‘Dogs keep barking’, says Union minister Ajay Mishra రైతులను కుక్కలుగా పరోక్షంగా అభివర్ణించిన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా

Dogs keep barking says union minister ajay mishra teni after farmers call for his removal

Ajay Mishra Teni, Union minister, BJP, Lakhimpur Kheri, Rakesh Tikait, barking dogs, farmers, Lakhimpur Kheri incident, Lakhimpur Kheri ajay mishra, Ashish Mishra Teni, Ashish Mishra Teni Lakhimpur incident, SKM protest, lucknow news, Uttar Pradesh, Politics

As protesting farmers once again ratchet up their demand for his removal, Union minister Ajay Mishra ‘Teni’ has lashed out at farmer leader Rakesh Tikait, calling him a do kaudi ka aadmi (literally, ‘a man worth two pennies’), and talked about being chased by “barking dogs”.

రైతులను కుక్కలుగా పరోక్షంగా అభివర్ణించిన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా

Posted: 08/24/2022 02:39 PM IST
Dogs keep barking says union minister ajay mishra teni after farmers call for his removal

కేంద్ర మంత్రి, బీజేపీ నేత అజయ్‌ మిశ్రా గుర్తున్నాడా.? ఉత్తరాదికి చెందిన కేంద్రమంత్రి. సుమారుగా రెండేళ్ల క్రితం ఢిల్లీ శివార్లలోని టిక్రి, సింఘీ వంటి శివారు ప్రాంతాలనే తమ అవాసాలుగా చేసుకుని ఏకంగా ఏడాది కాలం పాటు రైతులు నూతన సాగు చట్టాలను బేషరుత్తుగా కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏడాది కాలానికి పైగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసిన విషయం దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. ఈ సమయంలోనే ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తనయుడు అశీశ్ మిశ్రా.. రైతులపై నుంచి తన కారును పోనిచ్చి అమాయక రైతుల మరణాలకు కారణమైన బీజేపి యువనేత.

రెండేళ్లు గడిచిన తరువాత కూడా ఆయనకు రైతులపై సదాభిప్రాయమే లేకుండా పోయింది. తాజాగా కేంద్రమంత్రి అజయ్ మిశ్రా రైతులను ఉద్దేశించి పరోక్షంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోడ్డు వెంట పోతుంటే కుక్కలు మొరుగుతుంటాయని, తాను వాటిని పట్టించుకోనని వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గం లఖింపూర్‌ ఖీరీలో జరిగిన కార్యకర్తల సమావేశంలో అజయ్‌మిశ్రా మాట్లాడిన మాటలు ఇప్పడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బాధిత రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని, కేంద్ర మంత్రి పదవి నుంచి అజయ్‌ మిశ్రాను తప్పించాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘాలు తాజాగా మూడు రోజుల పాటు లఖింపూర్‌లో మహాధర్నా నిర్వహించాయి.

రైతుల ఆందోళన తర్వాత అజయ్‌మిశ్రా లఖింపూర్‌లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. ఇక్కడ ఆయన మాట్లాడుతూ ‘నేను కారులో వేగంగా లక్నోకు వెళ్తున్నానని అనుకోండి.. కుక్కలు మొరుగుతాయి. మొరగడంతో పాటు కారు వెంట కూడా పడుతాయి. అది వాటి సహజ స్వభావం. వాటి గురించి నేనేం చెప్పలేను. అటువంటి స్వభావం మనకు లేదు’ అని అన్నారు. అశిష్‌ మిశ్రా గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రం అజయ్‌మిశ్రా నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. అయితే మీడియా, రైతులుగా చెప్పుకునే వారు తనకు ఇంత పాపులారిటీ తెచ్చిపెడతారని ఎన్నడూ అనుకోలేదని పేర్కొన్నారు.

వీరితో పాటు కెనడా, పాకిస్థాన్‌లో కూర్చొన్న జాతీయేతర రాజకీయ పార్టీలు, ఉగ్రవాదులు.. వీరి కారణంగా తాను మంచి పాపులారిటీ ఆర్జించానని తెలిపారు. ఇంత పాపులర్‌ చేస్తారనివలన ప్రజలు తనను ఎలా ఓడించాలో ఎన్నటికీ తెలుసుకోలేరని ఎగతాళి చేశారు. ఏనుగు తన దారిన తాను వెళ్తుందని, కుక్కలే ఎప్పుడూ మొరుగుతుంటాయని వ్యంగ్యంగా మాట్లాడారు. రైతు నేత రాకేశ్‌ టికాయిత్‌ను కూడా టార్గెట్‌గా చేసుకొని అజయ్‌ మిశ్రా పలు వ్యాఖ్యలు చేశారు. ‘ఎంతమంది రాకేశ్‌ టికాయిత్‌లు వచ్చినా మనల్ని ఏం చేయలేరు. అతనో చౌకబారు మనిషి. రెండుసార్లు ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వ్యక్తి’ అన్నారు. కాగా, లఖింపూర్‌లో గూండారాజ్యం నడుస్తున్నదని టికాయిత్‌ మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles