Actor-MP Ravi Kishan duped of Rs 3 crore స్నేహితుడిపై కేసు వేసిన నటుడు, ఎంపీ రవికిషన్..

Bjp mp ravi kishan cheated of rs 3 25 crore by mumbai businessman

Ravi Kishan, Jain Jitendra Ramesh, Gorakhpur SBI Branch, Cheque bounce, BJP MP Ravi Kishan duped, mumbai businessman, mumbai builder, mumbai Crime

Actor-cum-politician Ravi Kishan has allegedly been duped of Rs 3.25 crore, police said. Kishan, who is the MP from Gorakhpur Sadar and a film actor, has filed a complaint at Gorakhpur Cantonment police station against a builder for duping him of Rs 3.25 crore. The police have said that a complaint has been registered and appropriate action will be taken after the investigation. The case has been filed under Section 406 of the Indian Penal Code.

స్నేహితుడిపై కేసు వేసిన నటుడు, ఎంపీ రవికిషన్.. రూ. 3.25 కోట్ల మోసం..

Posted: 09/28/2022 08:51 PM IST
Bjp mp ravi kishan cheated of rs 3 25 crore by mumbai businessman

అల్లు అర్జున్ నటించిన రేసు గుర్రం సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న న‌టుడు ర‌వికిష‌న్. సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించి మెప్పించిన ఈ నటుడు అదే చరిష్మాతో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ సీఎం కాకముందు ప్రతినిథ్యం వహించిన గోరఖ్ పూర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి 2019 నుంచి బరిలో దిగి గెలిచిన ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. ఎంపీగా కొనసాగుతున్న ర‌వికిష‌న్ తాజాగా త‌న స్నేహితుడి, వ్యాపారవేత్తపై పోలీసులకు ఫిర్యాదు చేయ‌డం ఇపుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

2012లో తాను ఇచ్చిన డబ్బును తన స్నేహితుడు, ముంబైకి చెందిన వ్యాపార‌వేత్త జైన్ జితేంద్ర ర‌మేశ్ తిరిగి చెల్లించడం లేదని పిర్యాదు చేశారు. రవికిషన్ తన స్నేహితుడైన జితేంద్ర రమేశ్ కు రూ.3.25 కోట్లు రుణంగా ఇచ్చారు. జైన్ జితేంద్ర ర‌మేశ్ ఆ న‌గ‌దును తిరిగివ్వ‌డంలో భాగంగా ర‌వికిష‌న్‌కు రూ.34 ల‌క్ష‌ల చొప్పున 12 చెక్కుల‌ను అంద‌జేశాడు. అయితే ర‌వికిష‌న్ వాటిలో ఒక చెక్కును గ‌తేడాది డిసెంబ‌ర్ 7న గోర‌ఖ్‌పూర్ ఎస్‌బీఐ బ్రాంచ్ లో డిపాజిట్ చేశారు. కానీ ఆ చెక్కు బౌన్స్ అయింది. ఆ త‌ర్వాత ర‌వికిష‌న్ స్నేహితుడు జైన్ జితేంద్ర ర‌మేశ్‌కు త‌రచూ ఫోన్ చేసినా స‌రైన స‌మాధానం ఇవ్వ‌లేదు.

జైన్ జితేంద్ర నుంచి స్పంద‌న స‌రిగా లేక‌పోవ‌డంతో గోర‌ఖ్‌పూర్ పరిధిలోని పోలీస్ స్టేష‌న్‌లో అత‌నిపై ఫిర్యాదు చేసిన‌ట్టు ర‌వికిష‌న్ పీఆర్‌వో ప‌వ‌న్ ధూబే తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నట్టు కంటోన్మెంట్ పీఎస్ ఇన్‌చార్జ్ శ‌శి భూష‌ణ్ రాయ్ తెలిపారు. ర‌వికిష‌న్ తెలుగులో సైరా న‌ర‌సింహారెడ్డి, ఎంఎల్ఏ, సాక్ష్యం, ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, లై, రాధ‌, సుప్రీమ్‌, కిక్ 2, హీరో చిత్రాల్లో న‌టించారు. భోజ్‌పురి, హిందీ, క‌న్న‌డ, తెలుగు భాష‌ల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ర‌వికిష‌న్. 2019 నుంచి యూపీలోని గోర‌ఖ్‌పూర్ లోక్‌స‌భ స్థానానికి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles