angry boy snatches cone from turkish ice cream vendor prank బుడ్డోడు కాదు.. బలభీముడు.. ఐస్‌క్రీంతో ప్రాంకా.. వ్యాపారికి చుక్కలే..

Viral video angry boy bring twist in prank at turkish ice cream stall by snatching cone

Turkish ice-cream stall prank, Turkish ice-cream stall prank goes wrong, little boy twist to ice cream prank, Turkish ice-cream stall on Twitter, IPS officer shared prank video, Dipanshu Kabra shared prank video, Turkish ice cream parlour prank goes wrong, prank ice-cream, turns and tricks, Twitter, IPS officer, Dipanshu Kabra, Turkish ice cream parlour, prank, sweet treat, Turkey

However, one particular video featuring a boy left netizens laughing out loud after he gave the Turkish ice-cream seller a taste of his own prank. Shared on Twitter by IPS officer Dipanshu Kabra, the video shows a boy standing in front of the stall of a Turkish ice-cream seller. As the clip goes on, the ice-cream seller tries to pull a prank on the boy. But, the little boy grasps the seller’s stick tightly and snatches the ice-cream and exits the frame slowly eating his treat.

ITEMVIDEOS: బుడ్డోడు కాదు.. బలభీముడు.. ఐస్‌క్రీంతో ప్రాంకా.. వ్యాపారికి చుక్కలే..

Posted: 09/16/2022 12:42 PM IST
Viral video angry boy bring twist in prank at turkish ice cream stall by snatching cone

టర్కీలో ఐస్‌క్రీం వ్యాపారస్థులు కస్టమర్లను భలే ఆటపట్టిస్తుంటారు. ఐస్ క్రీమ్ కావాలని షాపుకు వెళ్తే.. వెంటనే ఒకటి తీసి వినియోగదారుల చేతిలో పెడితే మళ్లీ వారిని ఆకట్టుకునేది ఏలా అనుకుంటారో ఏమో తెలియదు కానీ.. ఏకంగా కస్టమర్ల కోరిన ఐస్ క్రీమ్ ను తీసి.. వారికి అందించేప్పుడు మాత్రం కొంతసేపు ఆటపట్టించి.. ఆ తరువాత నిదానంగా ఇస్తారు. కోన్ ఐస్ క్రీంను చేతిలో పెట్టినట్టే పెట్టి టక్కున వెనక్కి లాగేసుకుంటారు. నోరూరించే ఐస్‌క్రీం తిందామని వెళ్లిన వారికి ఫ్రస్టేషన్ వచ్చే వరకు ప్రాంక్ చేస్తూనే ఉంటారు. చివరకు కస్టమర్లకు నీరసం వచ్చే టైంలో ఐస్‌క్రీం చేతిలో పెడతారు.

ఈలోగా దానిని ఆర్డర్ చేసిన వినియోగదారుడికి ఇక ఐస్ క్రీమ్ తినాలన్న ఆశ కూడా చచ్చిపోతుంది. ఇందుకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చూశాం. కానీ వారు చేసే ప్రాంకులను వారికే ఎదురైతే.. దానినే చేసి చూపించాడు ఓ బుడ్డోడు. షాపు ముందుకెళ్లిన ఓ చిన్నారిని కూడా ఇలానే ప్రాంక్ చేద్దామనుకున్న ఓ టర్కీ ఐస్‌క్రీం వ్యాపారస్థుడికి షాక్ తగిలింది. ప్రాంక్ చేద్దామనుకుంటే చుక్కలు చూపించాడు. ఐస్‌క్రీం కోను చేతిలో పెట్టి వెనక్కి లాగేసుకుందాం అనే లోపే.. ఈ బుడ్డోడు ఐస్‌క్రీం ఇచ్చే కర్రను చేతితో బిగ్గరగా పట్టుకున్నాడు.

అంతేకాదు ఐస్‌క్రీం వెండర్ చేతిపై కొట్టాడు. బాల భీముడిలా ఉన్న పిల్లాడి బలం ముందు ఆ వెండర్ నిలబడలేకపోయాడు. ఐస్‌క్రీం స్టిక్ వెనక్కి తీసుకునేందుకు వంగి వంగి ప్రయత్నించినా సఫలం కాలేకపోయాడు. చివరకు బుడ్డోడు హీరోలా తన ఐస్‌క్రీం తీసుకొని హాయిగా తినుకుంటూ వెళ్లాడు. అక్కడున్న వారంతా బుడ్డోడి చర్యను చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. ఓ వ్యక్తి ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్ల నుంచి విశేష స్పందన లభించింది. బుడ్డోడిని అనేక మంది మెచ్చుకుంటున్నారు. ప్రాంక్ చేద్దామనుకుంటే షాక్ ఇచ్చాడు.. చిన్నోడు మామూలోడు కాదు అని కొనియాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles