Man Points Gun At Argentina Vice President, Arrested అర్జెంటీనా ఉపాధ్య‌క్షురాలి హ‌త్య‌ాయ‌త్నం.. ఫైర్ చేసినా పేలని తూటా..

Cristina fernandez de kirchner gun jams during bid to kill argentina vice president

Argentine Vice President, Cristina Kirchner, Buenos Aires, Alberto Fernandez, Argentina President Alberto Fernandez, Latin America, serious event, Security Minister Anibal Fernandez, 35 yr-Brazilian, Venezuelan President, Nicolas Maduro, Chile's President Gabriel Boric, assassination attempt, Argentina, crime

A man attempted to shoot Argentine Vice President Cristina Kirchner near her home in Buenos Aires on Thursday, a shocking incident that prompted a wave of sympathy from Latin American leaders. "Cristina remains alive because, for a reason that has not yet been technically confirmed, the gun which contained five bullets did not fire despite the trigger having been pulled,"

అర్జెంటీనా ఉపాధ్య‌క్షురాలి హ‌త్య‌ాయ‌త్నం.. ఫైర్ చేసినా పేలని తూటా..

Posted: 09/02/2022 08:19 PM IST
Cristina fernandez de kirchner gun jams during bid to kill argentina vice president

అర్జెంటీనా ఉపాధ్య‌క్షురాలు క్రిస్టినా ఫెర్నాండేజ్ డీ కిర్చిన‌ర్‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. అయితే అదృష్ట‌వ‌శాత్తు ఆమె ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. బ్యూనోస్ ఏరిస్‌లోని ఆమె నివాసం వ‌ద్ద ఓ ఆగంత‌కుడు త‌న వ‌ద్ద ఉన్న పిస్తోల్‌తో ఆమెను కాల్చే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే ట్రిగ్గ‌ర్ నొక్కినా.. ఆ గ‌న్ పేల‌లేదు. దీంతో అక్క‌డ ఉన్న సిబ్బంది ఆమెను వెంట‌నే ర‌క్షించారు. ఈ ఘ‌ట‌నతో అర్జెంటీనా రాజ‌కీయాల్లో మ‌ళ్లీ వేడి పుట్టింది. ట్రిగ్గ‌ర్ నొక్కినా.. గ‌న్ పేల‌లేద‌ని, క్రిస్టినా ప్రాణాల‌తోనే ఉన్న‌ట్లు ఆ దేశాధ్య‌క్షుడు అల్బ‌ర్టో ఫెర్నాండేజ్ తెలిపారు.

జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించిన ఆయ‌న‌.. గ‌న్‌లో అయిదు బుల్లెట్లు లోడై ఉన్న‌ట్లు చెప్పారు. క్రిస్టినా అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ప్ర‌స్తుతం ఆమెపై విచార‌ణ సాగుతోంది. అటాక్ జ‌రిగిన స‌మ‌యంలో ఆమె ఇంటి వ‌ద్ద వేలాది మంది మ‌ద్ద‌తుదారులు కూడా ఉన్నారు. ఆగంత‌కుడు కేవ‌లం కొన్ని ఇంచుల దూరం నుంచే పిస్తోల్‌ను పేల్చిన‌ట్లు వీడియో ఫూటేజ్ ద్వారా తెలుస్తోంది. కాల్పుల‌కు దిగిన వ్య‌క్తిని 35 ఏళ్ల బ్రెజిల్ వ్య‌క్తిగా గుర్తించారు. అత‌న్ని వెంట‌నే అరెస్టు చేశారు. గ‌న్‌ను సీజ్ చేశారు. వ‌చ్చే జ‌న‌ర‌ల్ ఎన్నిక‌ల్లో క్రిస్టినా దేశాధ్య‌క్షురాలిగా పోటీ ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి.

కాగా లాటిన్ అమెరికాలో బలమైన నేతగా ఎదుగుతున్న క్రిస్టినాకు ఆ ఖండంలోని ఇతర దేశాల నుంచి అమెకు మద్దతు లభించింది. అమెపై జరిగిన హత్యాయత్నాన్ని ఆయా దేశాల నేతలు ముక్తకంఠంతో ఖండించారు. వెనుజులా అధ్యక్షుడు నికోలాస్ మాడ్యురో ఇలాంటి ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని, ఎంతమాత్రం అధైర్యపడ కూడాదని ఆయన క్రిస్టినాకు మద్దుతుగా ట్వీట్ చేశారు. ఇక చీలి అద్యక్షుడు గాబ్రియల్ బోరిక్ కూడా క్రిస్టినాకు మద్దతుగా ట్వీట్ చేసి.. ఇలాంటి ఘటనలతో మరింత శక్తిని కూడగట్టుకుని పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles