ఆకాశంలో జనాభాలో సగంగా ఉన్న మహిళలకు చట్టసభల్లోనూ సగభాగాన్ని ఇవ్వాలని, అంతేకాదు దేశంలోని ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లోనూ సగం వారకే కేటాయించాలని ఇప్పటికే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మహిళలకు చట్టసభలతో పాటు ఉద్యోగాల్లోనూ 33శాతం మేర రిజర్వేషన్ కోటాను అమలుపర్చాలన్న ప్రతిపాదనలతో రూపోందిన మహిళా బిల్లుకు మాత్రం దశాద్దాలుగా మోక్షం లభించడం లేదు. మగవాడి ఒంటి చేతికి జతకలిసే మరో చేయి మహిళదే అని తెలిసినా.. దానిని అంతే తీవ్రంగా ఖండిస్తుంది పురుష సమాజం. దీంతో ఎన్నో ఏళ్లుగా మహిళా బిల్లుకు మోక్షం కూడా లభించడం లేదు.
ఇదిలాఉండగా.. తాజాగా పంజాబ్‌లో జరిగిన ఓ ఘటనతో నిజంగా మహిళలకు చట్టసభల్లో వారి కోరుకున్న రిజర్వేషన్ లభించినా.. అధికారం వారిదే అవుతుందా.? అంటే.. తెలియదనే సమాధానాలే వినబడుతున్నాయి. ఇప్పటికే దేశంలోని అనేక గ్రామాలు, మండల చైర్ పర్సెన్, మున్సిపాలిటీ చైర్మన్, కౌన్సిలర్, కార్పోరేటర్ స్థాయి పదవుల్లో సతులు ఎన్నికైనా.. ఆర్భాటమంతా పతులదే. అధికారాన్ని వారు అందకుని వారి ఇష్టానుసారమే అక్కడి విధులు నిర్వహించేలా చేస్తున్నారన్న విషయం జగమెరిగిన సత్యం. ఇలాంటి నేపథ్యంలో నిజంగా మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించినా.. ఎంతవరకు సత్పలితాలు సాధిస్తారోనన్న విషయమై సందేహాలు నెలకన్నాయి.
ఇక చట్టసభకు ఎన్నికైన ఓ ఎమ్మెల్యేపై అమె భర్త చేసిన దాడి గురించి తెలిస్తే ఇలాంటి అనుమానాలు ఉత్పన్నం కాక మానవు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మహిళ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్‌ను ఆమె భర్త లాగి చెంపపై కోట్టాడు. అమె కుటుంబసభ్యులు అడ్డుకోకపోయి ఉంటే.. పరిస్థితి ఎలా ఉండేదో. జూలై 10వ తేదీకి చెందిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆప్ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్ కానీ, ఆమె భర్త కానీ ఎటువంటి పోలీసు ఫిర్యాదు చేయలేదు. ఎమ్మెల్యే, ఆమె భర్త మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే అక్కడ మరికొంత మంది ఉన్నారు. ఓ దశలో ఆవేశానికి లోనైన భర్త.. ఎమ్మెల్యే బల్జిందర్ చెంప చెల్లుమనిపించాడు. దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పంజాబ్ మహిళ కమిషన్ చైర్మెన్ మనీషా గులాటి ఈ విషయం గురించి ఆరా తీస్తున్నారు. సుమోటో నోటీసుగా స్వీకరించనున్నట్లు ఆమె చెప్పారు.
Empowering women is not a deterrent to stop violence against women.Shocking to see @BaljinderKaur_ MLA getting slapped in broad day light.Mindset of men has to change.
— Brinder (@brinderdhillon) September 1, 2022
The problem lies in the perpetrator’s of these acts.Change this male chauvinism attitude more then anything else pic.twitter.com/Qxm6rhrtht
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more