాత్రితెల్లవార్లూ మెలకువగా ఉండటం.. ఏ నిద్ర దరిచేరకుండా ఏదో ఒకటి ఆరగించడం.. అది చాలదన్నట్లు టీ, కాఫీ, సిగరెట్లు.. వీటితో అప్పటి మాటుకు నిద్ర రాకపోవడం కాదు.. ఇది అలవాటుగా మారి.. రానురాను గుండెపై ఒత్తిడి పెరిగి తీవ్రపరిణామాలకు దారితీస్తోంది. ఇలా నగరాల్లోని యువతను చూసి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల యువత కూడా అటుగా మొగ్గుతూ తమ గుండె అరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు. దీంతో కంటికి అవసరమైన కనీస నిద్రను అందించలేక పోతున్నారు.

మనిషి నిద్రించిన సమయంలోనే గుండె తన పని తాను సజావుగా చేసుకుంటూనే మరుసటి రోజుకు మరింత ఉత్తేజంతో పనిచేసేలా సంసిద్దం అవుతుంది. అయితే నేటి యువత రాత్రిళ్లు పోద్దుపోయేవరకు రోడ్లపై తిరుగుతూ.. కంటికి కనీసమైన నిద్రను అందించలేకపోవడంతో గుండెకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నారు. వీటికి తోడు మొబైల్‌ ఫోన్స్ లో గేమ్స్‌, కంప్యూటర్లతో కుస్తీ పడుతూ ఏ రాత్రికో నిద్ర పోవడం.. నిర్ణీత సమయం నిద్ర లేకపోవడం వల్ల నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా పేలవమైన నిద్రతో సరిపోను విశ్రాంతి అందక యువత అలసటతోనే ఉంటున్నారు. గుండె అరోగ్యంతో ఆడలాడుతున్నారు.

4) పోషకాహారం.. గుండెకు మెండైన ఆరోగ్యం

సమృద్దికరమైన పోషకాలతో నిండిన ఆహారం గుండె ఆరోగ్యానికి నాలుగో సూత్రం. ఓవ్.. వాట్ ఏ టేస్టీ అంటూ లొట్టలేసుకుని తిన్న ప్రతీది పోషకాహారంతో నిండినది కాకపోవచ్చు. నోటికి చేధుగా అనిపించినా.. పోషకాలతో నిండి గుండె అరోగ్యానికి శ్రీరామ రక్షలా నిలిచే అహారాలు తీసుకోవడం ఉత్తమం. ప్రచార మాద్యమాల్లో ప్రకటనలకు లోంగిపోయి.. లేదా.. ల్లేని ఆహారాలు తీసుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు కానీ, అవి ఎంత ఆరోగ్యపరంగా సమస్యల్ని తీసుకొస్తున్నాయో పట్టించుకోవడం లేదు. ఉప్పు, చక్కెర, నూనెలు ఎక్కువగా ఉండే ఆహారాలు, ప్రాసెస్‌ చేసిన, ప్యాకేజ్డ్‌ ఆహారాలను అమితంగా ఇష్టపడుతున్నారు.

ఫలితంగా మధుమేహం, కొలెస్ట్రాల్‌ పెరిగిపోవడం, ఊబకాయం, స్లీప్‌ ఆప్నియా సిండ్రోమ్‌, అథెరోస్క్లెరోసిస్‌ వంటి జీవక్రియ సిండ్రోమ్‌లకు దగ్గరవుతున్నారు. పండ్లు, కూరగాయలు గుండె ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. పొటాషియం ఎక్కువగా లభించే పండ్లతో పాటు ఆలుగడ్డ, పాలకూర, టమాట, అరటి, బొప్పాయి, నారింజ, డ్రై ఫ్రూట్లను తింటూ ఉండాలి. కాల్షియం ఎక్కువగా దొరికే తక్కువ కొవ్వు ఉన్న పాలు, పెరుగు, పచ్చని ఆకుకూరలు, బాదం పప్పులు తినాలి. చేపలు, ఆవనూనె, వాల్‌నట్స్, గోధుమ, రాజ్మా, ఆవాలు, సోయాబీన్ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. కివీ పండు గుండెకు ప్రయోజనకారి.

5) చెడు వ్యసనాలకు దూరంగా ఉంటం

చెడు వ్యసనాలు.. ముఖ్యంగా యుక్తవయస్సులో అంటే ఇంటర్ దాటిన తరువాత కొత్తగా రెక్కలు వచ్చిన పక్షుల మాదిరిగా తయారవుతున్న యువత.. అదే సమయంలో చెడు అలవాట్లకు ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుత యువతలో సిగరెట్‌ స్మోకింగ్‌, మద్యపాన స్వీకరించడం అనేది చాలా క్యాజువల్‌ విషయాలుగా తయారయ్యాయి. ఏ యువకుడి చేతిలో చూసినా సిగరెట్‌ ఉండటం ఫ్యాషన్‌గా తయారైపోయింది. సిగరేట్‌ తాగితేనే గొప్పవాళ్లమనే భావనలో యువత మునిగితేలుతున్నది. రాత్రి కాగానే మద్యం బాటిళ్లను ముద్దాడుతున్నారు. ఫలితంగా గుండెకు లేనిపోని ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నారు. ఈ రెండూ గుండెకు బద్ధ శత్రువులన్నది యువత మరిచిపోవద్దు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles