BPCL: Apply for over 100 Apprentice posts భారత్ పెట్రోలియంలో ఇంజనీరింగ్ అభ్యర్థుల అప్రెంటీస్..

Bpcl invites applications for 102 graduate apprentice posts

Education, BPCL, BPCL apprentice recruitment 2022, Engineering apprentice 2022, BPCL Engineering Apprentice 2022, BPCL Recruitment 2022, BPCL Apprentice Vacancy 2022, mhrdnats.gov.in, BPCL Apprentice Online Form 2022, BPCL Graduate Apprentice 2022 Apply Online, Apprentice, BPCL Recruitment 2022, jobs in bharat petroleum, apprentice jobs, government jobs, sarkari naukari, public sector jobs, jobs in kochi, kerala jobs

Bharat Petroleum Corporation Limited (BPCL) Kochi has invited online applications from eligible Engineering Graduates. Eligible candidates can apply for the vacancies from August 27 onwards at mhrdnats.gov.in. The last date to enroll in NATS portal and apply for the vacancies is September 8 and 13, 2022. The recruitment drive aims to fill up a total of 102 vacancies in various disciplines.

భారత్ పెట్రోలియంలో ఇంజనీరింగ్ అభ్యర్థుల అప్రెంటీస్..

Posted: 08/29/2022 04:59 PM IST
Bpcl invites applications for 102 graduate apprentice posts

ప్రభుత్వరంగ సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బిపిసీఎల్)లో ఇంజనీరింగ్ గ్రాడుయేట్ల నుంచి అప్రెంటీస్ కోసం ధరఖాస్తులను కోరుతోంది. భారత్ పెట్రోలియం సంస్థలోని వివిధ విభాగాల్లో ఉన్న అప్రెంటిస్‌ కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ధరఖాస్తులను కోరుతొంది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 8 లోపు అప్రెంటీస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ పూర్తి చేసినవారు ఈ అప్రెంటిస్‌లకు అర్హులు. కాగా, బిపిసిఎల్ లోని ఒక యూనిట్ లో ఈ ఏడాదికి అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందులో మొత్తం 102 మంది అభ్యర్థులను భర్తి చేసి.. వారికి శాఖపరమైన శిక్షణను అందించనుంది.

అయితే ఈ అప్రెంటీస్ పోస్టులకు మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసిన పిమ్మట.. ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూలలో ఎంపికైన విద్యార్థులను ఈ అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు కొచ్చి రిఫైనరీలో ఏడాది పాటు అప్రెంటిస్‌ చేయాల్సి ఉంటుంది. ఇక మొత్తం ఖాళీలలో కెమికల్ ఇంజనీరింద్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో అత్యధిక పోస్టులు ఖాళీగా ఉండగా, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ స్ట్రుమెంటేషన్, మెటలర్జీ విభాగాలలో సింగిల్ డిజిట్ ఖాళీలు మాత్రమే ఉన్నాయి.

మొత్తం ఖాళీలు: 102
ఇందులో కెమికల్‌ ఇంజినీరింగ్‌ 31, సివిల్‌ ఇంజినీరింగ్‌ 8, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ 9, ఈఈఈ 5, సేఫ్టీ ఇంజినీరింగ్‌ 10, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ 28, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ 9, మెటల్లర్జీ ఇంజినీరింగ్‌ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ పూర్తిచేసి, 18 నుంచి 27 ఏండ్ల లోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్‌ 8
వెబ్‌సైట్‌: www.mhrdnats.in

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles