CBI Raids On Manish Sisodia Over Delhi Liquor Policy లిక్కర్ స్కామ్: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఇంటిపై సిబిఐ దాడులు

Cbi lists 15 accused including delhi deputy cm manish sisodia in excise scam fir

Manish Sisodia, Delhi Excise Policy, CBI raids, Aam Aadmi Party, AAP government, Gujarat Elections, Manish sisodia liquor scam, Gujarat Assembly polls, Delhi Deputy CM, Excise department, Centre's allegations, corruption, liquor policy, Delhi, politics

Manish Sisodia, Delhi's Deputy Chief Minister who also handles the Excise department, was raided by the CBI today over the Centre's allegations of corruption in the . The Aam Aadmi Party government has denied the allegations.

లిక్కర్ స్కామ్: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఇంటిపై సిబిఐ దాడులు

Posted: 08/19/2022 01:41 PM IST
Cbi lists 15 accused including delhi deputy cm manish sisodia in excise scam fir

దేశవ్యాప్తంగా పలు కేసులకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ దాడులన్నీ రాజకీయ కక్ష సాధింపులో బాగంగానే కొనసాగుతున్నాయిని విపక్షాలన్నీ ఏకపక్షంగా గళం విప్పుతున్నా.. అధికారంలోని బీజేపి మాత్రం నోరు విప్పకుండా.. కేవలం వారి విమర్శలను మాత్రమే టార్గెట్ చేస్తూ.. అవినీతి పరుల గుండెల్లో సిబిఐ. ఈడీ, ఆదాయపన్ను శాఖలు రైళ్లను పరిగెట్టిస్తున్నాయని వ్యంగంగా విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. అయితే అవినీతిని టార్గెట్ చేసిన ఈ సంస్థలు దేశంలోని ఎన్ని రాష్ట్రాల్లో ఎంతమంది బీజేపి నేతలను టార్గెట్ చేశాయో చెప్పాలని కూడా విపక్షాల నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ విమర్శల పరంపర కొనసాగుతుండగానే.. తాజాగా ఢిల్లీలోని ఆమ్‌ ఆ‍ద్మీ పార్టీపై సీబీఐ ఫోకస్‌ పెట్టింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్ చేయడంతో.. దానికి బాధ్యతలను అందుకున్న ఆ పార్టీ నేతలను బీజేపి పరోక్షంగా లక్ష్యంగా చేసుకుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు సీబీఐ షాక్‌ ఇచ్చింది. కాగా, శుక్రవారం ఉదయం ఢిల్లీలోని మనీష్‌ సిసోడియా నివాసం, సహా పరిసర ప్రాంతాల్లో 20కి పైగా ప్రదేశాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది.

అయితే, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ(లిక్కర్‌ స్కామ్‌) కేసులో జరిగిన అవకతవకలపై కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. సీబీఐ దాడులపై మనీష్‌ సిసోడియా స్పందిస్తూ.. నా ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. నేను సీబీఐ అధికారులకు సహాకరిస్తాను. అధికారులు నాకు వ్యతిరేకంగా ఎలాంటి పత్రాలను స్వాధీనం చేసుకోలేరు. దేశంలో మంచి చేసే వారిని ఇలా వేధింపులకు గురిచేయడం దురదుష్టకరం. విద్యా రంగంలో నేను చేస్తున్న పనిని ఎవరూ ఆపలేరు. నిజం బయటకు వస్తుంది అంటూ ట్విటర​్‌ వేదికగా కామెంట్స్‌ చేశారు.

కాగా, సీబీఐ సోదాల సందర్భంగా కేజ్రీవాల్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. సీబీఐకి స్వాగతం. మేము పూర్తి సహకారం అందిస్తాము. గతంలో కూడా సోదాలు దాడులు జరిగాయి, కానీ ఏమీ కనుగొనబడలేదు. ఇప్పుడు కూడా మీకు ఏదీ దొరకదు అంటూ కామెంట్స్‌ చేశారు. ఇదిలా ఉండగా.. కొద్ది రోజులుగా కేంద్రంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆప్‌ డిప్యూటీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించడం హాట్‌ టాపిక్‌గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles