Tesla owner implants chip in hand to start car కారును స్టార్ట్ చేయడం కోసం తన చేతికి చిఫ్..

Video tesla owner implants tiny chip into his hand to unlock vehicle

Chip under skin, Chip implantation, Chip implantation under skin, Under skin chip, Chip inside hand, Chip for payment, Chip fto unlock car, Tesla Car Key, tiktok, apple pay, brandon dalaly, Tesla, Tesla vehicle, tesla owner, chip, chip implanted, car keys

Brandon Dalaly, the owner of a Tesla vehicle, had got a chip implanted into his right hand, which would allow him to unlock his vehicle - with ease. Though it might look extreme, Dalaly took the help of a professional body piercer to get this chip implanted in his hand so that he never has to look for his car keys again. Moreover, this chip is coated with a biocompatible substance.

ITEMVIDEOS: కారును స్టార్ట్ చేయడం కోసం తన చేతికి చిఫ్ ఇముడ్చుకున్న టెస్లా కారు యజమాని

Posted: 08/25/2022 04:24 PM IST
Video tesla owner implants tiny chip into his hand to unlock vehicle

ప్రస్తుతం టెక్నాలజీ యుగం నడుస్తోంది. ఎంతలా అంటే దశాబ్దాల కాలం క్రితం ల్యాండ్ లైన్ ఫోన్లను మాత్రమే చూసిన ప్రజలకు.. ఆ తరువాత కొన్నేళ్ల వ్యవధిలోనే పేజర్లు, 2జీ ఫోన్లు, ఆ తరువాత 3జీ ఫోన్లు, వాటిని తలదన్నెలా స్మార్ట్ ఫోన్లు.. అధునాతన కెమెరాలను జోడించిన స్మార్ట్ ఫోన్లు ఇలా సాంకేతిక విప్లవంతో కార్లకే కాదు.. యంత్రికంగా కూడా సాంకేతికత జోడించడం జరిగింది. ఇక తాజాగా కార్ల తాళాలు కూడా అనేక రకాలుగా అందుబాటులోకి వచ్చాయి. తమ స్మార్ట్ ఫోన్లలోని యాప్ ల ద్వారా కూడా కార్లను తెరిచే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది.

ఇక తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక సాంకేతిక కలిగిన టెస్లా కార్లకు.. చిప్ తరహా తాళాలు (కీ) వచ్చాశాయి. రిమోట్ కంట్రోలింగ్ సాంకేతికతను మించి వచ్చిన టెక్నాలజీతో టెస్లా కార్లలో ఈ ఫీచర్ చాలా మందికి తెగనచ్చేసింది. ఇలా అన్‌లాక్ చెయ్యడానికి కొన్ని చిప్‌లు ఉపయోగపడతాయి. అయితే ఈ చిప్ ను అత్యంత జాగ్రత్త కలిగిన టెస్లా కారు యజమాని ముందుజాగ్రత్తతో వ్యవహరించాడు. తన కారును ఇతరులు నడపకుండా, చౌర్యానికి గురికాకుండా.. చిప్‌ను ఏకంగా చేతిలో పెట్టించేసుకున్నాడో కారు యజమాని. అతను కొత్తగా కొన్న టెస్లా కారు లాక్‌ ఓపెన్ చెయ్యడానికి వివోకీ ఎపెక్స్ చిప్ ఉంటే చాలు.

దాన్ని ఏ వస్తువులోనో ఇంప్లాంట్ చేయించడం ఎందుకనుకున్నాడో ఏమోగానీ.. ఆ చిప్‌ను తన చేతిలోనే పెట్టించేసుకున్నాడు బ్రాండన్ డలాలీ అనే వ్యక్తి. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో కూడా పంచుకున్నాడు. ‘‘నా ఫోన్ కీ సమస్యలను నా చేతుల్లోకే తీసుకోవాలని నిర్ణయించుకున్నా. టెస్లా కీ చింప్ ఇంప్లాంట్ చేయించుకున్నా’’ అనే క్యాప్షన్‌తో అతను వీడియో పోస్టు చేశాడు. చిప్ పెట్టిన తర్వాత కారు తాళం తీసేందుకు సెన్సార్ల వద్ద అతని చేతిని ఉంచితే చాలు.. టక్కున లాక్ ఓపెన్ అయిపోతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. బ్రాండన్‌ను పొగడాలో, తిట్టాలో తెలియక తికమక పడిపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tesla Car Key  tiktok  apple pay  brandon dalaly  Tesla  Tesla vehicle  tesla owner  chip  chip implanted  car keys  

Other Articles