Megastar Chiranjeevi as AP PCC delegate చిరంజీవికి పీసీసీ డెలిగేట్ ఐడీ కార్డ్ జారీ చేసిన కాంగ్రెస్

Congress president elections megastar chiranjeevi is apcc delegate

Chiranjeevi, aicc, rahul gandhi, bharat jodo yatra, Congress, former union minister, PCC Delegate, Madhusudhan Mistry, National Politics

Ahead of the poll process for the new Congress president’s election, the AICC issued a new Identity card to Megastar Chiranjeevi as a delegate for the event. The ID card showed that Chiranjeevi would be representing Kovvuru as a PCC delegate. This clearly shows that he continues to retain his primary membership with the Congress Party. The ID card would give allow a member to cast his vote for the Congress Presidential Elections. It is reported that more than 9,000 people would be casting their votes.

చిరంజీవికి పీసీసీ డెలిగేట్ ఐడీ కార్డ్ జారీ చేసిన కాంగ్రెస్

Posted: 09/21/2022 07:56 PM IST
Congress president elections megastar chiranjeevi is apcc delegate

కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాజకీయాల గురించి టాపిక్‌ వచ్చినా... ఆయన స్పందించడం లేదు. అయితే అలాంటిది ఆయన ట్విట్టర్‌లో మంగళవారం ఒక పొలిటికల్‌ పంచ్‌ వేశారు. ‘‘నేను రాజకీయాలకు దూరం అయ్యాను కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు’’ అనే డైలాగ్‌ని అభిమానులతో పంచుకున్నారు. ‘రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అని అన్నారో లేదో ఇంతలోనే ఏపీసీసీ డెలిగేట్‌ గా మెగాస్టార్‌ చిరంజీవిని కాంగ్రెస్ అధిష్టానం ఎన్నుకుంది. ఆయన ఈ పదవిలో 2027 వరకు ఉంటారు. ఇందుకు సంబంధించి చిరంజీవిని ఏపీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ ఐడీకార్డు ఇచ్చారు.

కొవ్వూరు నుంచి ఏపీసీసీ డెలిగేట్‌గా చిరంజీవి ఉన్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చిరంజీవి పదేపదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఏపీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ ఐడీకార్డు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత చిరంజీవిని కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభకు పంపింది. ఆ తర్వాత ఆయనను కేంద్రమంత్రిని చేశారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చిరంజీవి కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎక్కడ కూడా ఆయన రాజకీయ ప్రస్తావన తేవడం లేదు.

రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్‌ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల సినిమా టికెట్ల విషయంలో పలు మార్లు జగన్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత వైసీపీ నుంచి చిరంజీవిని రాజ్యసభకు పంపుతారనే పుకార్లు చక్కర్లు కొట్టాయి. చిరంజీవి ఆంతర్యం ఏమిటో తెలియాలంటే వేచిచూడాల్సిందే. క్రితం రోజున ట్విట్టర్‌లో చిరంజీవి ఓ పోస్టు పెట్టారు. ఇప్పుడు ఆ పోస్టు సోషల్ మీడియాతో వైరల్ అవుతోంది. చిరంజీవి నుంచి పొలిటికల్‌ డైలాగులు వచ్చి చాలా కాలమైంది. ఎందుకంటే కొన్నాళ్లుగా ఆయన రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నారు.

రాజకీయాల గురించి టాపిక్‌ వచ్చినా... ఆయన స్పందించడం లేదు. అలాంటిది ఇప్పుడు ఆయన పొలిటికల్‌ పంచ్‌ వేశారు. ‘‘నేను రాజకీయాలకు దూరం అయ్యాను కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు’’ అనే డైలాగ్‌ని ఆయన ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకొన్నారు. ఇప్పుడు  ఈ వాయిస్‌ ట్వీట్‌ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయిపోయింది. చిరు వ్యాఖ్యలు ఎందుకోసం..? ఆయన రాజకీయంగా మళ్లీ బిజీ అవ్వబోతున్నారా? అయితే ఏ పార్టీ నుంచి? అనే ఊహాగానాలు వ్యాపించాయి. చివరికి ఈ ట్వీట్‌ ‘గాడ్‌ ఫాదర్‌’ ప్రమోషన్లలో భాగంగానే అని తేలింది. చిరంజీవి నటించిన చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. అక్టోబరు 5న విడుదల కానుంది. ఈ సినిమాలోని డైలాగునే.. చిరు ట్విట్టర్‌లో వదిలినట్టు తెలుస్తోంది. త్వరలోనే ‘గాడ్‌ ఫాదర్‌’ ట్రైలర్‌ రాబోతోంది. అందులో ఈ డైలాగ్‌ వినిపించే అవకాశాలున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles