Two held with fake currency notes worth Rs 2.5 lakh నకిలీ నోట్ల సరఫరా చేస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్

Hyderabad two held with fake currency notes worth rs 2 5 lakh

fake Indian currency notes, fake currency, kingpin, Shaker, Hulsoor, Karnataka, Syed Ansar, Latur, Maharashtra, Shaik Imran, Vattepally, Hyderabad, Mirchowk police station, Task Force south zone, fake notes, fake currency, fortified currency, Hyderabad, latest news Hyderabad fake currency, crime news, latest crime news, Telangana, crime

The Hyderabad Police Thursday arrested two men with fake Indian currency notes worth Rs 2.5 lakh. A hunt is on to arrest the kingpin of the racket. Fake notes of denominations Rs 100, Rs 200, Rs 500, and Rs 2,000 were seized from the accused identified as Syed Ansar (27) of Latur, Maharashtra and Shaik Imran (33) of Vattepally, Hyderabad. The kingpin, Shaker of Hulsoor, Karnataka, is absconding, the police said.

అక్రమ బాటపట్టిన వ్యాపారికి సహకరించిన ఇద్దరికి అరదండాలు..

Posted: 08/18/2022 06:08 PM IST
Hyderabad two held with fake currency notes worth rs 2 5 lakh

వ్యాపారం సక్రమంగా సాగడం లేదని ఓ వ్యాపారి అక్రమ మార్గాలను అన్వేషించాడు. కాగా, నిందితుడికి సహకరించిన ఇద్దరిని పోలీసులు అరదండాలు వేశారు. డబ్బులతోనే సమస్య అనుకున్న ఈ కేటుగాళ్లు డబ్బులనే తయారు చేయడానికి సిద్దమయ్యారు. ఏకంగా నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతరాష్ట్ర ముఠాలోని ఇద్దరు వ్యక్తులను సౌత్​జోన్ ​టాస్క్​ఫోర్స్, మీర్​ చౌక్​పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 2.50 లక్షలు విలువ చేసే నకిలీ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా, పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. పురాణిహవేలిలోని సౌత్​జోన్​ డీసీపీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో సౌత్​జోన్​డీసీపీ సాయి చైతన్య వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన షాకిర్​ స్థానికంగా ​ఎన్ఎస్ ​కంప్యూటర్,​ జిరాక్స్​ సెంటర్‌ను నడుపుతున్నాడు. సంపాదన సరిపోవకపోవడంతో అడ్డదారులను వెతికాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో నకిలీ కరెన్సీని తయారు చేసి మార్కెట్‌లో చలామణి చేయాలని పథకం వేశాడు.

ఈ నేపధ్యంలోనే తన బంధువైన మహారాష్ట్ర లాథూర్​జిల్లా ఇస్లాంపుర ప్రాంతానికి చెందిన సయ్యద్​అన్సార్​(27)ను ఎంచుకున్నాడు. సయ్యద్​అన్సార్​సహకారంతో హైదరాబాద్​పాతబస్తీ వట్టేపల్లి ఫారూక్​నగర్‌కు చెందిన షేక్​ ఇమ్రాన్​(33)ను కూడా నకిలీ కరెన్సీని చలామణికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో 8 వేల ఒరిజినల్​కరెన్సీకి 50 వేల నకిలీ కరెన్సీ ఇస్తున్నాడు. దీంతో నకిలీ కరెన్సీని తీసుకున్న సయ్యద్​ అన్సార్ వాటిని రూ. 15 వేలకు షేక్​ ఇమ్రాన్‌కు అందిస్తున్నాడు. ఇక షేక్ ఇమ్రాన్ నకిలీ నోట్లను హైదరాబాద్​ నగరం పాటు ఇతర ప్రాంతాలలో చలామణి చేస్తున్నారు.

విశ్వనీయ సమాచారం మేరకు సౌత్​జోన్ ​టాస్క్​ఫోర్స్ అడీషనల్​ డీసీపీ స్నేహ ఆధ్వర్యంలో మీర్​చౌక్​ పోలీస్ ​స్టేషన్​ పరిధిలోని ఎంజిబిఎస్ ​అవుట్​గేట్​ వద్ద దాడులు నిర్వహించారు. నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న సయ్యద్​ అన్సార్‌తో పాటు షేక్​ ఇమ్రాన్‌లను రెడ్​హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2.50 లక్షల విలువ గల రూ. 100, 200, 500, 2000 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న షాకేర్​కోసం పోలీసులు గాలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరిని మీర్​చౌక్​ పోలీసులకు అప్పగించారు. ఈ కేసును మీర్​చౌక్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles