Elephant blocks former CM Trivendra Rawat's way మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్ అడ్డగింత.. కొండరాయిపైకి పరుగులు..

Former cm trivendra singh rawat was forced to stop his convoy

Former Uttarakhand CM, Trivendra Rawat, convoy, elephant, Pauri, Kotdwar, Dugadda road, forest, traffic jam, highway, Dugadda forest Range Officer, Pradeep Dobriyal, Shivalik Elephant Corridor area, Uttarakhand, crime

Former Uttarakhand chief minister Trivendra Singh Rawat was forced to stop his convoy when an elephant suddenly appeared in front of his car. Rawat had to climb rocks to save his life. Rawat was coming from Pauri to Kotdwar through Kotdwar-Dugadda road between 5 and 6 p.m, when the elephant suddenly came out of the forest and blocked his convoy.

ITEMVIDEOS: మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్ అడ్డగింత.. కొండరాయిపైకి పరుగులు..

Posted: 09/16/2022 11:48 AM IST
Former cm trivendra singh rawat was forced to stop his convoy

మనుషులు తమ నివాసం కోసం వన్యప్రాణుల అవాసమైన అడవులను తెగ నరుకుతుంటే.. వనాలను వదిలి.. జనవాసాల మధ్యకు అవి వస్తున్నాయి. ఈ క్రమంలో గ్రామాల్లోని పంటలను నాశనం చేస్తున్నాయి. ఇక తిరిగి ఎటు వెళ్లాల్లో తెలియక గ్రామీణ ప్రాంతాలకు చేరువలోనే ఉంటున్నాయి. ఇలా ఉంటున్న వన్యప్రాణలు ఆ మార్గాల మీదుగా వెళ్లే ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. ఇలానే తమ కాన్వాయ్ కు అడ్డువచ్చిన ఏనుగు బారి నుంచి తనను తాను రక్షించుకునేందుకు ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా కొండ రాయిపైకి పరుగులు తీయాల్సి వచ్చింది.

ఆయన కాన్వాయ్‌ను ఏనుగు అడ్డుకోవడంతో చాలా సేపు అక్కడే ఉన్నారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, బుధవారం సాయంత్రం 5-6 గంటల మధ్య కోట్‌ద్వార్‌-దుగడ్డ హైవే మీదుగా పౌరీ నుంచి కోట్‌ద్వార్‌కు కాన్వాయ్‌లో వెళ్తున్నారు. అయితే ఆ అటవీ ప్రాంతం నుంచి ఒక ఏనుగు ఒక్కసారిగా హైవే పైకి వచ్చింది. త్రివేంద్ర సింగ్ రావత్ వాహనాల కాన్వాయ్‌ను అది అడ్డుకుంది. ఆ ఏనుగు తమ వద్దకు రావడాన్ని గమనించిన రావత్‌, ఆయన భద్రతా సిబ్బంది వాహనాల నుంచి కిందకు దిగారు. ఏనుగు బారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు అక్కడున్న ఒక కొండరాయిపైకి ఎక్కారు.

మరోవైపు ఆ ఏనుగు చాలా సేపు అక్కడే ఉండటంతో మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ కాన్వాయ్‌ అర గంట పాటు అక్కడే నిలిచిపోయింది. దీంతో ఆ హైవేపై ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. కాగా, ఈ విషయం తెలిసిన అటవీశాఖ సిబ్బంది వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గాల్లోకి కాల్పులు జరిపి రోడ్డుపై ఉన్న ఏనుగును అడవిలోకి వెళ్లగొట్టారు. దీంతో త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ఊపిరి పీల్చుకున్నారు. తన కాన్వాయ్‌లో అక్కడి నుంచి ముందుకుసాగారు. కాగా, ఏనుగు బారి నుంచి ప్రాణాలు రక్షించుకునేందుకు ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌, ఆయన భద్రతా సిబ్బంది కొండ రాయిపైకి ఎక్కిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles