హైదరాబాద్ నగరంలో ఇప్పుడు కూకట్ పల్లికి ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. నగరంలోని ఏ ప్రాంతంలోనూ లేనట్టుగా భూదేవి.. ధనలక్ష్మి అవతారం ఎత్తన ప్రాంతం. అలాంటి కూకట్ పల్లికి తలమానికమైన మూసాపేట వై జంక్షన్ వద్దనున్న అత్యంత విలువైన 540.30 ఎకరాల స్థలం విషయమై గత కొన్నేళ్లుగా సాగుతున్న కోర్టు కేసులు కొలిక్కవచ్చాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ భూమిపై పూర్తి హక్కులు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఉదాసిన్ మఠానివేనని తేల్చిచెబుతూ కీలక తీర్పును వెలువరించింది. ఈ భూముల విషయంలో ఉదాసిన్ మఠం, గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ - ఐడీఎల్ కెమికల్స్ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న ఉదాసిన్ మఠం భూములను 1964, 1966, 1969, 1978లో నాలుగు దఫాలుగా గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్‌కు 99 ఏళ్ల కాల వ్యవధికి లీజుకిచ్చింది. అయితే ఈ భూములన్నీ స్థానిక చెరువు ఆనకట్టకు అనుకుని ఉండటంతో బఫర్ జోన్ పరిధిలోకి చేరాయి. దీంతో బఫర్ జోన్ పరిధిలోని భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని చట్టంలో స్పష్టంగా ఉంది. అయినా వాటిని లెక్కచేయకుండా ఈ భూముల్లో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ 538 ఎకరాల విస్తీర్ణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించడాన్ని సవాల్ చేస్తూ ఉదాసిన్ మఠం దేవాదాయ శాఖ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది.
పిటిషన్ విచారించిన ట్రైబ్యునల్.. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్‌కు ఇచ్చిన లీజును 2011లో రద్దు చేసింది. ట్రైబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. 2013లో డిస్మిస్ చేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. యాధాతథస్థితి కొనసాగించాలని 2013లో సుప్రీంకోర్టు ఆదేశించింది. పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం.. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
బహిరంగ మార్కెట్‌లో ఈ భూముల విలువ సుమారు రూ.15,000 కోట్లు ఉంటుందని అంచనా. సుప్రీంకోర్టు తీర్పు పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విలువైన భూములను కాపాడేందుకు సుదీర్ఘ పోరాటం చేసిన దేవాదాయశాఖ అధికారులు, శాఖ తరఫున వాదించిన న్యాయవాదులను ఆయన అభినందించారు. దేవుడి మాన్యం భూములపై పూర్తి హక్కు దేవాదాయ సంస్థలకు మాత్రమే చెందుతుందని సుప్రీంకోర్టు మరోమారు స్పష్టం చేసినట్లైందని.. ఇదే స్ఫూర్తితో ఆక్రమణలో ఉన్న దేవాదాయ శాఖ భూములను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు కృషి చేయాలని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more